Nirbhaya convict files curative petition in SC సుప్రీంలో ‘నిర్భయ’ దోషి వినయ్ శర్మ క్యూరేటివ్ పిటీషన్

Nirbhaya convict files curative petition in supreme court days before hanging

curative petition, Vinay Sharma, Nirbhaya case convicts, Tihar jail, Nirbhaya convicts hanging, Nirbhaya case, Nirbhaya convicts mercy petition, nirbhaya murder case Pawan Gupta, Mukesh singh, Vinay Sharma, Akshay Thakur, Nirbhaya, Murder, Rape, Supreme Court, gang-rape, Mount Elizabeth Hospital, Tihar jail, Crime

Days after a court issued the death warrants against all four convicts in 2012 Nirbhaya Delhi gang-rape case, one of the convicts on Thursday filed a curative petition in the Supreme Court.

సుప్రీంలో ‘నిర్భయ’ దోషి వినయ్ శర్మ క్యూరేటివ్ పిటీషన్

Posted: 01/09/2020 03:34 PM IST
Nirbhaya convict files curative petition in supreme court days before hanging

నిర్భయ దోషి వినయ్‌ కుమార్‌శర్మ సుప్రీంకోర్టులో క్యురేటివ్‌ పిటిషన్‌ దాఖలు చేశాడు. ఉరిశిక్షపై స్టే ఇవ్వాలని పిటిషన్‌ దాఖలు చేశాడు వినయ్‌ కుమార్‌ శర్మ. న్యాయపరంగా తనకున్న చివరి అవకాశాన్ని శర్మ వినియోగించుకున్నాడు. అయితే నిర్భయ దోషులకు ఈ నెల 22న ఉదయం 7 గంటలకు ఉరిశిక్ష అమలు చేయాలని ఢిల్లీ పటియాలా కోర్టు డెత్‌ వారెంట్లు జారీ చేసింది. నిర్భయ దోషులకు డెత్‌ వారెంట్‌ జారీ చేస్తూ రెండు రోజుల క్రితం ఢిల్లీ పటియాలా కోర్టు సంచలన తీర్చు వెల్లడించిన విషయం తెలిసిందే.

ఈ నెల 22న ఉదయం గంటలకు తిహార్ జైల్లో వీరిని ఉరి తీయాలని న్యాయస్థానం ఆదేశించింది. ఆలోగా దోషులు తమకున్న న్యాయపరమైన అవకాశాలను వినియోగించుకునే వెసలుబాటును కూడా కల్పించింది. ఈ నేపధ్యంలో వినయ్‌ శర్మ నేడు క్యురేటిన్‌ పిటిషన్‌ దాఖలు చేశాడు. తనకు ఉరిశిక్షపై స్టే విధించాలని పిటీషన్ దాఖలు చేశాడు. ఇక ఈ పిటీషన్ తో తనకు ఉరిశిక్ష పడకుండా అడ్డుకోగల చివరి అస్త్రాన్ని వినియోగించుకున్నాడు వినయ్ శర్మ. వినయ్ శర్మ పిటీషన్ పై న్యాయస్థానం విచారణకు స్వీకరించిన నేపథ్యంలో అతని తరువాత మిగతా ముగ్గురు నిందితులు కూడా అతన్నే ఫాలో అవుతారా.? లేదా అన్నది వేచి చూడాలి.

దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన నిర్భయ సామూహిక హత్యాచార కేసులోని నలుగురు దోషులు డెత్ డేట్ కన్ఫామ్ చేసిన తరువాత వినయ్ శర్మ మరోమారు క్యూరేటివ్ పిటీషన్ ను దాఖలు చేశాడు. నేరానికి పాల్పడిన సమయంలో తానింకా మైనర్ బాలుడినేనని తన పిటీషన్ లో పేర్కొన్నాడు. ఇటీవల ఈ పిటీషన్ ను కింది న్యాయస్థానం కోట్టివేసిన క్రమంలో ఆయన ఈ సారి దేశ సర్వోన్నత న్యాయస్థానంలో పిటీషన్ ను దాఖలు చేశాడు. మరి నిర్భయ కేసులో దోషిగా తేలిన వినయ్ శర్మ పిటీషన్ దేశ అత్యున్నత న్యాయస్థానం ఎలా స్పందిస్తుందోనని సర్వత్రా ఆసక్తి నెలకొంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Nirbhaya  Murder  Rape  convicts  Tihar jail  gallows  hanging  curative petition  Vinay Sharma  New Delhi  crime  

Other Articles

Today on Telugu Wishesh