Pawan Kalyan fires on ysrcp government భృతి కొల్పోతున్న కార్మికులు.. ప్రభుత్వంపై పవన్ ఫైర్..

Pawan kalyan fires on ysrcp government

Janasena, Pawan Kalyan, Mangalagiri, Amaravati, constuction field, capital, sand policy, real estate field, daily labour, ycp government, andhra pradesh, politics

Jana Sena party President Pawan Kalyan critisizes YSRCP government of making no decision on amaravati since came into power. The Hero turned policitian also slams the governemt for not giving the assurance to the constuction sector workers and daily labour, who are starving for one day meal since ysrcp came into power.

భృతి కొల్పోతున్న కార్మికులు.. ప్రభుత్వంపై పవన్ ఫైర్..

Posted: 10/25/2019 04:56 PM IST
Pawan kalyan fires on ysrcp government

జనసేన అధినేత పవన్ కల్యాణ్ మరోమారు రాష్ట్రంలోని వైసీపీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. రాష్ట్రంలో రెక్కాడితే కాని డొక్కాడని అనేక మంది జీవితాలు.. గత మూడు, నాలుగు నెలలుగా అంధకారంలోకి జారిపోయిందని మరీ ముఖ్యంగా భవన నిర్మాణ కార్మికులు, కూలీలు బతుకులు అగమ్యగోచరంగా మారాయని ఆయన అందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ప్రభుత్వం తీసుకున్న ఇసుక విధానంతోనే వీరంతా నిరుద్యోగులుగా మారారని ఆయన విమర్శించారు.

రాష్ట్రంలో ప్రభుత్వ పాలన పేలవంగా ఉందని వ్యాఖ్యానించారు. ఇసుక కొరత లక్షల మంది కార్మికులను పనులకు దూరం చేసిందని విచారం వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని నలుమూలల నుంచి పనులు లభిస్తాయని అమరావతికి చేరుకున్న కూలీలు, కార్మికులు జీవితాలను వైసీపీ ప్రభుత్వం చీకటిమయం చేస్తోందని విమర్శించారు. జగన్ ప్రభుత్వం చర్యలతో ఏకంగా 19 లక్షల మంది రోడ్డున పడ్డారని ఆయన తీవ్ర అవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం నూతనంగా ఉద్యోగ, ఉపాధి కల్పన చేయాలి కానీ, ఉన్న ఉద్యోగాలను ఊడకొట్టకూడదని చెప్పారు.

మంగళగిరిలో పార్టీ కార్యాలయంలో పవన్ మీడియాతో మాట్లాడుతూ వైసీపి ప్రభుత్వ పాలనతీరును ఎండగట్టారు. ఇసుక సరఫరా పునరుద్ధరణ జరిగేంతవరకు పోరాటం చేస్తామన్నారు. ప్రభుత్వ విధానాల వల్ల తమ కుటుంబాలు గడవడమే కష్టంగా మారిందని ఇసుక లారీల యజమానులు చెబుతున్నారని పవన్ తెలిపారు. అర్ధరాత్రి పూట ఇసుక ఆన్ లైన్ బుకింగ్ ఎందుకు అని ప్రశ్నించారు. ప్రభుత్వ పరిపాలన తీరు బాధ కలిగిస్తోందని, రాజధాని అమరావతిపై వైకాపా ప్రభుత్వం తన వైఖరిని స్పష్టం చేయాలన్నారు. అక్కడ రాజధాని కడతారా? లేదా? అన్నది ప్రజలకు తెలపాలని డిమాండ్ చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles