vijaya sai reddy brings new trouble to CM Jagan జగన్ ను ఇబ్బందుల్లోకి నెట్టిన ఎంపీ కామెంట్లు

Mp vijaya sai reddy brings new trouble to cm jagan

vijaya sai reddy, YS Jagan, chandrababu, nara lokesh, twitter, employment, party cadre, jobs, andhra pradesh, Politics

Andhra Pradesh major opposition party Telugu Desam demands Chief Minister YS Jagan resignation after party senior leader and Rajya sabha member Vijaya sai reddy statements in a public meeting goes viral.

జగన్ ను ఇబ్బందుల్లోకి నెట్టిన ఎంపీ కామెంట్లు

Posted: 09/24/2019 07:12 PM IST
Mp vijaya sai reddy brings new trouble to cm jagan

వైసీపీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు విజయసాయి అత్యుత్సాహం రాష్ట్రంలోని వైసీపీ ప్రభుత్వంతో పాటు సీఎం వైఎస్ జగన్ ను కూడా ఇబ్బందుల్లోకి నెట్టేసింది. జగన్ రాజీనామా కోరటానికి ప్రతిపక్షాలకు ఓ ఆయుధంలా మారింది. వైసిపి ఎంపి విజయసాయిరెడ్డి పార్టీ సమావేశంలో మాట్లాడుతూ గ్రామ వాలంటీర్ల నియామకాల్లో 90 శాతం పార్టీ కార్యకర్తలకే వచ్చాయన్నారు. తాన దగ్గరున్న లెక్కల ప్రకారమే మాట్లాడుతున్నట్లు చెప్పారు. అలాగే గ్రామ సచివాలయాల పోస్టుల నియామకాల్లో కూడా పార్టీ వారిలో కొందరికి ఉద్యోగాలు వచ్చినట్లు చెప్పారు.

అంతటితో ఆగని ఆయన ఉద్యోగాలు రాని వైసీపీ కార్యకర్తలకు ఏదో రూపంలో న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. అయితే ఇదంతా నలుగురు మధ్.. నాలుగు గోడల నడుమ మాట్లాడుకోవాల్సిన విషయాలు. కానీ విజయసాయి బహిరంగంగా మైకులో చెప్పటమే ఇపుడు సమస్యగా మారింది. ఆయన మైకులో చెప్పిన మాటలను టిడిపి క్యాచ్ చేసింది. దాన్ని బాగా హైలైట్ చేస్తోంది. ఉద్యోగాలు రాని నిరుద్యోగులను ప్రభుత్వంపై వ్యతిరేకత వచ్చేలా చేస్తున్నాయి ప్రతిపక్షాలు.

దీంతో రంగంలోకి దిగిన టీడీపీ అధినేత చంద్రబాబు, మాజీ మంత్రి లోకేష్ లు ట్విట్టర్లో విమర్శల వర్షం కురిపిస్తున్నారు. అంతేకాదు ముఖ్యమంత్రి పదవికి జగన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. నిజానికి ఐదేళ్ళు అధికారంలో ఉన్నపుడు చంద్రబాబు చేసింది కూడా ఇదే. ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నికైన సర్పంచులను కూడా పక్కన పెట్టేశారు. జన్మభూమి కమిటిలను సృష్టించి మొత్తం అధికారాలను వాటికే కట్టబెట్టారు. ఆ కమిటిలన్నింటినీ పార్టీ నేతలతోనే నింపేశారు. విచిత్రమేమిటంటే జన్మభూమి కమిటీలపై అప్పట్లో టిడిపి నేతలే గోల పెట్టేశారు.

అయితే తమ నేతలను క్రమశిక్షణలో పెట్టడంలో సిద్దహస్తుడైన చంద్రబాబు వ్యతిరేకించే గళాలను నియంత్రించారు. తర్వాత ప్రతిపక్షాలు గోల చేసినా చంద్రబాబు పట్టించుకోలేదన్నది వాస్తవం.  మొన్నటి ఎన్నికల్లో జనాలు టిడిపికి వ్యతిరేకంగా కసితో వైసిపికి ఓట్లేయటంలో జన్మభూమి కమిటిల అరాచకాలు కూడా ప్రధాన పాత్ర పోషించింది.  అలాంటి చంద్రబాబు కూడా ఇపుడు జగన్ రాజీనామా కోరుతున్నారంటే విజయసాయి అత్యుత్సాహమే కారణమని చెప్పక తప్పదు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : vijaya sai reddy  YS Jagan  chandrababu  nara lokesh  employment  andhra pradesh  Politics  

Other Articles