Five killed after car overturns, catches fire చిత్తూరులో ఘోర రోడ్డు ప్రమాదం.. 5గురు మృతి

Five of a family killed in crash in andhra pradesh s chittoor

Five of a family killed in car crash, Chittoor car accident, Five of family charred to death, family charred to death, Andhra Pradesh car accident, Chittoor car accident, Tirupati to Bengaluru Highway accident, car crash in ap, car crash in chittoor, car crash, accident, Mamudugu village, Chittoor, Andhra Pradesh

Five members of a family were killed and another injured as a car in which they were travelling caught fire after it overturned in Andhra Pradesh's Chittoor. The ghastly tragedy occurred near Mamudugu village when the family was on its way from Tirupati to Bengaluru.

అతివేగానికి కుటుంబం అహుతి.. చిత్తూరులో ఘోర రోడ్డు ప్రమాదం

Posted: 09/14/2019 01:20 PM IST
Five of a family killed in crash in andhra pradesh s chittoor

చిత్తూరు జిల్లాలో ఘోరం రోడ్డు ప్రమాదం సంభవించింది. అతివేగంగా వెళ్తున్న కారు అదుపు తప్పి బొల్తా కొట్టడంతో కారులో పల్టీలు కొడుతూ రోడ్డు పక్కనున్న ప్రాంతంలోకి ఎగరిపడింది. దీంతో ఒక్కసారిగా కారులో మంటలు చెలరేగడంతో అందులో ప్రయాణిస్తున్న ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు వ్యక్తులు సజీవ దహనం కాగా, మరొకరు తీవ్రగాయాలతో ప్రాణాలతో బయటపడ్డారు.

కారులో అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో కారులోని ప్రయాణికులు బయటకు రాలేక మంటలకు ఆహుతయ్యారు. ఒకరు మాత్రం తీవ్ర గాయాలతో బయటపడగలిగారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన తిరుపతి బెంగళూరు జాతీయ రహదారిపై చోటుచేసుకుంది.

బెంగళూరు నుంచి పలమనేరు వెళ్తున్న కారు చిత్తూరు జిల్లా గంగవరం మండలం మామడుగు సమీపంలో ప్రమాదవశాత్తు అదుపు తప్పి బోల్తా పడింది. కారులోంచి తీవ్ర గాయాలతో బయటపడ్డ క్షతగాత్రుడ్ని చికిత్స నిమిత్తం అసుపత్రికి తరలించిన పోలీసులు.. ఘటనపై కేసు నమోదు చేసుకున్నారు. ప్రమాదానికి దారితీసిన వివరాలపై దర్యాప్తు చేస్తున్నారు. మృతులలో ముగ్గురు చిన్నారులతో పాటు ఐదుగురు ఒకే కుటుంబానికి చెందిన వారని పోలీసులు తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles