Leopard Attacks Stray Dog In Mumbai గ్రామసింహంతో తలపడిన చిరుత.. ఏం జరిగిందీ..

Leopard attacks two stray dogs in mumbai watch chilling footage

Leopard, leopard attack, dog, Stray dog, Mumbai, SEEPZ, leopard attack video, leopard attack dog, andheri, andheri east, Telecom Power, Awaaz Voice of Stray Animals, Viral video, leopard attack video

A leopard attacked two stray dogs near SEEPZ in Andheri (East), Mumbai in the early hours of Monday. One of the terrifying attacks was captured on a surveillance camera.

ITEMVIDEOS: గ్రామసింహంతో తలపడిన చిరుత.. ఏం జరిగిందీ..

Posted: 12/12/2019 03:54 PM IST
Leopard attacks two stray dogs in mumbai watch chilling footage

దేశంలో జనాభా అంతకంతకూ పెరుగుతూ.. వన్యప్రాణులు నివసించే అడవులలోనూ యధేశ్చగా సంచరించడం వల్ల.. తమ గూడును అక్రమిస్తున్న మనుషులుండే ప్రాంతాలకు వన్యప్రాణులు వలసవస్తున్నాయి. ఇలాంటి పరిణామాలు కెమెరాలో నిక్షిప్తం కావడంతో.. అవికాస్తా నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. దేశ అర్థిక రాజధాని ముంబై నగరంలోని అంధేరీ తూర్పులో చిరుత సంచారం కలకలం రేపింది. ఈ విడియోను సిసీటీవీలకు చిక్కడంతో.. దానిని సోషల్ మీడియాలో అప్ లోడ్ చేశారు. అదికాస్తా వైరల్ అయ్యింది.

సోమవారం తెల్లవారుజామున సీప్జ్‌ మెట్రో స్టేషన్‌ సమీపంలో ఓ వీధి కుక్కపై చిరుత దాడికి పాల్పడింది. సీప్జ్‌కు ఎదురుగా ఉన్న టెలికామ్‌ పవర్‌గేట్‌ సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. కుక్కను కొద్ది దూరం లాక్కెళ్లిన చిరుత దానిపై దాడికి యత్నించింది. చిరుత బారి నుంచి తప్పించుకునేందుకు కుక్క తీవ్రంగా ప్రయత్నించింది. ఆ ప్రాంతంలో రక్తం కూడా చిందింది.. అయినప్పటికీ కుక్క చిరుతతో పోరాడింది. చివరకు చిరుత అక్కడి నుంచి పరిగెత్తుతుండగా.. కుక్క దాని వెంబండించింది.

అయితే చిరుత, కుక్క అక్కడి నుంచి వెళ్లిపోవడంతో ఆ తర్వాత ఏం జరిగిందనేది తెలియలేదు. కుక్కపై చిరుత దాడికి పాల్పడిన దృశ్యాలు అక్కడి సీసీటీవీ కెమెరాల్లో నమోదయ్యాయి. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఘటనపై అక్కడి పరిసరాల్లో పనిచేస్తున్న ఓ సెక్యూరిటీ గార్డు మాట్లాడుతూ.. తాను తెల్లవారు జామున 3 గంటలకు చిరుత రాకను గుర్తిచినట్టు తెలిపారు. దీంతో భయం వేసి తన క్యాబిన్‌ డోర్‌ను గట్టిగా లాక్‌ చేసుకున్నట్టు చెప్పారు. చిరుత సంచారంపై అవాజ్‌ వాయిస్‌ ఎన్జీవోకు ఫోన్‌ చేశానని చేప్పారు.

దీంతో వారు అక్కడికి చేరుకుని చిరుత దాడిలో గాయపడిన కుక్కకు ప్రాథమిక చికిత్స అందించారని తెలిపారు. ఈ ఘటనను అటవీశాఖ అధికారి సంతోష్‌ కాంక్‌ ధ్రువీకరించారు. చిరుత సంచారాన్ని గుర్తించి.. దానిని పట్టుకునేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నట్టు వెల్లడించారు. అంధేరీ తూర్పు ప్రాంతంలో పెట్రోలింగ్‌ కూడా నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రస్తుతం చిరుత దాడిలో గాయపడిన కుక్కకు చికిత్స అందిస్తున్నారు. కాగా, జనావాసాల్లో చిరుత సంచరించడంపై స్థానికులు భయభ్రాంతులకు గురవుతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Leopard  leopard attack  Stray dog  Mumbai  Stray Animals  Viral video  Video viral  

Other Articles

 • Telangana govt proposes to conduct eamcet in sept second week

  తెలంగాణ ఎంసెట్ పరీక్షలకు తేదీల ఖరారు..

  Aug 11 | కరోనా నేపథ్యంలో మూతపడిన విద్యాలయాలు ఎప్పుడు తెరుచుకుంటాయా.? అని పాఠశాల యాజమాన్యాలు ఎదురుచూస్తున్న తరుణంలో.. తెలంగాణ ప్రభుత్వం వారి  ఎదురుచూపులపై నీళ్లు చల్లింది. అయతే ఈసెట్, పాలీసెట్, ఎంసెట్ పరీక్షలను ఎప్పుడు నిర్వహించే విషయమై... Read more

 • Rebel rajasthan congress mla bhanwar lal sharma meets cm ashok gehlot

  రాజస్థాన్ సంక్షోభం: గెహ్లాట్ కు జైకొట్టిన బన్వర్ లాల్ శర్మ

  Aug 10 | రాజస్థాన్ లోని అధికార కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏర్పడిన రసకందాయ పరిస్థితి క్రమంగా సద్దుమణుగుతోంది. ఇప్పటికే ఈ పరిస్థితులను ఓ కొలిక్కి తీసుకువచ్చేందుకు ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్న సందర్భంలో.. ఆయనకు అసమ్మతి... Read more

 • Coronavirus in ap 7665 new covid 19 cases state tally crosses 2 35 lakh mark

  ఏపీలో కరోనా విజృంభన: 24 గంటల్లో 7665 కేసులు.. 80 మరణాలు

  Aug 10 | ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ విజృంభన కొనసాగుతోంది. మే నెల చివరి వారం నుంచి వేగాన్ని పుంజుకున్న కరోనా మహమ్మారి రాష్ట్రంలో రోజుకు వందలాది మందిని తన ప్రభావానికి గురిచేస్తూ ఏకంగా రెండు లక్షల... Read more

 • Margadarsi chits and finance case sc issues notices to ramoji rao

  ఈనాడు సంస్థల చైర్మన్ రామోజీరావుకు సుప్రీంకోర్టు నోటీసులు

  Aug 10 | ఏళ్ల క్రితం సంచలనంగా మారిన మార్గదర్శి కేసు మరోమారు వెలుగులోకి వచ్చింది. ఈ కేసును విచారించనున్న నేపథ్యంలో ఈనాడు సంస్థల అధినేత (చైర్మన్) రామోజీరావుకు దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది.... Read more

 • Former president pranab mukherjee tested positive for covid 19

  మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి కరోనా పాజిటివ్.!

  Aug 10 | యావత్ ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా ఏకంగా 7 లక్షల 32 వేల మందిని కబళించి వేసింది. ప్రపంచవ్యాప్తంగా వివిధ రంగాలకు చెందిన నిఫుణులు, అనేక మంది ప్రముఖులను కూడా కబళించింది. ఎందరెందరో... Read more

Today on Telugu Wishesh