BJP's future depends on Chandrababu: JC Diwakar Reddy బీజేపి, చంద్రబాబులపై జేసి హాట్ కామెంట్స్

Jc diwakar reddy sensational comments on bjp and chandrababu

JC Diwakar Reddy sensational comments, JC Diwakar Reddy hot comments on BJP, JC Diwakar Reddy hot comments on Chandrababu, JC Diwakar Reddy, sensational comments, Ananthapur, BJP, TDP, Chandrababu, Andhra Pradesh, Politics

Former Member of Parliament from Ananthapur JC Diwakar Reddy made sensational comments on his own party chief Chandrababu naidu, with whom the central ruling party BJP is becomming strong in the state.

ITEMVIDEOS: బీజేపి, చంద్రబాబులపై జేసి దివాకర్ రెడ్డి సంచలన కామెంట్లు

Posted: 09/14/2019 03:55 PM IST
Jc diwakar reddy sensational comments on bjp and chandrababu

అనంతపురం మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి బిజేపి పార్టీపై సంచలన కామెంట్స్ చేశారు. యావత్ భారతంలో బీజేపి తన సత్తాను చాటుకుంటున్నట్లుగానే.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీజేపీ ప్రభంజనం మొదలైందని రానున్న ఎన్నికల నాటికి రాష్ట్రంలో బీజేపి ఉనికి చాటుకుంటుందని అన్నారు. ఎన్నికల సమయానికి రాష్ట్రంలో బీజేపి ప్రభంజనం ఎక్కువైనా కావచ్చు, తక్కువైనా కావచ్చన్నారాయన. అయితే బీజేపి బలపడటం వెనుక టీడీపీ అధినేత, ప్రతిపక్ష నేత చంద్రబాబు పరోక్ష పాత్ర ఎంతైనా ఉందన్నారు.

టీడీపికి చెందిన రాజ్యసభ ఎంపీలు సుజనా చౌదరి, సీఎం రమేష్, టీజీ వెంకటేష్ తదితరులు కాషాయ జెండాను కప్పుకున్న తరుణంలో.. చంద్రబాబు వల్లే రాష్ట్ర బీజేపీలో వలసలు పెరిగాయని ఆయన అభిప్రాయపడ్డారు. చంద్రబాబు ఆలోచనల పైనే రాష్ట్రంలో బీజేపీ ఆధారపడి ఉందన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ ఆలోచనల పైన ప్రాంతీయ పార్టీలు ఆధార పడి ఉన్నాయన్నారు. జమిలి ఎన్నికల కారణంగా ప్రాంతీయ పార్టీలు కనుమరుగు అయ్యే అవకాశాలు ఉన్నాయనేది తన అభిప్రాయమన్నారు జేసీ.

గత కొన్నిరోజులుగా ఏపీలో బీజేపీలోకి వలసలు ప్రారంభమయ్యాయి. టీడీపీకీ చెందిన పలువురు ఎంపీలు, మాజీ మంత్రులు వరుసగా కమలం పార్టీలోకి క్యూ కట్టారు. ఎంపీలు సుజనా, సీఎం రమేష్, టీజీ, గరికపాటి మొదటగా కమలం పార్టీ కండువా కప్పుకున్నారు. ఆ తర్వాత పలువురు సీనియర్ నేతలు కూడా బీజేపీలోకి జంప్ కొట్టారు. మరికొందరు కూడా కమలం గూటికి చేరేందుకు కూడా సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో జేసీ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ మారాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : JC Diwakar Reddy  sensational comments  Ananthapur  BJP  TDP  Chandrababu  Andhra Pradesh  Politics  

Other Articles