P Chidambaram gets bail in INX Media case ఐఎన్ఎక్స్ మీడియా కేసులో.. చిదంబరానికి భారీ ఊరట..

Relief for chidambaram after 106 days as supreme court grants bail in inx media case

Chidambaram, supreme court, ed, inx media case, chidambaram gets bail, chidambaram bail plea, chidambaram news, verdict on chidambaram bail plea, inx media case, chidambaram bail, chidambaram case, p chidambaram news, p chidambaram, karti chidambaram, p chidambaram bail plea, sc order on chidambaram bail, congress leader p chidambaram plea, Crime

The Supreme Court on Wednesday granted bail to P Chidambaram in the INX Media corruption case. Chidambaram will be walking out of the Tihar jail after being in custody for over 100 days.

ఐఎన్ఎక్స్ మీడియా కేసులో.. చిదంబరానికి భారీ ఊరట..

Posted: 12/04/2019 11:30 AM IST
Relief for chidambaram after 106 days as supreme court grants bail in inx media case

కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరంకు ఐఎన్ఎక్స్ మీడియా మనీ లాండరింగ్ కేసులో భారీ ఊరట లభించింది. ఈ కేసులో ఈడీ (ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్)  నమోదు మోపిన అభియోగాలపై దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. చిదంబరంకు బెయిల్ పిటీషన్ పై విచారణ జరిపిన అత్యున్నత న్యాయస్థానం 106 రోజుల తరువాత ఆయనకు కండీషనల్ బెయిల్ మంజూరు చేస్తూ తీర్పు చెప్పింది. కోర్టు రెండు లక్షల పూచీకత్తుతో బెయిల్ మంజూరుకు ఆదేశాలు ఇచ్చింది.
 
సర్వోన్నత న్యాయస్థాన న్యాయమూర్తులు జస్టిస్ హృషికేష్ రాయ్, జస్టిస్ భానుమతి, జస్టిస్ బోపన్నలతో కూడిన తిసభ్య ధర్మాసనం చిదంబరానికి బెయిల్ మంజూరు చేస్తూ తీర్పు చెప్పింది. అయితే సాక్ష్యాల్ని ప్రభావితం చేసే ఎలాంటి చర్యలకు పాల్పడకూడదని న్యాయస్థానం అదేశించింది. ఈ విషయమై మీడియా సంస్థలతో ముఖాముఖిలు గానీ, బహిరంగ ప్రకటనలు కానీ చేయవద్దని కూడా అదేశించింది. ఇక న్యాయస్థానం అనుమతి లేకుండా విదేశాలకు వెళ్లవద్దని కూడా న్యాయస్థానం షరతు విధించింది. చిదంబరం బెయిల్ పై విడుదలవుతున్న సమయంలో పార్లమెంటు శీతాకాల సమావేశాలు జరుగుతూ ఉండటం గమనార్హం.
 
ఆగస్టు 21న సీబీఐ అధికారులు అనేక నాటకీయ పరిణామాల మధ్య చిదరంబరాన్ని అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. అనంతరం అక్టోబర్‌ 16న కోర్టు ఆదేశాల మేరకు ఈడీ ఆయన్ని అదుపులోకి తీసుకుంది. దీంతో 106 రోజులుగా ఆయన జుడిషియల్‌ రిమాండ్‌లోనే ఉన్నారు. అయితే అక్రమ లావాదేవీలపై సీబీఐ నమోదు చేసిన కేసులో ఆయనకు అక్టోబర్‌ 21న బెయిల్‌ లభించిగా. ఈడీ నమోదు చేసిన కేసుల్లో బెయిల్ మంజూరు కాకపోవడంతో ఆయన జైలులోనే వుండాల్సి వచ్చింది. తాజాగా ఈడీ కేసులోనూ ఊరట లభించడంతో ఆయన జైలు నుంచి బయటకు రావడానికి మార్గం సుగమమైంది. దీంతో చిదంబరం ఇవాళ తీహార్ జైలు నుంచి బయటకు రానున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles