Restrictions at Sabarimala Ayyappa Swamy temple శబరిమల కొండపై ఆంక్షలు.. భక్తులూ ఇవి నిషిద్దం.!

Restrictions at sabarimala ayyappa swamy temple

sabarimala, Deity, Ayyappa Swamy, Lord Ayyappa, Travancore devasam board, devotees, mobile phones, Kerala, Andhra Pradesh, Telangana

Travancore Devasam board had implimented few retrictions on ayyappa swamy and other devotees at Lord Ayyappa Swamy Shrine at Sabarimala, where it had banned devotees carrying of mobiles phones.

శబరిమల కొండపై ఆంక్షలు.. భక్తులూ ఇవి నిషిద్దం.!

Posted: 12/05/2019 10:58 AM IST
Restrictions at sabarimala ayyappa swamy temple

అయ్యప్పస్వామి కొలువైన శబరిమల కొండకు వెళ్లేందుకు తెలుగు రాష్ట్రాల నుంచి లక్షలాధి మంది భక్తులు మాలాధారణ చేసుకుని మండల పూజ నిర్వహిస్తున్నారు. మండలం పూర్తైన తరువాత ఇరుముడి ధరించి ఎంతో భక్తిప్రవత్తులతో శబరిమల కొండకు చేరకుంటారు. ఇక మరికొందరు భక్తులు సివిల్ స్వాములు కూడా మాలాధారణ లేకుండా వెళ్లి దర్శనం చేసుకుంటారు. అయితే ఈ సారి శబరిమలకు చేరకునే భక్తులకు ట్రావన్ కోర్ దేవస్థానం బోర్డు ఆంక్షలు విధించింది. ఇందులో భాగంగా భక్తులు సెల్ ఫోన్ వినియోగాన్ని నిషేధించింది.

ఆలయంలోని గర్భగుడి సహా పరిసర ప్రాంతాల్లో మోబైల్ ఫోన్ వినియోగించకూడదని ఆంక్షలు విధించింది. ఈ మేరకు ట్రావెన్ కోర్ దేవస్తానం బోర్డు అధికారులు ఓ ప్రకటన విడుదల చేశారు. అత్యంత భద్రతతో కూడిన అయ్యప్ప స్వామి గర్భాలయం, స్వామి మూలవిరాట్ మూర్తికి సంబంధించిన ఫోటోలు ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీని కారణంగా ఆలయ పవిత్రత, దెబ్బతింటోందని యాజమాన్యం భావించింది. వీటికి కారణమైన సెల్ ఫోన్ ను ఆయన పరిసరాల్లో నిషేధించడం ఒక్కటే దీన్ని అరికట్టేందుకు మార్గంగా భావించి ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.

శబరిమలలో ఇరుముడి ధరించిన అయ్యప్పస్వాములకు మాత్రమే 18 బంగారు మెట్లు ఎక్కే అవకాశం వుండటంతో.. వారు ఇలా ఆ పదునెట్టాంబడి ఎక్కుతున్న క్రమంలో వారితో వచ్చిన సివిల్ స్వాములు తమ మోబైల్ లో వారి ఫోటోలను క్లిక్ చేస్తున్నారని కూడా దేవస్తానం బోర్డు ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. దీంతోపాటు గర్భాలయం పరిసర ప్రాంతాలను అత్యంత పవిత్రమైన ప్రాంతాలుగా భావిస్తారు. అందుకే ఈ ప్రాంతాల్లో సెల్‌ఫోన్ల వాడకాన్ని పూర్తిగా నిషేధించింది. కూలంకశంగా చర్చించాకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు బోర్డు సభ్యులు ప్రకటించారు.

అంతే కాదు.. బోర్డు ఆదేశాలను అతిక్రమించి ఆలయ పరిసర ప్రదేశాల్లో సెల్‌ఫోన్లను వాడిన క్రమంలో కఠిన చర్యలు తీసుకుంటామని కూడా దేవస్తానం బోర్డు హెచ్చింరింది. అదే సమయంలో ఈ ఏడాది అయ్యప్ప భక్తుల సంఖ్య గణనీయంగా పెరిగిందని దేవస్వోమ్ బోర్డు ప్రకటించింది. నవంబరు 16 నుంచి డిసెంబరు 3 వరకు దాదాపు 7 లక్షలకు పైగా భక్తులు అయ్యప్ప దర్శనానికి వచ్చారని అంచనా. ఈ ఏడాది నవంబరు 16 నుంచి వార్షిక మండల పూజ ప్రారంభమైంది. అప్పటి నుంచి భారీ సంఖ్యలో భక్తులు, అయ్యప్ప మాలధారులు శబరిమల కొండకు వస్తున్నట్లు శబరిమల అయ్యప్ప ఆలయం బోర్డు తెలిపింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles