Fire Accident at Shine Hospital Kills One Child షైన్ ఆస్పత్రిలో భారీ అగ్ని ప్రమాదం ..

Fire accident at shine hospital kills one child

Shine Hospital, Fire Accident, Hyderabad

Fire Accident at Shine Hospital Kill One Child

షైన్ ఆస్పత్రిలో భారీ అగ్ని ప్రమాదం ..

Posted: 10/22/2019 11:13 AM IST
Fire accident at shine hospital kills one child

(Image source from: thenewsminute.com)

ఆస్పత్రులు వైద్యం అందించడంలోనే కాదు.. రోగులకు భద్రత ఇవ్వడంలోనూ విఫలం అవుతున్నాయి. ఆస్పత్రుల్లో అనుకోని ఘటనలు ఎదురైతే రోగులు, వారి బంధువులను కాపాడేందుకు కూడా వీలు లేకుండా నిర్మాణాలు ఉంటున్నాయి. అసలు అనేక ఆస్పత్రులు అగ్ని ప్రమాద రక్షణ వ్యవస్థలే లేకుండా నడుస్తున్నాయి. తాజాగా హైదరాబాద్‌ ఎల్‌బీనగర్‌లోని షైన్‌ ఆసుపత్రి పై అంతస్తులో సోమవారం తెల్లవారుజామున  2.40 గంటలకు అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. అయిదుగురు చిన్నారులు అదే అంతస్తులో ఇంక్యుబేటర్లపై చికిత్సపొందుతున్నారు. అకస్మాత్తుగా మంటలు చెలరేగి చిన్నారుల ఛాతి, పొట్ట, ముఖం భాగాలు కమిలిపోయాయి. ఈ ప్రమాదంలో 4 నెలల మగ శిశువు మృతిచెందాడు. మరో ముగ్గురు చిన్నారులకు తీవ్ర గాయాలయ్యాయి. ఇంకో శిశువు పొగ పీల్చడంతో అస్వస్థతకు గురయ్యాడు. ఈ నలుగురిని అత్యవసర చికిత్స కోసం నగరంలోని వేర్వేరు ఆసుపత్రులకు తరలించారు. ముగ్గురి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. వీరితోపాటు ఆస్పత్రిలో జనరల్‌ వార్డులో మరో 34 మంది వరకూ చికిత్స పొందుతున్నారు.

ఆసుపత్రిలో ఇటీవల కాలంలో రెండుసార్లు షార్ట్‌ సర్క్యూట్‌ జరిగి పొగలు వచ్చినట్లు రోగులు చెబుతున్నారు. మూడు రోజుల క్రితం కూడా ఇలాగే పొగలు వస్తే సిబ్బంది సరిచేశారని వివరించారు. ఈ నేపథ్యంలోనే ఆదివారం రాత్రి ప్రమాదాన్ని కూడా సిబ్బంది తేలిగ్గా తీసుకున్నారని.. కానీ, మంటలు చెలరేగడంతో ఇంత దారుణం జరిగిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఫ్రిజ్‌ వెనుక భాగంలో షార్ట్‌ సర్క్యూట్‌ అవడం వల్లే మంటలు చెలరేగినట్టు భావిస్తున్నామని పోలీసులు చెప్పారు. మృతి చెందిన శిశువు తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు 304ఏ సెక్షన్‌ కింద కేసు నమోదు చేసి.. ఆస్పత్రి ఎండీ సునీల్‌రెడ్డిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. అలాగే.. ఆస్పత్రి యాజమాన్యానికి ఎన్‌ఫోర్స్‌మెంట్‌, విజిలెన్స్‌, డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ విభాగం నోటీసులు జారీ చేసింది. కాగా.. వైద్య మంత్రి ఈటల ఈ ప్రమాదంపై విచారణకు ఆదేశించారు. దీంతో ప్రజారోగ్య సంచాలకుడు ఒక విచారణ అధికారిని నియమించి 24 గంటల్లో నివేదిక ఇవ్వాలని సూచించారు.

రాష్ట్రంలోని చాలా ఆస్పత్రులు ఇరుకైన గదుల్లో ఉంటున్నాయి. అందులోనూ గాలీ వెలుతురు వచ్చే అవకాశం లేని కిటికీలు, అత్యవసర పరిస్థితి తలెత్తితే బయటకు వెళ్లలేని స్థితుల్లో ఆస్పత్రుల నిర్మాణాలుంటున్నాయి. అగ్ని ప్రమాదం సంభవిస్తే సాధారణ పౌరుల మాదిరిగా రోగులు ఉరుకులు పరుగులు తీసే పరిస్థితి ఉండదు. కాబట్టి ఆస్పత్రుల్లో అత్యంత ప్రత్యేకమైన నివారణ చర్యలు తీసుకోవాలి. షైన్‌ ఆస్పత్రిలో నెలల చిన్నారి ఎటు పరిగెత్తగలదు? ఎంతో కీలకమైన ఆస్పత్రుల్లో కనీస ప్రమాదం నివారణ చర్యలే లేవంటే ఎంత దారుణం

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Shine Hospital  Fire Accident  Hyderabad  

Other Articles

 • Milwaukee shooting five dead at molson coors campus after employee opens fire

  అమెరికా బీర్ల కంపెనీలో కాల్పుల కలకలం.. 5గురు మృతి

  Feb 27 | అమెరికాలో మరోమారు కాల్పుల కలకలం రేగింది. ఓ ఉద్యోగి తనను ఉద్యోగం నుంచి తొలగించిన పరిశ్రమలోని తన సహుద్యోగులపై కాల్పులకు తెగబడ్డాడు. బీర్ పరిశ్రమలకు నెలవైన ప్రాంతంగా పేరొందిన విస్కాన్సిన్ రాష్ట్రంలోని మిల్‌వాకీ నగరంలో... Read more

 • Centre notifies transfer of justice s muralidhar from delhi high court

  సీఏఏ అల్లర్లు: పోలీసులపై మండిపడ్డ న్యాయమూర్తి బదిలీ.!

  Feb 27 | ఈశాన్య ఢిల్లీలో చోటుచేసుకున్న ఘటనల నేపథ్యంలో దాఖలపై పిటీషన్లపై అర్థరాత్రి విచారించి.. పరిణామాలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను, పోలీసులను తీరును ఎండగడుతూ వ్యాఖ్యలు చేసిన ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తిపై 24 గంటలు కూడా తిరక్కుండానే... Read more

 • Indian railways earns thousand crores from ticket cancellation in three years

  రైల్వే టికెట్ కాన్సిలేషన్ తో.. వేల కోట్ల ఆదాయం..

  Feb 26 | వెయిట్‌లిస్ట్ చేసిన టికెట్లను రద్దు చేయడం మర్చిపోయారా? అయితే మీకో షాకింగ్‌ న్యూస్‌. భారతీయ రైల్వే కాన్సిలేషన్‌ టికెట్ల ద్వారా కోట్లాది రూపాయలను సంపాదించింది. వినడానికి ఆశ్చర్యంగా వున్నా.. రైల్వే ప్రయాణికులు బుక్‌ చేసుకున్న... Read more

 • Delhi violence lives could have been saved had the police acted in time says sc

  ఢిల్లీ హింసాత్మక ఘటనలు పోలీసుల వైఫల్యమే: సుప్రీంకోర్టు

  Feb 26 | ఈశాన్య ఢిల్లీలో పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేక, అనుకూల వర్గాల మధ్య చెలరేగిన హింసాత్మక ఘటనల నేపథ్యంలో ఢిల్లీ పోలీసుల తీరు సముచితంగా లేదని దేశసర్వోన్నత న్యాయస్థానం అభిప్రాయపడింది. ఈ ఘటనల నేపథ్యంలో పోలీసులు... Read more

 • Sonia gandhi on delhi violence amit shah should resign

  సీఏఏ అల్లర్లు: అమిత్ షా రాజీనామాకు కాంగ్రెస్ డిమాండ్

  Feb 26 | ఈశాన్య దిల్లీలో చోటుచేసుకున్న ఘటనలను కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీ ఖండించారు. ఇలాంటి ఘటనలు బాధాకరమన్నారు. మూడు రోజుల ఆందోళనల్లో 27 మంది చనిపోయారని ఆమె ఆవేదన వ్యక్తంచేశారు. ఈ మేరకు ఇవాళ ఢిల్లీలో... Read more

Today on Telugu Wishesh