PM tweet shows concern for Bihar, not Karnataka: BJP MLA ప్రజలు మమ్మల్ని చితకొట్టేలా ప్రధాని తీరు: బీజేపి ఎమ్మెల్యే

Centre s aide stirs conflict k taka bjp mla yatnal angered over pm s decision

Basanagouda Patil Yatnal, Yatnal lashes out at PM Modi, Bihar, Bihar flood, Modis aide for Bihar, BJP lashes out at Modi for Bihar aides, Karnataka floods relief funds, BJP MLA, Vijayapura MLA, PM Modi, Flood ravage, Bihar, floods relief funds, centre aid, Karnataka, Politics

Vijayapura MLA Basanagouda Patil Yatnal was angered with PM Modi's tweet where he said that the central government is ready to provide assistance to the flood-affected Bihar.

ప్రజల్లోకి వెళ్లలేని పరిస్థితులను ప్రధాని సృష్టిస్తున్నారు: బీజేపి ఎమ్మెల్యే

Posted: 10/02/2019 08:25 PM IST
Centre s aide stirs conflict k taka bjp mla yatnal angered over pm s decision

బీహార్ కు అండగా ఉంటామంటూ ప్రధాని నరేంద్రమోదీ చేసిన ట్వీట్ పై కర్ణాటకకు చెందిన బీజేపీ ఎమ్మెల్యే తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. త్వరలో ఎన్నికలు జరగనున్న బీహార్ వరదలపై ఆరా తీసిన ప్రధాని మోదీ.. అదే వరదలతో అతలాకుతలమైన కర్ణాటక గురించి ఒక్క మాటైనా మాట్లాడకపోవడంపై ఆయన తీవ్ర అగ్రహం వ్యక్తం చేశారు. ఏకంగా ప్రధానమంత్రిపై సొంతపార్టీకి చెందిన ఎమ్మెల్యే ఎందుకిలా ఫైర్ అయ్యారన్న విషయంలోకి ఎంటరైతే..

25 మంది ఎంపీలను ఇచ్చిన కర్ణాటక వరదలు ముంచెత్తిన నేపథ్యంలో ప్రధానిగా నరేంద్రమోదీ పట్టించుకోకపోవడం దారుణమన్న బీజేపీ ఎమ్మెల్యే బసనగౌడ యత్నాల్.. ఇలాగైతే పార్టీకి కష్టకాలం వచ్చినట్టేనని చెప్పేశారు. కర్ణాటకను పట్టించుకోకపోతే దక్షిణ భారతంలో పార్టీ పట్టు కోల్పోతుందని బాహాటంగానే చెప్పేశారు. ఇది రాజకీయాలకు సంబంధించిన విషయం కాదని, ప్రజల మనోభావాలు, భావోద్వేగాలకు సంబంధించినదని బసనగౌడ పేర్కొన్నారు.

బీహార్ వరదలపై ట్వీట్ చేసిన ప్రధాని మోదీ కర్ణాటక గురించి ఒక్క ట్వీట్ కూడా చేయకపోవడం ఆయనలోని ఎన్నికల కోణాన్ని బహిర్గతం చేస్తోందని విమర్శించారు. ప్రధాని బీహార్ పై స్పందించి, కర్ణాటకపై స్పందించని తరుణంలో ప్రజల్లోకి బీజేపి ఎమ్మెల్యేలు ఎలా వెళ్తారని ఆయన ప్రశ్నించారు. తాము ప్రజల్లోకి వెళ్లలేని పరిస్థితులు ప్రధాని మోడీ వల్లే ఉత్పన్నమవుతున్నాయన్నారు. ప్రజలకు తమ ముఖాలు ఎలా చూపించాలని నిలదీశారు. కర్ణాటకలో ఎన్నికలు లేవనే రాష్ట్రం గురించి మోదీ పట్టించుకోవడం లేదన్న ప్రచారం జరుగుతోందన్నారు.

ఏది ఏమైనా ముందు ప్రజలు, ఆ తర్వాత రాష్ట్రం, అటు తర్వాతే పార్టీ అని తెగేసి చెప్పారు. కర్ణాటకలో ప్రస్తుత పరిస్థితి గురించి పార్టీ ఎంపీలు ప్రధాని దృష్టికి తీసుకెళ్లాలని, లేదంటే తాము ఎమ్మెల్యేలమని, ఎంపీలమని చెబితే ప్రజలు చితక్కొట్టడం ఖాయమని బసనగౌడ ఆవేదన వ్యక్తం చేశారు. ఆగస్టులో కర్ణాటకను వరదలు ముంచెత్తాయి. ఆ సమయంలో మోదీ నుంచి ఒక్క ట్వీట్ కూడా రాలేదు. కానీ బీహార్ వరదలపై ట్వీట్ చేసిన మోదీ, ఆ రాష్ట్రానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. కాగా, బీహార్ వరదల్లో ఇప్పటి వరకు 29 మంది ప్రాణాలు కోల్పోయారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : BJP MLA  Vijayapura MLA  PM Modi  Flood ravage  Bihar  floods relief funds  centre aid  karnataka  politics  

Other Articles