పెళ్లితో ఒక్కటయ్యే తమ బిడ్డను వరుడు జీవితాంతం తోడుగా, నీడగా వుంటూ అమె యోగక్షేమాలు చూసుకుంటాడని పూర్వం వరుడికి లాంఛనంగా ముట్టజెప్పిన కొద్ది డబ్బు.. ఇప్పుడు ఏకంగా వరకట్నంగా రూపాంతం చెంది.. ఎంతో మంది అడపడచుల జీవితాలను అగాంధలోకి నెడుతుండగా, మరెందరో జీవితాలను అర్థంతంగా ముగింపు పలికింది. అంతకుముందున్న కన్యాశుల్కం స్థానంలో వచ్చిన ఈ వరకట్న మహమ్మారిని సమూలంగా పెకిలించివేయడానికి ఎంతో మంది కృషి చేస్తున్నా.. ప్రభుత్వాలు చట్టాలు తీసుకువచ్చినా.. నశించకుండా క్యాన్సర్ వ్యాధిలా విస్తరిస్తూనే వుంది.
ఇక ఈ మహమ్మారిని అడ్డుపెట్టుకుని ఎందరో భర్తలు తమ భార్యలను హింసిస్తున్నారు. ఉన్నత చదువులు చదివి అగ్రరాజ్యం వెళ్లి ఉద్యోగాలు చేస్తున్న వారి నుంచి పామరుల వరకు ఈ మహమ్మారి అవహించిందంటే అతిశయోక్తి కాదు. కొందరు తమకు రావాల్సిన కట్నం కోసం పంచాయితీలు పెడితే.. మరికొందరు తమకు తక్కువ కట్నం ఇచ్చారని.. ఇంకా కావాలని అదనపు కట్నం కోసం పోరు పెడుతుంటారు. అయితే ఇప్పుడు మీరు చదివేది ఇలాంటి కోవకు చెందిన ఓ భర్త గురించే. కష్టపడి పోషించే స్థాయి లేదని భావించిన వాడు ఊరికే కట్నం డబ్బు వస్తోందని పెళ్లికి తయారయ్యే మగాళ్లు.. మొగుళ్లెలా అవుతారో.. అన్న ప్రశ్నలు వీరిని గురించి చదివిన తరువాత ఉదయించక మానవు.
డబ్బుపై మోజుతో కట్టుకున్న భార్యపైనే అత్యంత హీనంగా ప్రవర్తించాడో భర్త. అదనపు కట్నం కోసం అమెకు పెళ్లైన నాటి నుంచి నరకం చూపుతున్నాడు. అది చాలదన్నట్లు తాజగా అమెను బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు. భర్తే తన భార్యను బ్లాక్ మెయిల్ చేసే పాడు కాలం వచ్చేసింది. ఆమె స్నానం చేస్తుండగా రహస్యంగా వీడియో తీసిన భర్త.. ఆపై దానిని ఆమెకు చూపించి అదనపు కట్నం తేవాలని ఒత్తిడి తీసుకొచ్చాడు. తీసుకురాకుంటే ఇంటర్నెట్‌లో పెడతానని బెదిరించాడు.
పోలీసుల కథనం ప్రకారం.. ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు జిల్లాలో ఈ ఘటన జరిగిందీ. స్థానిక శ్రీనివాసరావుపేటకు చెందిన యువతికి, తాడికొండకు చెందిన యువకుడికి రెండేళ్ల క్రితం వివాహమైంది. పెళ్లైన తర్వాతి నుంచి అదనపు కట్నం కోసం భార్యను వేధించడం ప్రారంభించాడు. దీంతో ఇద్దరి మధ్య గొడవలు ప్రారంభమయ్యాయి. పెళ్లైన నాటి నుంచి అమెను అదనపు కట్నం కోసం శారీరికంగా, మానసికంగా హింసిస్తూనే వున్నాడు. అయితే భార్య కూడా అతడితో తెగేసి.. తాను ఇకపై డబ్బు తీసుకురాలేనని చెప్పడంతో అతనికి దిక్కుతోచలేదు.
దీంతో తన భార్యకు ఎలాగైనా గట్టిగా బుద్ది చెప్పి.. అత్తారింటి నుంచి అదనపు కట్నం తెచ్చుకోవాలని పథకం వేశాడు. అయితే ఇక్కడ అమె తన భార్య అన్న విషయాన్ని మర్చిపోయి దిగజారుడు చర్యకు పాల్పడ్డాడు. తన భార్య స్నానం చేస్తుండగా రహస్యంగా అమె వీడియో తీశాడు. అంతటితో ఆగకుండా అమెకు దానిని చూపించి బెదిరించసాగాడు. అదనపు కట్నం తీసుకురాకుంటే ఆమె వీడియో క్లిప్ ను సోషల్ మీడియాలో పెడతానని బెదిరింపులకు దిగాడు. భర్త చేష్టలతో నిర్ఘాంతపోయిన భార్య.. తన భర్త అకృత్యాన్ని స్పందన కార్యక్రమంలో పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
(And get your daily news straight to your inbox)
Dec 11 | ఇండియన్ శాటిలైట్ రీసర్చ్ సెంటర్ (ఇస్రో) అంతరిక్ష రేసులో ఓ అరుదైన ఘట్టం ఆవిష్కృతమైంది. షార్ మొదటి ప్రయోగ వేదిక నుంచి ఇవాళ ప్రయోగించిన సీఎస్ఎల్వీ సీ-48 ఉపగ్రహ వాహక నౌక నింగిలోకి దూసుకెళ్లింది.... Read more
Dec 11 | హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు రోడ్డుపై నిలబడి ట్రాఫిక్ రూల్స్ అతిక్రమించిన వారి బైక్ నెంబర్ ప్లేట్ ను ఫోటోలు తీస్తూ.. అదునాథన రీతిలో వారికి ట్రాఫిక్ చాలానాలు పంపుతున్న క్రమంలో.. బైక్ యజమానులు కూడా... Read more
Dec 11 | రాష్ట్రంలో రైతుల సమస్యలు పరిష్కరించాలన్న డిమాండ్ తో జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఈ నెల 12న దీక్షకు సన్నధమవుతున్నారు. రైతులకు తమ పార్టీ అండగా నిలుస్తుందని, వారి సమస్యల విషయంలో గొంతెత్తి అరిచినా... Read more
Dec 11 | అమెరికాలో మరోమారు కాల్పులు కలకలం రేపాయి. న్యూజెర్సీలో కాల్పుల మోతతో దద్దరిల్లింది. న్యూజెర్సీలోని జెర్సీ నగరంలోని హడ్ సన్ కౌంటీ నగరవాసులందరినీ భయాందోళనకు గురిచేసింది. ఈ కాల్పుల్లో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ముగ్గురు... Read more
Dec 11 | టీడీపీ పార్టీ అగ్రనేతలను ప్రభుత్వం టార్గెట్ చేస్తోందా.? వర్షాకాలం ముగిసిన తరువాత కురిసిన అకాలవర్షాలకు కృష్ణ నది పరివాహిక ప్రాంతంలోని ఇళ్లు, పోలాలు నీట మునగిన సమయంలో ప్రభుత్వ అదేశాల మేరకు కొందరు నీటిపారుదల... Read more