TSRTC strike: HC allows privatisation of bus routes ఆర్టీసీ రూట్ల ప్రైవేటీకరణకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్

Setback for tsrtc employees telangana hc allows privatisation of bus routes

TSRTC Workers, High Court, Routes Privatise, Jana Samiti, PIL,RTC MD Sunil sharma, kareem khan, karimnagar, TRS, rtc mechanic, heart stroke, tsrtc jac, Telangana movement, Ashwathama Reddy, TSRTC, TSRTC Workers, TSRTC Workers Strong Warning, Telangana Bandh, ts government

In a major setback to protesting Telangana State Road Transport Corporation (TSRTC) employees the High Court of Telangana has disposed of the writ petition that was filed against the state governments' decision to privatise as many as 5100 routes in the state.

ఆర్టీసీ రూట్ల ప్రైవేటీకరణకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్

Posted: 11/22/2019 06:36 PM IST
Setback for tsrtc employees telangana hc allows privatisation of bus routes

టీఎస్ఆర్టీసీ కార్మికులు జేఏసీ పిలుపుతో గత 50 రోజులుగా చేస్తున్న సమ్మె ఆగమ్యగోచరంగా మారింది. తెలంగాణ ఆర్టీసీ కార్మిక సంఘాలతో పాటు కార్మికులకు కూడా మరో షాక్ తగిలింది. తెలంగాణలోని బస్సు రూట్లను ప్రైవేటీకరించేందుకు గ్రీన్ సిగ్నల్ లభించింది. ఈ మేరకు రూట్ల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని రాష్ట్రోన్నత న్యాయస్థానం హైకోర్టు కొట్టివేసింది. 5,100 బస్సులను ప్రైవేట్‌కు అప్పగిస్తూ తెలంగాణ కేబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని తప్పుబట్టలేమని న్యాయస్థానం స్పష్టం చేసింది. దాంతో ఆర్టీసీ రూట్ల ప్రైవేటీకరణకు పచ్చజెండా ఊపినట్లైంది.

తెలంగాణ జనసమితి ఉపాధ్యక్షుడు పీఎల్‌ విశ్వేశ్వరరావు హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని కొట్టివేసేందుకు ముందు ఈ అంశమై న్యాయస్థానంలో గత కొన్ని రోజులుగా సుదీర్ఘ విచారణ జరిపిన న్యాయస్థానం ఇవాళ తుది తీర్పు వెల్లడించింది. ప్రభుత్వం తరఫున అడ్వొకేట్‌ జనరల్‌ వాదనలు వినిపించారు. క్యాబినేట్‌ నిర్ణయాన్ని గవర్నర్‌ ఆమోదం లభించి.. జీవోలు వచ్చిన తరువాత న్యాయస్థానం జోక్యం చేసుకోకూడదని, ఎవరూ సవాల్‌ చేయకూడదని ఏజీ వాదనలు వినిపించారు. ప్రభుత్వ నిర్ణయం చట్టబద్ధంగానే ఉందని అన్నారు,

ప్రయాణికుల రద్దీ దృష్ట్యా.. వారికి మెరుగైన రవాణ సౌకర్యంతో పాటు తక్కువ ధరకే గమ్యస్థానాలకు చేర్చేందుకు వీలుగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని ఏజీ చెప్పారు. ఆర్టీసీ ప్రైవేటీకరణ.. రాష్ట్రంలోని పలు రూట్లకు ప్రైవేటు పర్మిట్లు ఇవ్వాలన్న నిర్ణయానికి ప్రభుత్వం చేరకుందని ఏజీ వివరించారు. ప్రభుత్వం దురుద్దేశపూర్వకంగా నిర్ణయం తీసుకుందని, చట్టానికి అనుగుణంగా కేబినెట్‌ నిర్ణయం లేదని పిటిషనర్‌ తరఫున న్యాయవాది చిక్కుడు ప్రభాకర్‌ వాదించారు.

రవాణా అథారిటీ అనే పదాన్ని హైకోర్టు తప్పు బట్టింది. కానీ ప్రైవేటీకరణ ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వమే స్వయంగా అమలు చేసి.. రవాణా అథారిటీ బదులు రాష్ట్ర రవాణాశాఖ ముఖ్యకార్యదర్శి చేత ప్రక్రియ నిర్వహిస్తారని ఏజీ.. రాష్ట్ర ప్రభుత్వం తరఫున వాంగ్మూలం ఇవ్వడంతో అందుకు న్యాయస్థానం సమ్మతించింది. ఇరువర్గాల వాదనలు విన్న న్యాయస్థానం.. పిటిషనర్‌ వాదనలో బలం లేదని పేర్కొంటూ పిటిషన్‌ను కొట్టివేసింది. రూట్ల ప్రైవేటీకరణపై తీర్పు ప్రభుత్వానికి సానుకూలంగా వచ్చిన నేపథ్యంలో కార్మికుల భవితవ్యం ఆగమ్యగోచరంగా మారింది.

ఆర్టీసీ భవితవ్యం, కార్మికులను విధుల్లోకి తీసుకునే అంశంపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవాళ కీలక నిర్ణయం తీసుకునే అవకాశముంది. తమను బేషరతుగా విధుల్లోకి తీసుకుంటే విధుల్లో చేరతామని ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ స్పష్టం చేసినా.. ప్రభుత్వం మాత్రం ఇప్పటికే దీనిపై ఒక ఖచ్చితమైన నిర్ణయానికి రాలేదు. అయితే క్రితం రోజున నిర్వహించిన సమీక్ష ప్రస్తుతం నెలకొన్న అర్థికమాంద్యం పరిస్థితుల్లో ఆర్టీసీని నడపడం భారంగా పేర్కొన్నారు. వాస్తవాలను దృష్టిలో ఉంచుకుని ఆర్టీసీ సమస్యలకు శాశ్వత పరిష్కారం ఆలోచించాలని తెలంగాణ సీఎం కేసీఆర్ నిర్ణయించినట్లు తెలుస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : TSRTC Workers  High Court  Routes Privatise  Jana Samiti  PIL  Ashwathama Reddy  TSRTC Strike  KCR  Hyderabad  Telangana  

Other Articles