JC Diwarkar Reddy arrested in ananthapuram టీడీపీ సీనియర్ నేత జేసీ దివాకర్ రెడ్డి అరెస్టు

Tdp senior leader jc diwarkar reddy arrested in ananthapuram

JC Diwakar Reddy, YS Jagan, YSRCP, TDP, Nagaraju, Pedda Reddy, venkatapuram, bukkarayapatnam mandal, Ananthapur, YS Jagan Government, Andhra Pradesh, Politics

TDP Senior Leader, former MP JC Diwarkar Reddy had been arrested in venkatapuram of bukkarayapatnam mandal in ananthapuram district for disobeying police officials orders and heading to a controversial land.

ఆనంతపురంలో టీడీపీ సీనియర్ నేత జేసీ దివాకర్ రెడ్డి అరెస్టు

Posted: 10/30/2019 01:22 PM IST
Tdp senior leader jc diwarkar reddy arrested in ananthapuram

టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. వివాదాస్పద ప్రాంతానికి వెళ్తున్న ఆయనను పోలీసులు నిలువరించే ప్రయత్నం చేసినా.. పెడచెవిన పెట్టి.. ముందుకు సాగుతున్న జేసీ దివాకర్ రెడ్డిని అదుపులోకి తీసుకున్న పోలీసులు ఆయనను అరెస్టు చేసి ఇతర ప్రాంతానికి తరలించారు. ఫాక్షన్ రాజకీయాలకు అలవాలమైన రాయలసీమలోని అనంతపురం జిల్లాలో జేసీ దివాకర్ రెడ్డికి అనుచరగణం చాలా ఎక్కువగా వుందన్నమాట వాస్తవం. అనంతపురంలోనే సీనియర్ నేతగా కొనసాగుతున్న ఆయన.. తన అనుచరగణానికి ఏ కష్ట,నష్టమొచ్చినా ముందుంటారు.

వారిని అంతాతానే అయ్యి నిలబడతారు. దశాబ్దాలుగా అలా తన అనుచరగణాన్ని కాపాడుకోవడంతోనే ఆయన ఓటమి ఎరుగని నేతగా కొనసాగుతున్నాడు. తాజాగా తన అనుచరుడికి తానున్నానన్న ధైర్యం చెప్పేందుకు వెళ్తున్న క్రమంలో పోలీసులు జేసి దివాకర్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలిలా వున్నాయి. అనంతలోని బుక్కరాయసముద్రం మండలం వెంకటాపురం గ్రామంలో ఇటీవల టీడీపీ నేత నాగరాజు ఇంటి చుట్టూ వైసీపీ నేత పెద్దిరెడ్డి బండలు పాతించడం కలకలం రేపిన విషయం తెలిసిందే. ఈ చర్య వల్ల వెంకటాపురం ప్రాంతంలో వైసీపీ, టీడీపీ నేతల మధ్య రహదారి వివాదం ఏర్పడింది.

ఈ నేపథ్యంలో కొన్ని రోజులుగా అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంటోంది. దీంతో ఈ రోజు ఆ ప్రాంతానికి వెళ్లాలని ప్రయత్నించిన టీడీపీ మాజీ ఎంపీ జేసీ దివాకర్‌ రెడ్డిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. తనను ఎందుకు అరెస్ట్‌ చేస్తున్నారంటూ ఆయన పోలీసులతో వాగ్వివాదానికి దిగారు. తమ పార్టీ నేత ఇంటికి అడ్డంగా పెట్టిన బండలు తొలగించేందుకే జేసీ దివాకర్ రెడ్డి వెంకటాపురం బయలుదేరినట్లు తెలుస్తోంది. బండలు నాటిన స్థల వివాదం కోర్టులో ఉందని మొదట ఆయనకు పోలీసులు సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ దివాకర్ రెడ్డి ఆ గ్రామంలోకి వెళ్లడానికి యత్నించడంతో పోలీసులు ఆయనను అరెస్ట్ చేసి బుక్కరాయసముద్రం పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles