Charges filed in killing of UIC student Ruth George చికాగోలో హైదరాబాదీ యువతిపై ‘హత్యా’చారం

Uic college student ruth george strangled in campus parking garage

Ruth George, Indo-American Student, Donald Thurman, sexual assault, University of Illinois, Halsted Street garage, Chicago, armed robbery, parolee, Murder, United States, America, Crime

A 26-year-old parolee Donald Thurman, has been charged with first-degree murder and criminal sexual assault in the strangulation death of a University of Illinois at Chicago student whose body was found in a campus parking lot over the weekend, university police said.

చికాగోలో హైదరాబాదీ యువతిపై ‘హత్యా’చారం

Posted: 11/26/2019 11:31 AM IST
Uic college student ruth george strangled in campus parking garage

అగ్రరాజ్యం అమెరికాలోని చికాగో రాష్ట్రంలో హైదరాబాదీ యువతిపై దారుణం జరిగింది. అమెపై అత్యాచారం చేసి హత్య చేసిన ఘటనతో ఒక్కసారిగా అమె చదువుతున్న విశ్వవిద్యాలయంలో కలకలం రేగింది. ఏకంగా ఆమె చదవుతున్న యూనివర్శిటీలోనే అమె విగతజీవిలా మారడంతో అమె స్నేహితురాళ్లు, సహచర విద్యార్థినులు భయాందోళనకు గురువుతున్నారు. యూనివర్శిటీ ప్రాంగణం వెనుక వైపున ఉన్న గ్యారేజ్ లోని.. కారు వెనుక సీటులో హైదరాబాదీ యువతిని హత్యచేశారు. అమె మరణంతో యూనివర్సిటీలో కూడా విద్యార్ధినీ విద్యార్థులు అప్రమత్తమయ్యారు.

ఈ ఘటనకు సంబంధించి చికాగో పోలీసులు తెలిపిన వివరాలు ఇలా వున్నాయి.. హైదరాబాద్ కు చెందిన ఓ కుటుంబం అమెరికాలోని ఇల్లినాయిస్ లో స్థిరపడగా, వారి కుమార్తె, యూనివర్సిటీ ఆఫ్‌ ఇల్లినాయిస్ లో ఆనర్స్‌ విద్యార్థిని. దీంతో పాటు అటు సంగీతంతో పాటు జిమ్నాస్టిక్స్ లోనూ అమె తన ప్రదర్శనలతో ఆకట్టుకుంటుంది. అమె తాను చదువుకున్న నాపర్ విల్లే సెంట్రల్ హైస్కూల్ చేత ఎంత చక్కటి తీయ్యని అమ్మాయి అని అనిపించుకుంది. ఇక యూనివర్శిటీలోనూ అమె అందరితోనూ కలసిమెలసి వుండటం.. అమెలో కల్మషం లేని నవ్వు అందరినీ ఆకట్టుకుంది.

ఇలా అందరిచేత ప్రశంసలు అందుకుంటున్న యువతి ఎంత రాత్రైయినా ఇంటికి వెళ్లలేదు. కనీసం తల్లిదండ్రులకు సమాచారం అందించలేదు. అంతేకాదు వారు ఫోన్ చేసినా ఆమె వారికి బదులివ్వలేదు. అసలేం జరిగిందో తెలియక అమె తల్లిదండ్రులు పోలీసులకు పిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు అమె ఫోన్ ను ట్రేస్ చేయగా అది ఏకంగా అమె చదువుతున్న కాలేజీ వెనుకునున్న గ్యారాజ్ ఏరియాలో వున్నట్లు చూపింది. దీంతో అక్కడికి వెళ్లి అమెను వెతకగా అమె ఓ కారులోని వెనుక సీటులో విగతజీవిగా పడివుంది.

అమెపై లైంగికదాడికి పాల్పడి అనంతరం హత్య చేసినట్లు సీసీటీవీ ఫూటేజీని పరిశీలించిన పోలీసులు గుర్తించారు. ఈ కేసులో అనుమానితుడిగా భావిస్తున్న ఓ పాత నేరస్థుడిని అదుపులోకి తీసుకున్నారు. డొనాల్డ్‌ తుర్మన్‌ (26) అనే పాత నేరస్థుడు యువతిని అత్యాచారం చేసి హత్య చేశాడని అంగీకరించాడు. 2016లో ఓ మహిళ చేతిలోంచి ఐఫోన్ ను తస్కరించి.. దొంగలించిన కారులో పరారైన కేసులో డొనాల్డ్ తుర్మన్ దోషిగా తేలాడు. అయితే అతనికి ఆరేళ్ల శిక్ష విధించింది న్యాయస్థానం. కాగా పేరోల్ పై బయటకు వచ్చిన తుర్మన్.. ఈ యువతిని హత్యచేసినట్లు అంగీకరించాడు.

దీంతో అతనిపై హత్య, లైంగిక వేధింపుల కేసును నమోదు చేసిన పోలీసులు పేరోల్ రద్దు చేసి అదుపులోకి తీసుకున్నారు. డాక్టర్ వృత్తిని అభ్యసించి, ఎంతో మందికి వైద్యం చేయాలని భావించిన తమ విద్యార్థిని, ఇలా విగతజీవిగా కనిపించడం ఎంతో బాధాకరమని, ఆమె కుటుంబీకులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నామని వర్సిటీ చాన్స్‌లర్‌ మైఖేల్‌ డీ అమిరిడిస్‌ తెలిపారు. ఆమె మరణానికి సంతాపంగా, ఆమెకు ఇష్టమైన పసుపు రంగు రిబ్బన్లను మిగతా విద్యార్థినీ విద్యార్థులు క్యాంపస్‌ అంతటా ఎగురవేసి సంతాపం తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles