Maharashtra BJP, Shiv Sena returns, haryana hung మహారాష్ట్రలో బీజేపి కూటమి హవా.. లాభం చేకూర్చిన ఎంఐఎం

Maharashtra results bjp shiv sena lead in 160 sena says will stick to alliance

mumbai election result, mumbai election result 2019, navi mumbai election result 2019, mumbai suburban election result, mumbai city election result, Mumbai Assembly Election result, worli election result,mumbai, devendra fadnavis, uddhav thackeray, Ashok chavan, Sharad pawar, congress, BJP, Shiv sena, NCP, maharashtra, politics

The BJP has taken an early lead in Maharashtra. Bharatiya Janata Party has been in power for the last five years and if the exit poll numbers hold, it is set to come back to power for the second straight term under its incumbent chief minister Devendra Fadnavis.

మహారాష్ట్రలో బీజేపి కూటమి హవా.. లాభం చేకూర్చిన ఎంఐఎం

Posted: 10/24/2019 12:31 PM IST
Maharashtra results bjp shiv sena lead in 160 sena says will stick to alliance

మహారాష్ట్రలో బీజేపీ కూటమి దూసుకుపోతోంది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలను నిజం చేస్తూ ఆ కూటమి అధికారం చేపట్టే దిశగా ముందుకు సాగుతోంది. గత అసెంబ్లీ ఎన్నికలలో బీజేపి ఒంటరిగా పోటీ చేసి అత్యధిక స్థానాలను కైవసం చేసుకున్న స్థానాల సంఖ్యనే.. తాజాగా సాగిన కూటమిలోనూ అదే పునరావృతం అయ్యింది. అయితే, ఇది కేవలం బీజేపి-శివసేన కూటమికే కాకుండా అటు వారి ప్రత్యర్థి కూటమైన కాంగ్రెస్-ఎన్సీపీలకు సేమ్ టు సేమ్ సీన్ రిపీట్ అయ్యింది. మహారాష్ట్రంలో గతంలో కన్నా శివసేన మెరుగైన ఫలితాలను సాధించింది.

మొత్తంగా 288 స్థానాలు వున్న మహారాష్ట్ర అసెంబ్లీలో అధికార పగ్గాలు దక్కాలంటే తప్పకుండా 145 స్థానాలను కైవసం చేసుకోవాల్సి వుంది. అయితే బీజేపి శివసేన కూటమి సునాయాసంగా ఈ సంఖ్యను అధిగమించి.. పయనిస్తోంది. బీజేపి 103, శివసేన 61 సీట్లలో ముందంజలో దూసుకుపోతుండగా, కాంగ్రెస్ 41, ఎన్సీపీ 52 సీట్లలో గెలుపు దిశగా పరుగులు తీస్తోంది. కాగా ఇతరులు 31 స్థానాల్లో తమ అధికత్యను కనబరుస్తున్నారు. రాజ్ థాక్రే నేతృత్వంలోని ఎంఎన్ఎస్ పార్టీ కూడా ఒక అసెంబ్లీ స్థానాన్ని కైవసం చేసుకుంది.

ఇక మహారాష్ట్రలో బీజేపి కూటమి నెత్తిన ఎంఐఎం పార్టీ పాలు పోసిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఎంఐఎం పార్టీ తమకు పట్టున్న ప్రాంతాల్లో అభ్యర్థులను పోటీకి దింపింది. దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీ పక్షాన నిలిచిన మైనారిటీలు.. తాజా పరిస్థితుల నేపథ్యంలో వారు ఎంఐఎం పార్టీకి చేరువయ్యారు. ఇలా తమ ప్రభావాన్ని పెంచుకునే పనిలో ఎంఐఎం పార్టీ విజయం సాధించగా, కాంగ్రెస్ మాత్రం తమకు మంచి పట్టున్న అసెంబ్లీ స్థానాలను చేజార్చుకుంది. దీంతో కాంగ్రెస్ రెండకెల మార్కు వద్దే నిలిచిపోగా.. బీజేపి మాత్రం శతకం మార్కు దాటి పయనిస్తోంది.

మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ మాత్రం ఓ సందర్భంలో వెనుకంజలో, మరో సందర్భంలో ముందంజలో కొనసాగుతున్నారు. నాగ్ పూర్ సౌత్ వెస్ట్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న ఆయనతో ఓట్లు దోబూచులాడుతున్నాయి. ఓ రౌండ్‌లో ఫడ్నవీస్ వెనుకంజ వేయడంతో మహారాష్ట్ర సీఎం అభ్యర్థిగా ఎవర్ని ఎంపిక చేస్తారంటూ ఒక్కసారిగా వార్తలు గుప్పుమన్నాయి. ఒక వేళ ఫడ్నవీస్ ఓడిపోతే ఎవరు సీఎం పీఠం ఎక్కుతారంటూ అప్పుడే చర్చలు మొదలయ్యాయి. కాగా, వర్లీ నుంచి శివసేన అభ్యర్థి ఆదిత్య థాక్రే ముందంజలో ఉన్నారు. పర్లీ నుంచి పంకజ్ ముండే వెనుకంజలో ఉన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : devendra fadnavis  uddhav thackeray  Ashok chavan  Sharad pawar  Congress  BJP  shiv sena  NCP  Maharashtra  Politics  

Other Articles