కార్తీక మాస మాధుర్య పరవశం.... Karthika Masam Madhurya Paravasam

Karthika masam madhurya paravasam

Karthika Masam,Spiritual, Lord Shiva

Karthika Masam Madhurya Paravasam

కార్తీక మాస మాధుర్య పరవశం....

Posted: 11/13/2019 10:01 AM IST
Karthika masam madhurya paravasam

ఈరోజుతో  పవిత్ర కార్తీక మాసం ముగియనున్నది.. దేవతార్చనలు.. భక్తి పారవశ్యాలు ముగియనున్నాయి..  నేడు వేకువ జామున ప్రత్యుష కాలమందునా తలంటు స్నానం ఆచరించి మగువలు.. 365 రోజులకు సరిపడ వత్తులను సేకరించి ఆవు నెయ్యి తో కానీ నువ్వు ల నూనె తో కానీ ఆ వత్తులను వెలిగిస్తే మంచిదని ప్రాచీన కాలం నుండి  ఉన్నా నానుడి.. ప్రత్యుష కాలంలో  వీలుపడని వాళ్ళు సంధ్య సమయాన ఈ దీప కాంతులను వెలిగించవచ్చు.. ఏ పవిత్ర దినంనా చాల మంది ఒక పొద్దు ఉంటారు.. కొందరు నిష్ఠా తో ఉపవాస వ్రతాన్ని చేపడతారు.. తులసి పూజ మరియు శివార్చన నేడు ప్రధమం.. అయినా ఈ కార్తీక మాసం అంత పవిత్రంగా భావిస్తారు పెద్దలు.. కార్తీక మాసం అది కార్తీక పౌర్ణమి రోజు.. ఇక రోడ్లపై భక్తులా రద్దీ.. అందాల మగువల సాంప్రదాయ అలంకరణ.. నదీ స్నానాల కోలాహలం.. పూజల ఆలాపన.. పూజారుల సందడి..  అన్నింటికీ సరి  అగు  మాసం  .. దేవాలయాలు ఇక  భక్తి  పారవశ్యాలలో తిరుగాడుతుంటాయి.. ఇక భక్త మహాశయుల  రద్దీకి రోడ్డులేకాక  దేవతామూర్తులు  కూడా సందు ఇవ్వాల్సిందే.. ఎందుకో  ఏమో  అన్ని తెలుగు మాసాలలో లేని ఒక ప్రత్యేక స్థానం ఈ కార్తీక మాసానికి కనపడుతుంటుంది. . మన తెలుగు మాసాలలో  ఎనిమిదోవ  మాసం ఇది.. ఈ అరుదైన మాసం ఎంతో విశిష్ట హొయ్యాలు కలిగినది. ఎంతో పవిత్ర నెలగా  భావించబడుతుంది మన యావత్ తెలుగు దేశ ప్రజాసంద్రానికి .. తెల్లవారుజామున నాలుగుగంటలకే  తరుణులు   చన్నీటి  తలంటు  స్నానం  ఆచరించి   పూజకు నిమగ్నమౌతారు . దీపాల ఆరాధన ప్రత్యేక  ఆనంద అభినయం సంతరించుకుంటుంది. ఈ దీపాల  వెలుగులలో  కంటికి కనపడని వర్ణాలు ఎన్నో.. ఈ మాసంలో ప్రతి రోజు ఓ అమితమైన ప్రత్యేకత దాగి ఉంటుంది.కార్తీక  సోమవారం,కార్తీక శుక్రవారం ఇలా  ఏదో ఒక పూజ సగటు తెలుగు ఆడపడచు  ఆచరిస్తుంది.తులసి   దేవికి  పూజలు చేపడుతుంది.. కొందరు  ఈ మాసం  అంతా శాకాహారాన్ని తింటారు, మాంసాహారాన్ని స్వీకరించరు.  ఈ పవిత్ర కార్తీక మాస పూజలను  హిందూ,జైన మరియు సిక్కు  మతాల వాలు అతి అంత భక్తి శ్రద్ధలతో ఆచరిస్తారు.  జరుపుకొనే ఈ కార్తీక పూర్ణిమను  దేవా దీవాలి,దేవా దీపావళి,త్రిపుర పూర్ణిమ అనే అనేక పేర్లతో పిలుస్తారు. ఈ నెల మొత్తం పండగల వర్షమే. దీపావళి  పండగ అమావాస్య ముగిసిన రేయి నుండే   కార్తీక మాసం ఆరంభం అవుతుంది. ఈ కార్తీక మాసం నందు శివుడు మరియు మహా విష్ణువు  ప్రత్యేక పూజలు, ఆరాధనలు అందుకుంటారు. ఈ  నెలలో పూజలు చేసిన వారికి లక్ష్మి  కటాక్షము  అందుతుంది అని ఒక గొప్ప నమ్మకం.అంతేకాకుండా అయ్యప్ప మాలను ధరించే వారు కూడా  ఈ  నెలనే శుభప్రదంగా భావించి   అని  ఈ  నెలలోనే  దరిస్తారు.. దాన  ధర్మాలు  కూడా  ఈ  మాసంలోనే  చేస్తే పుణ్య కర్తలు సిద్ధిస్తాయని   ఓ ఆచార ఆలోచన. వివాహ  వనితలు ఏ మాసం నందు పూజ వ్యవహారాలను  అతి అంత  భక్తి శ్రధలతో  ఆచరిస్తారు  . అవివాహిత  వనితలు కూడా  తమకు    రాబోయే పతికై   పాటి కై కార్తీక మాసం నందు   దీపాలను వెలిగించి తమ జీవన  వెలుగుకై ఆరాధననవ్యతను సంతరింపజేసుకుంటారు. అనాదిగా వస్తున్నా ఈ కార్తీక మాస పూజ ఆరాధనలు ,    ఎంతో పురాతన ప్రసిద్ధి చెందినవి.అంతేకాకుండా ఈ కార్తీక  ప్రస్తావన స్వల్పమైనది కాదు..అటు సరళమైనది కాదు.. కానీ భక్తి,నమక  ఆయుధాలతో   భగవతారాధన  పొందగలమని  ,భగవంతుడికి  చేరువకాగలమని , ప్రీతిపాత్రులం  కాగలవని ఈ మాసం  ఎట్టకేలకు రుజువు చేస్తుంది..

న కార్తికసమో మాసో న కృతేన సమం యుగం..
న వేదసదృశం శాస్త్రం న తీర్థం గంగయా సమమ్ ..      
ఈ  శ్రోత్ర పరవశం మన యావత్ తెలుగు జాతికి వెలుగులు నింపాలని  ఓ చిన్ని కార్తీక దీప లోచన...

-శ్రీవల్లి..

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Karthika Masam  Spiritual  Lord Shiva  

Other Articles