TSRTC All Party Meeting: Protests to be Intensified టిఎస్‌ఆర్‌టిసి ఆల్ పార్టీ సమావేశం

Tsrtc all party meeting protests to be intensified

TSRTC, Telangana government, KCR, TSRTC All Party Meeting, TSRTC All Party Meeting, TSRTC All Party Meeting Updates

TSRTC All Party Meeting: Protests to be Intensified: Leaders of Joint Action Committee (JAC) of TSRTC unions have called an all-party meeting in Hyderabad today to discuss about the further action.

టిఎస్‌ఆర్‌టిసి ఆల్ పార్టీ సమావేశం

Posted: 10/09/2019 03:02 PM IST
Tsrtc all party meeting protests to be intensified

(Image source from: sakshi.com)

తెలంగాణ ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో సోమాజీగూడ ప్రెస్‌క్లబ్‌లో ఆర్టీసీ ఐకాస భేటీ అయ్యింది. అన్ని రాజకీయపార్టీలు, ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలను ఐకాస నేతలు ఆహ్వానించారు. ఈ కార్యక్రమానికి ఆర్టీసీ ఐకాస కన్వీనర్‌ అశ్వత్థామరెడ్డితోపాటు, భాజపా నుంచి రామచంద్రరావు, తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరామ్‌, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు రావుల చంద్రశేఖర్‌రెడ్డి తదితరులు హాజరయ్యారు. సమ్మె వ్యూహంపై అఖిలపక్షంలో చర్చిస్తున్నారు. దాదాపు 50 వేల ఆర్టీసీ కార్మికుల కుటుంబాలతో సీఎం చెలగాటం ఆడుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా అశ్వద్దామరెడ్డి మాట్లాడుతూ.. సమ్మె ముఖ్య ఉద్దేశం జీతభత్యాలు కాదని స్పష్టం చేశారు. ‘ఆర్టీసీ సమ్మెపై సీఎం చాలా విచిత్రంగా మాట్లాడుతున్నారు. అయితే ఆర్టీసీని బతికించడమే మా లక్ష్యం. గత ఐదేళ్ల నుంచి ఆర్టీసీలో ఒక్క నియామకం జరగలేదు. కార్మికులు దాచుకున్న పీఎఫ్‌ డబ్బును ఎందుకు ఇవ్వడం లేదు?. ఆర్టీసీపై డిజీల్‌ భారం ఎక్కువైంది. 27 శాతం డిజీల్‌పై పన్ను వేస్తున్నారు. ప్రజా రవాణా వ్యవస్థపై నాలుగో వంతు ప్రజలు ఆధారపడి ఉన్నారు. ప్రజలు మా సమ్మెకు సంపూర్ణ మద్దతు తెలుపుతున్నారు. అన్ని రాజకీయ పార్టీలు మాకు సహకరించాలి. అవసరమైతే తెలంగాణ బందుకు పిలుపునిద్దాం’అని అశ్వద్ధామరెడ్డి పేర్కొన్నారు. కాగా, తెలంగాణాలో ఆర్టీసీ సమ్మె ఐదో రోజుకు చేరింది. ప్రజల ప్రయాణ కష్టాలు ఇంకా వెంటాడుతూనే ఉన్నాయి. దసరా పండగ ముగించుకోని తిరిగి గమ్యస్థానాలకు వెళ్లాలనుకునేవారికి తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి.  కాగా సమ్మెపై ఏ విధంగా ముందుకు వెళ్లాలి, న్యాయపరమైన ఇబ్బందులు లేకుండా పోరాడటానికి ఏం చేయాలనే దానిపై అఖిలపక్ష సమావేశంలో చర్చిస్తున్నారు. అంతేకాకుండా ఈ సమావేశంతో అనంతరం గవర్నర్‌ను కలవాలని అఖిలపక్ష సభ్యులు భావిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : TSRTC  Telangana government  TSRTC All Party Meeting  

Other Articles