దివంగత ప్రధాని, భారత తొలి మహిళా ప్రధానిగా ఎంతో ధైర్యసాహసాలతో నిర్ణయాలు తీసుకున్న వ్యక్తిగా ఇందిరాగాంధీ భారతీయుల హృదయాలలో స్థానం సంపాదించారు. అయితే ఆమె జన్మించిన ఇళ్లు ఉత్తర్ ప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్ ప్రాంతంలో వుంది. ఆమె పుట్టినిల్లు 'ఆనంద్ భవన్' ఇప్పుడు జాతీయ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఎందుకంటే ఆ ఇంటికి స్థానిక మున్సిపల్ కార్పోరేషన్ అధికారులు షాక్ ఇచ్చారు. ఆ ఇంటిపై గత ఆరేళ్లుగా ఇంటిపన్ను బకాయి పడిందని పేర్కోన్న అధికారులు.. ఆ ఇంటిపై ఏకంగా రూ.4.35 కోట్ల రూపాయల బకాయిని చెల్లించాలని డిమాండ్ చేస్తూ ట్యాక్స్ నోటీసులు జారీ చేసింది.
ఆరేళ్ల ఇంటి పన్ను ఏకంగా రూ.4.35కోట్లా.? అంటే అవును ఈ మొత్తం పన్ను బకాయిపడిందని.. దీనిని చెల్లించాలని నోటీసుల్లో పేర్కొంది. అంత మొత్తం ఎలా వచ్చిందన్నదానిపై కూడా మున్సిఫల్ కార్పోరేషన్ అధికారులు వివరణ ఇచ్చారు. ఇది ఒకప్పుడు నివాస భవనమే అయినా ప్రస్తుతం.. జవహర్ లాల్ నెహ్రూ ట్రస్ట్‌గా నడుపుతున్నందున దానిని నాన్ రెసిడెన్షియల్ కేటగిరీలో పరిగణించామని తెలిపారు. దీంతో ఈ భవనానికి ఇంటి పన్ను అధికంగా వచ్చిందని వివరించారు. ఇక 2013 నుంచి ట్యాక్స్ చెల్లించని కారణంగా ఇంటి పన్ను మొత్తంపై ఆరేళ్ల వడ్డీ కూడా పడిందన్నారు. కాగా, జవహర్లాల్ నెహ్రూ ట్రస్ట్ వ్యవహారాలను కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ పర్యవేక్షిస్తున్నారు.
ఇక ఈ నోటీసులపై ప్రయాగ్ రాజ్ మున్సిపల్ కార్పోరేషన్ ప్రధాన పన్ను పర్యవేక్షణ అధికారి పీకే మిశ్రా స్పందించారు. పెండింగ్ ట్యాక్స్‌పై నోటీసులు జారీ చేయడానికి సర్వే లాంటిది చేశామని.. తమ సర్వేలపై అభ్యంతరాలు వుంటే చెప్పాలని కూడా కోరామని చెప్పారు. అయినా తమకు ఈ విషయంలో ఆనంద్ భవన్ నుంచి ఎలాంటి స్పందన రాలేదని చెప్పారు. దీంతో మున్సిపల్ కార్పోరేషన్ చట్టం ప్రకారం నోటీసులు జారీ చేశామన్నారు. కాగా, ప్రయాగ్ రాజ్ మేయర్ అభిలాష గుప్త మాత్రం తమకు పన్ను విధింపుపై ఆనంద్ భవన్ నుంచి ఓ నోటీసు వచ్చిందని చెప్పారు. చారిత్రక నిర్మాణాల కారణంగా వాటిపై విధించే పన్నులో పున:సమీక్షించాలని ఆ నోటీసులలో పేర్కోన్నారని అన్నారు. వాటిని అద్యయంన చేసిన తరువాత తదుపరి చర్యలు తీసుకుంటామని మేయర్ తెలిపారు.
మరోవైపు ప్రయాగ్‌రాజ్ మున్సిపల్ కార్పోరేషన్ మాజీ మేయర్ చౌదరి జితేంద్రనాథ్ సింగ్ మాత్రం ట్యాక్స్ నోటీసులను వ్యతిరేకించారు. ఆనంద్ భవన్ ను జవహర్లాల్ ట్రస్టుగా నడుపుతున్నందునా.. అన్ని రకాల పన్నుల నుంచి దాన్ని మినహాయించినట్టు గుర్తుచేశారు. స్వాతంత్య్ర ఉద్యమానికి సంబంధించి అదొక స్మారక భవనం అని.. ఎన్నో స్మృతులతో ముడిపడి ఉన్న ఆ భవనం 'సెంటరాఫ్ ఎడ్యుకేషన్'గా మారిందని చెప్పారు.అలాంటి భవనానికి ట్యాక్స్ నోటీసులు జారీ చేయడం సరికాదన్నారు. ఇదంతా బీజేపీ ఎజెండాలో భాగమేనని ఆరోపించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకే అధికారులు ఇలా చేశారని ఆరోపించారు.
(And get your daily news straight to your inbox)
Feb 24 | పైన దగా, కింద దగా, కుడి ఎడమల దగా దగా అంటూ ఎందరు ఎన్ని రకాలుగా చెప్పినా.. ఆశ అన్నది అత్యాశగా మారిన మనిషి మోసపోక తప్పదు.. కొత్త కో్త పథకాలతో మోసం చేసేవాళ్లకు... Read more
Feb 24 | పుదుచ్చేరిలో ప్రభుత్వంలో భాగస్వాములుగా వున్న అధికార పార్టీ ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామా చేయడంతో అక్కడ ప్రభుత్వం కుప్పకూలిన విషయం తెలిసిందే. ప్రభుత్వం తమ బలాన్ని నిరూపించుకోవడంలో విఫలం కావడంతో లెఫ్టినెంట్ గవర్నర్ తమిళిసై... Read more
Feb 24 | కోర్టుల్లో న్యాయమూర్తులను ‘యువరానర్’ అని సంబోధించడం అందరికీ తెలిసిన విషయమే. అయితే ఏ న్యాయస్థానంలో ఈ పదాన్ని ఉచ్చరించాలో కూడా తెలియకపోవడం.. ఓ న్యాయవిద్యార్థిపై సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎస్ఏ బాబ్డే అభ్యంతరం వ్యక్తం... Read more
Feb 24 | మనిషి తన మేధోశక్తితో చంద్రయానం, మంగళయానంతో పాటు అంగారక గ్రహాన్వేషణ చేస్తూ.. పరగ్రహాలపై కూడా కాలుమోపి వస్తున్న తరుణంలోనూ మూఢాంధకారాలు, మూఢాచారాలు, మూడవిశ్వాసాలను మాత్రం వదలుకోవడం లేదు. దేశానికి స్వతంత్రం లభించిన 70 ఏళ్లు... Read more
Feb 24 | కరోనా టీకా ‘కొరోనిల్’ విషయంలో ప్రజలను తప్పుదారి పట్టించిన ప్రముఖ యోగా గురు, పతంజలి వ్యవస్థాపకుడు బాబా రాందేవ్ ను అరెస్ట్ చేయాలంటూ ఇప్పటికే దేశం నలువైపుల నుంచి డిమాండ్లు పెల్లుబిక్కుతున్న తరుణంలో ఆయన... Read more