TSRTC JAC Secretary Nagesh Patel Resigns ఆర్టీసీ జేఏసీ రాష్ట్ర కార్యదర్శి నగేష్ పటేల్ రాజీనామా

Tsrtc strike jac s offer to call off strike causes rift among protesting workers

Nagesh patel, TSRTC JAC Secretary, tsrtc, strike, privatization, High Court, telangana, Politics

The offer by the Telangana State Road Transport Corporation Joint Action Committee (JAC) on Wednesday to call off the almost 50-day strike — if the government accepts their demands without any preconditions — has led to a rift among the employees.

ఆర్టీసీ జేఏసీ రాష్ట్ర కార్యదర్శి నగేష్ పటేల్ రాజీనామా

Posted: 11/22/2019 08:47 PM IST
Tsrtc strike jac s offer to call off strike causes rift among protesting workers

పొరుగున్న తెలుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ కొలువుదీరిన వైఎస్ జగన్ కొత్త ప్రభుత్వం ఎన్నికల హామీని నిలబెట్టుకుంటూ ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన మాట మేరకు కార్మికులందరినీ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణిస్తూ నిర్ణయం తీసుకుంది. అంతకుముందు ఆర్టీసీని రాష్ట్ర రవాణ శాఖలో విలీనం చేస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. దీంతో అమను కూడా రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులుగా పరిగణించాలని డిమాండ్ చేయడంతో పాటు మరో 25 డిమాండ్లతో తెలంగాణ ఆర్టీసీ కార్మికులు సమ్మెకు పిలుపునిచ్చారు.

అయితే ఇప్పటికే పలు పర్యాయాలు వారికిచ్చిన ఎన్నికల హామీ మేరకు ఆర్టీసీ కార్మికులు డిమాండ్లను నెరవేర్చామని, వారి వేతనాలను ఏకంగా 67శాతం మేర పెంచామని ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పారు. దీంతో ఇకపై ఆర్టీసీ కార్మికుల సమస్యలను వినే సమస్యే లేదని తేల్చిచెప్పారు. ఆర్టీసీ ఇప్పటికే నష్టాల్లో నడుస్తోందని.. అయినా తమ ప్రభుత్వం ఆర్టీసీ కార్మికులు జీవితాలను దృష్టిలో పెట్టుకుని ఉదారంగా వ్యవహరిస్తున్నామన్నారు. ఏకంగా 50 వేల మంది కార్మికులను నిరుద్యోగులుగా మార్చడం ఇష్టంలేక అన్ని వైపుల నుంచి నిధులను తీసుకువచ్చి ఆర్టీసీని నడిపిస్తున్నామన్నారు.

అయినా కార్మికులు తమను ప్రభుత్వ ఉధ్యోగులుగా పరిగణించాలని, ఆర్టీసీని విలీనం చేయ్యాలని డిమాండ్ చేయడంతో ప్రభుత్వం కూడా బెట్టువీడకుండా న్యాయస్థానం ఎలాంటి తీర్పు ఇస్తుందోనని వేచి చూసింది. ఆర్టీసీ జేఏసీ గందరగోళ నిర్ణయాలను వ్యతిరేకిస్తూ.. ఆర్టీసీ జేఏసీ రాష్ట్ర కార్యదర్శి నగేష్ పటేల్ తన పదవికి రాజీనామా చేశారు. జేఏసీ పెద్దలు స్టేట్ కమిటీ నేతలతో చెప్పకుండా సమ్మెపై విరమణ చేస్తామని ప్రకటించారని ఆరోపించారు. కార్మికులు విధుల్లో చేరడానికి సీఎం కేసీఆర్ అవకాశమిచ్చినప్పుడే బేషరతుగా చేరివుంటే బాగుండేదని నగేష్ మీడియాతో అన్నారు. కార్మికుల ఆత్మహత్యలకు ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నించారు.

సమ్మెపై ఆర్టీసీ జేఏసీ వెనక్కి తగ్గడంతో మరోవైపు కార్మికుల్లో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. కొందరు కార్మికులు విధుల్లో చేరడానికి సిద్ధమవుతున్న నేపథ్యంలో.. ఉన్నతాధికారుల నుంచి ఎలాంటి ఆదేశాలు లేకుంటే వారిని వెనక్కి పంపిస్తామని ఆర్టీసీ అధికారులు చెపుతున్నట్లు సమాచారం. అఫిడవిట్ సమర్పించి విధుల్లో చేరవచ్చని కార్మికుల్లో ప్రచారం సాగుతున్న నేపథ్యంలో కార్మికులు డిపో మేనేజర్లను కూడా సంప్రదించారు. కాగా డిపో మేనేజర్లు అలాంటిదేమీ ఉండదని వారికి తెలిపినట్లు తెలుస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Nagesh patel  TSRTC JAC Secretary  tsrtc  strike  privatization  High Court  telangana  Politics  

Other Articles