Congress fires on CM KCR on his false promises అర్టీసీకి రూ.47 కోట్లు లేవు.. కానీ వందల కోట్లతో అక్కడ హామీలెలా.?: కాంగ్రెస్

Congress fires on cm kcr on his false promises to people of huzurnagar

vijaya shanthi, congress, TRS, Chief Minister, CM KCR, Kalvakuntla chandrashekar rao, KCR, Huzurnagar, Bypoll promise, TSRTC strike, Telangana, Politics

Congress senior leader and publicity cell Incharge Vijayashanthi slams chief minister KCR on making false promises and bluffing people. She questions that TRS government doesnt have Rs 47 cr money to give to RTC employees but he promises Rs 100 crores of development works to Huzurnagar.

అర్టీసీకి రూ.47 కోట్లు లేవు.. కానీ వందల కోట్లతో అక్కడ హామీలెలా.? విజయశాంతి ఫైర్

Posted: 10/31/2019 10:54 AM IST
Congress fires on cm kcr on his false promises to people of huzurnagar

తెలంగాణ ప్రజలకు టీఆర్ఎస్ ప్రభుత్వం కేవలం బడాయి కోసం హామీలను గుప్పిస్తుందే తప్ప అవి అచరణ సాధ్యం కావన్న విషయం రాష్ట్రోన్నత న్యాయస్థానం హైకోర్టులో తేటతెల్లం అయ్యిందని కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు.. రాష్ట్ర కాంగ్రెస్ ప్రచారకమిటీ చైర్మన్ విజయశాంతి అన్నారు. ఆర్టీసీ సమ్మెకు సంబంధించి హైకోర్టులో టిఆర్ఎస్ ప్రభుత్వ తరపు న్యాయవాది చేసిన వాదనను చూస్తుంటే.. రాబోయే రోజుల్లో సీఎం కేసీఆర్ గారిచ్చే ఏ హామీ కూడా అమలు కాదని స్పష్టంగా అర్థం అవుతోంది విజయశాంతి విమర్శించారు. సోషల్ మీడియా వేదికగా కేసీఆర్‌పై మరోసారి విరుచుకుపడ్డారు రాములమ్మ.

ఆర్టీసీ కార్మికులకు చెల్లించేందుకు తెలంగాణ ప్రభుత్వం వద్ద కనీసం 47 కోట్ల రూపాయల నిధులు కూడా లేవని ప్రభుత్వ తరఫు న్యాయవాది పేర్కొనడం ఇందుకు నిదర్శనమని వ్యాఖ్యానించారు. హైకోర్టు కూడా ఈ వివరణకు కౌంటర్ ప్రశ్న వేస్తూ... ఆర్టీసీ కార్మికుల సమస్యలు తీర్చడానికి 47 కోట్ల రూపాయలు లేనప్పుడు హుజూర్‌నగర్‌లో 100 కోట్ల రూపాయల ఖర్చుతో అభివృద్ధి పథకాలు అమలుచేస్తానని కేసీఆర్ గారు ఎలా ప్రకటించారని కోర్టు నిలదీసిందని గుర్తు చేశారు.

కోర్టు వేసిన ప్రశ్నతో కేసీఆర్ అడ్డంగా దొరికిపోయారని విజయశాంతి ఎద్దేవా చేశారు. కోర్టు వేసిన ప్రశ్నకు సమాధానంగా హుజూర్‌నగర్‌లో వంద కోట్ల రూపాయల అభివృద్ధి పథకాలు అమలు చేయడానికి ప్రభుత్వం వద్ద తగిన నిధులు ఉన్నాయని అంగీకరించడం లేదా కేవలం ఉత్తుత్తి హామీలు ఇచ్చానని చేతులెత్తేయడం ఈ రెండిటిలో ఏదో ఒకటి చేయాలని అన్నారు. ఒకవేళ హుజూర్‌నగర్ అభివృద్ధికి వంద కోట్ల రూపాయలు కేటాయిస్తే అప్పుడు ఆర్టీసీ కార్మికులకు కూడా 47 కోట్ల రూపాయలు ఇవ్వాల్సి వస్తుందని వ్యాఖ్యానించారు.

ఈ పరిస్థితి నుంచి తప్పించుకునేందుకు.. తన పంతాన్ని నెగ్గించుకునేందుకు వంద కోట్ల రూపాయల అభివృద్ధి నిధులు ఇవ్వకుండా హుజూర్‌నగర్ ఓటర్లకు కేసీఆర్ మొండిచేయి చూపిస్తారని అర్థమవుతోందని విజయశాంతి అన్నారు. ఇప్పటి వరకు తాను అపర చాణుక్యుడనని కెసిఆర్ ఫీలవుతూ ఉంటారని... అయితే ఇప్పుడు కోర్టు వేసిన గూగ్లితో ఆయన బండారం బయటపడిందని విజయశాంతి విమర్శించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : vijaya shanthi  congress  TRS  Chief Minister  CM KCR  Huzurnagar  Bypoll promise  TSRTC strike  Telangana  Politics  

Other Articles