Centre clarrifies on Hyderabad second capital హైదరాబాద్ పై కేంద్రం నజార్.. రెండో రాజధానిపై క్లారిటీ.!

Centre gives clarrification on hyderabad second capital issue

MoS for Home Affairs, Nityanand Rai, Rajya Sabha, Hyderabad, second capital, Congress MP, KVP Ramachandra Rao, Telangana, Politics

MoS for Home Affairs, Nityanand Rai in written reply in Rajya Sabha that the centre doesnot have any proposal to make Hyderabad as second capital, after a question araises from Congress Rajya Sabha Member KVP Ramachandra Rao.

హైదరాబాద్ పై కేంద్రం నజార్.. రెండో రాజధానిపై క్లారిటీ..!

Posted: 11/27/2019 06:02 PM IST
Centre gives clarrification on hyderabad second capital issue

హైదరాబాద్‌ను కేంద్రపాలిత ప్రాంతం చేస్తారని.. దేశానికి రెండో రాజధాని చేస్తారని గత కొద్ది కాలంగా ప్రచారం జోరందుకుంది. దీనికి బలాన్ని ఇచ్చేలా అటు బిజేపి నేతలు కూడా పలు వ్యాఖ్యలు చేశారు. దేశ రాజధానిలో ఉత్తరాదిన వుండటం తో పూర్తిగా వారి అదిపత్యమే కనబడుతోందని, దక్షిణాదివారికి అంతగా ప్రాధాన్యత, ప్రాముఖ్యత కనిపించడం లేదని కూడా విమర్శలు వున్నాయి. ఈ క్రమంలో జోక్యం చేసుకున్న కేంద్రమంత్రి ఉత్తరాది, దక్షణాదికి మధ్య తేడాలను కూడా వర్ణాలుగా, వర్గాలుగా విశ్లేషించారు. ఈ క్రమంలో దేశానికి రెండో రాజధాని అంశం తెరపైకి వచ్చింది.

దీనికి తోడు దేశానికి మధ్యలో ఉన్న హైదరాబాద్ ను రెండో రాజధానిగా ప్రకటించడం వల్ల పలు సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని చెబుతున్నారు. దక్షిణాదికి కూడా రాజకీయాంగా ప్రాముఖ్యత లభిస్తుందని వార్తలు వినిపించాయి. దీనికి తోడు ఢిల్లీలో వాయు కాలుష్యం తీవ్రంగా ఉండటంతో ఈ వాదన మరోసారి తెరమీదకు వచ్చింది. కొందరు బీజేపీ నేతలు చేసిన ప్రచారంతో హైదరాబాద్ రెండో రాజధాని అవుతుందనే ప్రచారం జోరుగా సాగింది. తెలంగాణలో బీజేపీ బలపడటానికి ఈ నిర్ణయం ఉపకరిస్తుందనే వార్తలొచ్చాయి.

కానీ ఈ విషయమై కేంద్రం క్లారిటీ ఇచ్చింది. దక్షిణాదిలో రెండో రాజధాని పెట్టే ఆలోచన తమకు లేదని కేంద్రం ప్రకటించింది. పార్లమెంట్‌లో కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు కేవీపీ లిఖిత పూర్వకంగా అడిగిన ప్రశ్నకు సమాధానంగా కేంద్రం ఈ సమాధానం ఇచ్చింది. దేశంలో రెండో రాజధానిని ఏర్పాటు చేసే ఆలోచన తమకు లేదని హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ తెలిపారు. అయితే ఈ విషయంలో ఇప్పటికే మరో కేంద్ర సహాయ మంత్రి  కిషన్ రెడ్డి కూడా ఈ విషయమై వివరణ ఇచ్చారు. హైదరాబాద్‌ను రెండో రాజధాని చేసే యోచన కేంద్రానికి లేదన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles