"Obscene" Video Played At Bhopal Bus Stop బస్టాండులో బహిరంగంగా బూతు వీడియో..!

Mp bus ticket machine plays porn clip insider role suspected

Bus ticket machine plays porn clip, porn clip, Madhya Pradesh bus ticket, ticket machine plays porn, Bhopal, Madhya Pradesh, Crime

A civic-run bus firm in Bhopal in Madhya Pradesh has lodged a police complaint after a 30-second porn clip was played on the screen of one of its ticket vending machines at a Bus Rapid Transit System (BRTS) stand, an official said

బస్టాండులో బహిరంగంగా బూతు వీడియో..!

Posted: 11/23/2019 05:14 PM IST
Mp bus ticket machine plays porn clip insider role suspected

నిత్యం జనసంచారం వుండే ప్రాంతాల్లో తమ వల్ల అపరిశుభద్రత ఏర్పడితుందేమోనని సామాన్యులు జంకుతుంటారు. వచ్చే, పోయే ప్రయాణికులతో నిత్యం కళకళలాడే ఇలాంటి ప్రాంతాల్లో అక్కడ ఏ పాడు పని చేయాలన్న అసంఘీక కార్యకాలాపాలు శక్తులు సైతం వెనుకంజవేస్తాయి. అలాంటి బస్టాండులో జనసంచారం జరుగుతున్న వేళ.. ఏకంగా ఓ అశ్లీలతకు చోటిచ్చింది. బస్టాండులో పోర్న్ వీడియో కనిపించింది. ఈ ఘటనతో బస్టాండులోని ప్రయాణికులు ఒక్కసారిగా షాకయ్యారు. మధ్యప్రదేశ్ లోని భోపాల్ పట్టణ బస్టాండులో జరిగిందీ ఘటన.

బస్టాండు అధికారులు, ప్రయాణికులు చెబుతున్న వివరాల ప్రకారం.. కొద్ది రోజుల క్రితం బస్టాండులోని టీవీలో అశ్లీల చిత్రాల వీడియో ప్రదర్శించబడింది. దానిని చూసి ప్రయాణికులు తలలు పట్టుకున్నారు. తమ పిల్లలు ఎక్కడ వీడియోలు చూస్తారోనని వారి కళ్లను మూసేశారు. ఈ ఘటనను ఓ ప్రయాణికుడు తన మొబైల్‌ లో రికార్డ్ చేసి.. అధికారుల నిర్లక్ష్యానికి ఇది పరాకాష్ట అంటూ దానిని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్తా వైరల్ అయ్యింది. భోపాల్ హోషన్‌గాబాద్ రోడ్‌లో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా బయటపడింది.

కొద్ది రోజుల క్రితం సిటీ బస్టాప్‌లో జరిగి ఈ ఘటనపై అధికారులు ఆరా తీశారు. ఛార్జీలు వసూలు చేసే మెషిన్‌లో వీడియో వచ్చినట్లు గుర్తించారు. అక్టోబర్ 28న ఈ మెషిన్‌లో బ్లూ ఫిలిం అప్ లోడ్ చేశారు.. రెండు వీడియోలు ఉన్నట్లు గుర్తించారు. భోపాల్ సిటీ లింక్ లిమిటెడ్ అధికారులు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఈ వీడియోలు ఎలా వచ్చాయో ఆరా తీస్తున్నారు. దీనిపై వివరణ ఇవ్వాలని సిబ్బందిని ఆదేశించారు. అయితే సిబ్బంది ప్రమేయం లేకుండా ఇలాంటి వీడియోలు ప్లే కావడం అసాధ్యమన్న వాదనలు కూడా తెరపైకి వస్తున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles