Pawan Kalyan warns AP CM YS Jagan అధికార వైసీపీ పార్టీకి పవన్ కల్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్.!

Pawan kalyan counters cm jagan s comments over his three marriages

Pawan Kalyan, JanaSena, YS Jagan Mohan Reddy, AP CM YS Jagan, Sand crisis, English medium, reverse tendering, Andhra Pradesh, Politics

Jana Sena Chief Pawan Kalyan has hit out at the ruling YSRCP government for targeting his personal aspect. Reacting strongly to CM Jagan Mohan Reddy's comments at him over his three marriages. Jana Sena Chief has asked CM Jagan whether his three marriages led him to land in jail for sixteen months.

ITEMVIDEOS: అధికార వైసీపీ పార్టీకి పవన్ కల్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్.!

Posted: 11/12/2019 05:46 PM IST
Pawan kalyan counters cm jagan s comments over his three marriages

ఆంధ్రప్రదేశ్ అధికార వైసీపీ పార్టీకి జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. వైసీపీ నేతల మాటల్ని భరించడానికి తాము టీడీపీ కాదని, జనసేన అని గుర్తుంచుకోవాలని హెచ్చరించారు. జగన్ ను ఓ కులంగా చూడమని, రాజకీయ నాయకుడిగానే చూస్తామన్నారు. మాట్లాడితే మూడు పెళ్లిళ్లు చేసుకున్నా అంటున్నారని, మీరు కూడా చేసుకోండి ఎవరు వద్దన్నారన్నారు అంటూ ఫైర్ అయ్యారు. అంతటితో ఆగని పవన్ కల్యాణ్.. తన మూడు పెళ్లిళ్లు జగన్ ఎలా ఇబ్బంది పెట్టాయో చెప్పాలన్నారు.

తాను 3 పెళ్లిళ్లు చేసుకోవడం వల్లే మీరు రెండేళ్లు జైల్లో ఉన్నారా? అని జగన్ ఉద్దేశించి పవన్ ప్రశ్నించారు. తాను ఎవరిపైనా వ్యక్తిగత దూషణలకు పాల్పడనని.. అయితే అదే పనిగా తన వ్యక్తిగత జీవితం విషయానికి వచ్చి విమర్శలు చేస్తే చూస్తూ ఊరుకోబోమని తేల్చిచెప్పారు. సీఎం జగన్ ను నేరుగా టార్గెట్ చేసిన పవన్.. ఎలా పడితే అలా మాట్లాడితే భావ్యం కాదని, పద్దతిగా మాట్లాడితే మంచిదని ఆయన సూచించారు. తాను ఒక స్థాయి వరకే సంయమనం పాటిస్తానని, హద్దు మీరితే ఎవరితో ఎలా మాట్లాడాలో తెలిసిన వ్యక్తినని హెచ్చరించారు.

భాషాప్రయుక్త రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ ఏర్పడిందని, సీఎం జగన్ కు అసలు చరిత్ర తెలుసా? అని సూటిగా ప్రశ్నించారు. తమిళనాడులో ఇంకా తెలుగు మీడియం ఉందని, టీచర్లకు ఆంగ్లంలో ప్రావీణ్యం కల్పించకుండా ఒకే సారి మారిస్తే ఎలా? అని మరోసారి ప్రశ్నించారు. ఇసుక దొరక్క నిర్మాణ రంగం కుదేలైందని, వైసీపీ నేతలు భాషా సంస్కారాన్ని మరిచి మాట్లాడినా.. తాము పాలసీ పరంగానే మాట్లాడుతామని పవన్‌ చెప్పారు. వైసీపీ నేతలు సమస్యల్ని తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. గెలుపోటములు తమకు తెలియదని, ప్రజా సమస్యల కోసం పోరాడటమే తమకు తెలుసన్నారు. గత ప్రభుత్వ తప్పిదాలనే ఈ ప్రభుత్వం చేస్తోందని పవన్‌ ఆరోపించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles