9 killed, 3 injured in Delhi godown fire ఢిల్లీలో వస్త్ర గోదాములో అగ్నిప్రమాదం.. 9 మంది మృతి..

Delhi 9 dead 2 critically injured in massive fire at kirari godown

Delhi fire, kirari fire, fire in delhi, cloth store, nine dead, Kirari fire tragedy, Kirari fire accident, Kirari fire, Kirari, fire in Delhi, delhi news, Crime

At least nine people died while two others were critically injured in a massive fire at a cloth godown in Delhi's Kirari area, a fire official said. The fire broke out in the early hours of Monday around 12:30 am. The fire started on the ground floor of the four-storeyed building, where the godown is located, and subsequently spread till the third floor.

ఢిల్లీలో వస్త్ర గోదాములో అగ్నిప్రమాదం.. 9 మంది మృతి..

Posted: 12/23/2019 10:57 AM IST
Delhi 9 dead 2 critically injured in massive fire at kirari godown

ఢీల్లీలో మరోమారు అగ్ని ప్రమాదం అమాయక కార్మికుల అసువులు తీసింది. తెల్లవారు జామున ఢిల్లీలోని కిరారి ప్రాంతంలో జరిగిన అగ్ని ప్రమాదంలో ఎగసిన అగ్నికిలలకు తొమ్మిది మంది సజీవ దహనమయ్యారు. మరో పది మంది తీవ్రంగా గాయపడ్డారు. కాగా క్షతగాత్రుల్లో ఇద్దరి పరిస్థితి విషమంగా వుంది. గాయాలపాలైన వారిని హుటాహుటిన సంజయ్ గాంధీ అసుపత్రికి తరలించారు. గత రాత్రి 12:30 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది.

వివరాల్లోకి వెళ్తే.. ఢిల్లీలోని కిరారి ప్రాంతంలో గల ఓ వస్త్ర గోదాములో గత అర్థరాత్రి మంటలు అంటుకుని అగ్నికీలలు ఎగసిపడ్డాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. కేసును నమోదు చేసుకున్న పోలీసులు ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు. మంటలు చెలరేగడానికి గల కారణాలను పరిశీలిస్తున్నారు.

కాగా, ఈ నెల 8న అనాజ్‌ మండి ప్రాంతంలో జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో 43 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలోని మృతుల కుటుంబాలకు ఢిల్లీ ప్రభుత్వం రెండు లక్షల రూపాయల చొప్పునా.. కేంద్రంలోని బీజేపి ప్రభుత్వం రూ. 10 లక్షల చోప్పునా ఆర్థిక సాయాన్ని ప్రకటించింది. అయితే ఈ ఘటన జరిగి పక్షం రోజులు కూడా తిరగకముందే మరో ప్రమాదం సంభవించడంతో ఢిల్లీ వాసుల్లో అందోళన కలిగిస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Kirari fire tragedy  Kirari fire accident  Kirari fire  Kirari  fire in Delhi  delhi news  Crime  

Other Articles