IRCTC revises meal, breakfast prices ఐఆర్సీటీసీ అల్పాహారం, బోజన ధరలు పెంచేసిందోచ్.!

Irctc revises meal breakfast prices at railway stations

Food and drink, Cuisine by country, Cuisine, Indian Railway Catering and Tourism Corporation, Biryani, Indian Railways, Government of India, Sennheiser RS 120 Headphone/Headset, Ministry of Railways, member hotels, IRCTC, Northern India, catering, IRCTC,Indian Railways,Standard Meals in Mail trains,Standard Meals in Express trains,IRCTC shares

At least nine people died while two others were critically injured in a massive fire at a cloth godown in Delhi's Kirari area, a fire official said. The fire broke out in the early hours of Monday around 12:30 am. The fire started on the ground floor of the four-storeyed building, where the godown is located, and subsequently spread till the third floor.

ఐఆర్సీటీసీ అల్పాహారం, బోజన ధరలు పెంచేసిందోచ్.!

Posted: 12/24/2019 02:56 PM IST
Irctc revises meal breakfast prices at railway stations

రైల్వే మంత్రిత్వ శాఖ రైల్వే ప్రయాణికులపై భారం మోపింది. సందట్లో సడేమియా అన్నట్టు దేశవ్యాప్తంగా పలు అంశాలు పతాకశీర్షికలను ఆక్రమిస్తున్న క్రమంలో గుట్టుచప్పుడు కాకుండా రైల్వే కోచ్ లలో విక్రయించే బోజన, అల్పాహార ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. భారతీయ రైళ్లలో బోజన, అల్పాహార సదుపాయాలు కల్పించే భారతీయ రైల్వే కేటరింగ్‌ అండ్‌ టూరిజమ్‌ కార్పొరేషన్‌ (ఐఆర్సీటీసీ) ఆహార ధరలను సవరించింది. ఇలా నిర్ణయం తీసుకుందో లేదో అలా అప్పుడే లాభాన్ని కూడా అందుకుంది.

ఈ మేరకు ఐఆర్సీటీసీకి చెందిన షేర్లు మూడు నుంచి నాలుగు శాతం మేర లాభాలను కూడా గడించింది. దీంతో ఒక్క దెబ్బకు రెండు పిట్టలు అన్నట్లు ఇటు ప్రయాణికులపై వడ్డనతో లాభం.. అటు షేర్ల ధరల పెంపుతో లాభాన్ని ఆస్వాధించింది. దీంతో రైల్వేస్టేషన్లలో ఆహారశాలల్లో ఈ ధరల మార్పు వర్తిస్తుంది. ఈ విషయాన్ని ఐఆర్సీటీసీ స్టాక్‌ ఎక్స్ఛేంజీకి చేసిన ఫైలింగ్ లో పేర్కొంది. ‘‘రైల్వే మంత్రిత్వ శాఖ రైల్వేస్టేషన్లలో ఏర్పాటు చేసిన ఆహారశాలల్లో ప్రామాణిక ఆహార ధరలను మార్చింది’’ అని దానిలో వెల్లడించింది.

ఈ మార్పులతో జనాహార్‌, రిఫ్రెష్‌మెంట్‌ రూమ్స్‌లలో అందించే అహార పదార్థాల ధరలు ఇకపై పెరగనున్నాయి. మెనుకు సంబంధించి ఇతర ప్రామాణిక భోజనం, జనతా మీల్స్‌, మెయిల్‌, ఎక్స్‌ప్రెస్‌ రైళ్లలో ఆహారానికి కూడా ఇవే రేట్లు వర్తిస్తాయి. ఈ ధరల పెంపు ద్వారా ఐఆర్సీటీసీ, జోనల్‌ రైల్వేల్లో అందించే ఆహారం నాణ్యత, శుభ్రత పెరగాలని వెల్లడించింది. దీనిని అంచనా వేసేందుకు తనిఖీలు చేస్తామని పేర్కొంది. అయితే న్యాణ్యతలోనూ.. ఇప్పటికే ఐఆర్సీటీసీ అనేక విమర్శలను ఎదుర్కొంటూనే వుంది. దీనికి తోడు క్వాంటిటీ కూడా అత్యల్పంగానే వుంటుందని అరోపణలు ఇప్పటికీ వున్నాయి.

సవరించిన ధరలను పరిశీలిస్తే:

వెజిటేరియన్‌ బ్రేక్ ఫాస్ట్‌: రూ. 35
నాన్‌ వెజిటేరియన్‌ బ్రేక్ ఫాస్ట్‌: రూ.45
వెజ్‌ మీల్స్‌: రూ.70
స్టాండర్డ్‌ మీల్స్‌(కోడిగుడ్డు కూరతో): రూ.80
స్టాండర్డ్‌ మీల్స్‌(కోడిమాంసం కూర): రూ.120
వెజ్‌ బిర్యానీ(350గ్రాములు) : రూ.70
ఎగ్‌ బిర్యానీ: రూ.80
చికెన్‌ బిర్యానీ: రూ.100
స్నాక్‌ మీల్‌(350 గ్రాములు): రూ.50

అయితే ఆహార పదార్థల ధరలన్నీ జీఎస్టీతో కలసి వున్నాయని, ఇక అదనంగా ఎలాంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదని చెప్పింది. దీంతో సామాన్యుల పర్సులపై భారీగానే బరువు పడనుంది. ఒక్క వెజ్ బిర్యానిపైనే ఏకంగా రూ.20 పెంచుతూ ఐఆర్సీటీసీ నిర్ణయం తీసుకోవడంతో కుటుంబసమేతంగా కలసి వెళ్లే ప్రయాణికులు రైళ్లలో తినాలంటే జేజుకు చిల్లు పడాల్సిందే. తొమ్మిది మందితో కలసి కన్యాకుమారి నుంచి ఢిల్లీకి వెళ్లే ప్రయాణికుడి ఖర్చు ఊహించుకుంటేనే ప్రయాణాలు మానుకోవాలనిపించేలా ధరలను పెంచేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles