Most Indian Nobel winners Brahmins: Gujarat Speaker గుజరాత్ అసెంబ్లీ స్పీకర్ వివాదాస్పద వ్యాఖ్యలు..

Gujarat assembly speaker rajendra trivedi in trouble with controversy statments

amebdkar, B N Rau, BN Rau, bn rau constituent assembly, bn rau constitution assembly, Brahmin, brahmin dna, brahmin summit, brahmin supremacy, Brahminism, DNA, gujarat assembly speaker, gujarat assembly speaker rajendra trivedi, Om Birla, rajendra trivedi, rajendra trivedi brahmins, rajendra trivedi gujarat, rau, Vijay Rupani, Gujarat, Polictics

Gujarat assembly speaker and BJP leader Rajendra Trivedi stirred a controversy when he hailed Brahmins as a community with a different “DNA” than others. He also said that Brahmins have the “birthright” to “give blessings to everyone.

గుజరాత్ అసెంబ్లీ స్పీకర్ వివాదాస్పద వ్యాఖ్యలు..

Posted: 01/04/2020 06:40 PM IST
Gujarat assembly speaker rajendra trivedi in trouble with controversy statments

భారత రాజ్యాంగ ముసాయిదా రచనపై గుజరాత్ అసెంబ్లీ స్పీకర్ రాజేంద్ర త్రివేది తాజాగా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. భారత రాజ్యాంగ ముసాయిదాను బ్రాహ్మణుడైన బీఎన్ రౌ రాశారని, ఈ విషయాన్ని డాక్టర్ బీఆర్ అంబేద్కరే స్వయంగా చెప్పి, బీఎన్ రౌకు క్రెడిట్ ఇచ్చారని స్పీకర్ రాజేంద్ర త్రివేది వ్యాఖ్యానించారు. బ్రాహ్మణులు ఎప్పుడూ ఇతర ప్రజల సంక్షేమాన్ని ప్రోత్సహిస్తారని చరిత్ర చెబుతుందని రాజేంద్ర పేర్కొన్నారు. అడాలజ్ పట్టణంలో జరిగిన ‘మెగా బ్రాహ్మణ బిజినెస్ సదస్సు’లో గుజరాత్ అసెంబ్లీ స్పీకర్ రాజేంద్ర త్రివేది మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.

ఆర్థికవేత్త అభిజిత్ బెనర్జీతో సహా 9 మంది భారతీయ నోబెల్ విజేతలలో 8 మంది బ్రాహ్మణులు అని ఆయన పేర్కొన్నారు. ‘‘60 దేశాల రాజ్యాంగాలను అధ్యయనం చేసి,మన ముసాయిదా రాజ్యాంగం తయారు చేశారని మీకు తెలుసా? ఆ ముసాయిదాను డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కు ఎవరు సమర్పించారో మీకు తెలుసా? రాజ్యాంగం విషయానికి వస్తే మనమందరం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పేరును గౌరవంగా తీసుకుంటాం...అయితే, అంబేద్కర్ సొంత మాటల్లోనే ముసాయిదాను బీఎన్ రౌ (బెనెగల్ నర్సింగ్ రౌ) అనే ఒక బ్రాహ్మణుడు తయారు చేశాడు’’ అని రాజేంద్ర త్రివేది చెప్పారు.
 
‘‘బ్రాహ్మణులు ఎప్పుడూ వెనుక నిలబడి ఇతరులను ప్రోత్సహిస్తారని చరిత్ర చెబుతుంది. బీఎన్ రౌ అంబేద్కర్‌ను తనకంటే ముందు ఉంచారు.1949 నవంబర్ 25 న జరిగిన రాజ్యాంగ సభలో తన ప్రసంగంలో అంబేద్కర్ ఈ విషయాన్ని అంగీకరించినందున మేం గర్విస్తున్నాం ”అని త్రివేది వివరించారు. గత నెలలో ఢిల్లీలో జరిగిన అగ్నిప్రమాదంలో 11 మందిని రక్షించిన ఢిల్లీ అగ్నిమాపకశాఖ జవాన్ రాజేష్ శుక్లా కూడా బ్రాహ్మణుడేనని, ఈయన కూడా తమ బ్రాహ్మణ కులానికి ఆదర్శంగా నిలిచారని తివారీ చెప్పారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : amebdkar  B N Rau  constitution  brahmin dna  gujarat assembly speaker  rajendra trivedi  Gujarat  Polictics  

Other Articles