TSRTC bus hits Tollywood Hero's car సినీహిరో కారును ఢీకొన్ని ఆర్టీసీ బస్సు.. స్వల్ప గాయాలు

Close shave for actor sampoornesh babu as tsrtc bus hits his car

TSRTC, TSRTC strike, TSRTC employees, TSRTC news, TSRTC bus, TSRTC Temperory Driver, sampoornesh babu, siddipet, hero with family, manthani, peddapalli, adavi srirampur, daryapur model school, Hyderabad, Telangana, crime

Actor Sampoornesh Babu and his family had a narrow escape after the car they were travelling in hit by a TSRTC bus here at Siddipet. The actor's wife and his daughter suffered minor injuries.

సినీహిరో కారును ఢీకొన్ని ఆర్టీసీ బస్సు.. స్వల్ప గాయాలు

Posted: 11/27/2019 01:23 PM IST
Close shave for actor sampoornesh babu as tsrtc bus hits his car

బంజారాహిల్స్‌ రోడ్డు నంబర్ 12లో ఆర్టీసీ బస్సు ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంటూ సృష్టించిన బీభత్సం జరిగి 24 గంటలు కూడా గడవకముందే అవే బస్సులు ఇవాళ మళ్లీ ప్రమాదాల కారణంగా వార్తల్లో నిలిచాయి. తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన హీరో కారును ఢీకొనడంతో పాటు మరో ప్రాంతంలో పాఠశాల విద్యార్థులను వారి తల్లిదండ్రులను కూడా కలవరానికి గురిచేసింది. ఈ రెండు ఘటనల్లో కొద్దిలో పెను ప్రమాదాలు తప్పిపోయాయి. కానీ తాత్కాలిక డ్రైవర్లతో ముమ్మాటికీ ముప్పు పొంచివుందన్న సత్యాన్ని మాత్రం ప్రభుత్వం గ్రహించాలని ప్రజలు కోరుతున్నారు.

తాజాగా ఇవాళ టాలీవుడ్ బర్నింగ్ స్టార్ సినీనటుడు సంపూర్ణేష్ బాబు ఆయన కుటుంబసభ్యులతో కలసి వెళ్తున్న క్రమంలో తృటిలో ప్రమాదం తప్పి.. స్వల్పగాయాలతో బయటపడ్డారు. సిద్ధిపేటలో సంపూర్ణేష్‌ బాబు ప్రయాణిస్తున్న వాహనాన్ని ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. సిద్దిపేటలోని కొత్త బస్టాండ్ సమీపంలో ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో సంపూర్ణేష్ తో సహా ఆయన భార్య, కుమార్తెకు స్వల్పంగా గాయాలు అయ్యాయి. ఈ ఘటనలో సంపూర్ణేష్ బాబు కారు కూడా స్వల్పంగా ధ్వంసమైంది.

అయితే కారు ప్రమాదం జరగ్గానే.. సిద్దిపేట పోలిస్ స్టేషన్ కు వెళ్లి జరిగిన ఘటనపై సంపూర్ణేష్ బాబు పిర్యాదు చేశారు. ఆర్టీసీ బస్సు తాత్కలిక డ్రైవర్ ను ప్రమాదంపై నీలదీయగా, ఆయన దురుసుగా ప్రవర్తించాడని కూడా సంపూర్ణేష్ బాబు పోలీసులకు ఇచ్చిన పిర్యాదులో పేర్కోన్నారు. దీంతో డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు ముందుగా అతనికి బ్రీత్ అనలైజర్ పరీక్షలు నిర్వహించారు. అతను మధ్యం సేవించలేదని నిర్ధారించుకున్న తరువాత.. కేసు నమోదు చేశారు.

కాగా మరో ఘటనలో పెద్దపల్లి జిల్లాలో ఇవాళ ఉదయం ఓ ఆర్టీసీ బస్సుకు తృటిలో పెద్ద ప్రమాదం తప్పింది. ముత్తారం మండలం ఖమ్మంపల్లి -అడవిశ్రీరాంపూర్ సమీపంలో  ఇవాళ ఉదయం ఓ ఆర్టీసీ బస్సు అదుపు తప్పి రోడ్డు కింద పొలాల్లోకి దూసుకెళ్లింది. ఈ ప‍్రమాదంలో  పలువురికి స్వల్ప గాయాలయ్యాయి. వివరాల్లోకి వెళితే... మంథని నుండి ముత్తారం మండలంలోని పలు గ్రామాల విద్యార్థులను దర్యాపూర్ మోడల్ స్కూల్‌కు తీసుకువెళ్లే ఈ ప్రమాదం జరిగింది. సింగిల్ రోడ్డు కావడంతో డ్రైవర్  అజాగ్రత్త వల్ల బస్సు రోడ్ కిందికి దూసుకెళ్లింది.

ప్రమాదం జరిగినప్పుడు బస్సులో 60 మంది విద్యార్థులతోపాటు పది మంది ప్రయాణికులు మొత్తం 70 మంది ఉన్నారు.  బస్సు పొలాల్లోకి దూసుకెళ్లి ఆగిపోవడంతో పలువురికి స్వల్ప గాయాలతో బయటపడ్డారు. తృటిలో ప్రమాదం తప్పినప్పటికి విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులు భయాందోళనకు గురయ్యారు. ప్రమాదం జరిగిన వెంటనే డ్రైవర్ అక్కడ నుంచి పరారయ్యాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : TSRTC  TSRTC Temperary Driver  sampoornesh babu  siddipet  manthani  daryapur model school  Telangana  crime  

Other Articles