Let me hang Nirbhaya convicts: shooter Vartika Singh నిర్భయ దోషులకు ఉరి వేసే అవకాశమివ్వండీ: మహిళా షూటర్..

Let me hang nirbhaya case convicts shooter vartika singh requests centre

nirbhaya rape, nirbhaya case convicts, vartika singh, buxar jail, hang woman, nirbhaya convictsMukesh singh, Akshay Thakur, pawan Gupta, Ram singh, Vinay Sharma, President, Ram Nath Kovind, nirbhaya, gangrape, supreme court, delhi high court, rapists, death penalty, nirbhaya case, crime

Shooter Vartika Singh on December 15 wrote a letter in blood requesting the Centre to let her hang the rapists convicted in the Nirbhaya rape and murder case, a day before the victim’s seventh death anniversary.

నిర్భయ దోషులకు ఉరి వేసే అవకాశమివ్వండీ: మహిళా షూటర్..

Posted: 12/16/2019 10:54 AM IST
Let me hang nirbhaya case convicts shooter vartika singh requests centre

దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన నిర్భయ ఘటనలో దోషులకు శిక్ష ఖరారు చేయడంతో పాటు త్వరలోనే వారిని ఉరితీస్తారన్న ఊహాగానాలు కూడా వినిపిస్తున్న క్రమంలో వారిని తానే ఉరి తీస్తానని.. మహిళా షూటర్ వర్టికా సింగ్ తిహార్ జైలు అధికారులను కోరారు. ఈ మేరకు అమె తన రక్తంతో రాసిన ఓ లేఖను కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు రాశారు. నిర్భయ ఘటనలోని నలుగురు దోషులను సత్వరమే ఉరితీయాలనే డిమాండ్ ఊపందుకున్న తరుణంలో వారి కోసం ఉరి తాళ్లను కూడా సిద్దం చేయాల్సిందిగా అదేశాలు వెళ్లాయని, ఈ క్రమంలో తలారీ కోసం అన్వేషణ సాగుతోందని తెలియడంతో.. షూటర్ వర్టికా సింగ్ కోరారు.

మహిళలను అపరకాళిగా భావిస్తారని, దోషులను ఉరితీసే అవకాశం తనకిస్తే ఆ భావన మరింత బలపడుతుందని, ప్రపంచానికి బలమైన సందేశం వెళ్తుందని వర్టికా సింగ్ తాను రాసిన లేఖలో పేర్కొన్నారు. మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడితే తమను వారే ఉరికి వేలాడదీస్తారన్న విషయం రేపిస్టులకు తెలియాలన్నారు. ఈమేరకు రక్తంతో రాసిన లేఖను స్పీడ్‌ పోస్టు ద్వారా అమిత్ షాకు పంపానని, ట్విటర్లోనూ పోస్ట్‌ చేశానని తెలిపారు. ఈ విషయంలో తనకు మహిళా సైనికులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, సంస్థలు మద్దతుగా నిలవాలని... ఇది సమాజంలో మార్పు తీసుకురావడానికి సహకరిస్తుందని తాను భావిస్తున్నానట్టు తెలిపింది.

ఇదిలా ఉండగా, నిర్భయ దోషులను ఉరితీసే అవకాశమివ్వాలని చాలామంది తమకు లేఖలు రాసినట్టు తీహార్ జైలు అధికారులు పేర్కొన్నారు. అత్యాచారానికి పాల్పడినవారిని ఆరునెలల్లోగా ఉరితీయాలనే డిమాండ్ తో పదిరోజుల నుంచి నిరాహార దీక్ష చేస్తున్న ఢిల్లీ మహిళా కమిషన్‌ చీఫ్‌ స్వాతి మాలీవాల్‌ ఆరోగ్యం విషమించింది. ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. అత్యవసర విభాగంలో ఆమెకు చికిత్స అందజేస్తున్నారు. స్వాతి మలివాల్ ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు పేర్కొన్నారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : nirbhaya  gangrape  supreme court  vartika singh  rapists  hanged  death penalty  nirbhaya convicts  crime  

Other Articles