autorickshaw urges police to jail him జైలుకెళ్లేందుకు రెడీ.. కానీ ఫైన్ కట్టలేనన్న అటోడ్రైవర్

Ready to go behind bars but will not pay challan says fine imposed autorickshaw driver

Traffic Rules, Motor Vehicles Amendment Act, traffic cops, drunk and drive check, Motor Vehicle (Amendment) Act, Haribandhu Kanhar, Autorikshaw driver, auto driver, Motor Vehicle Act, Motor Vehicle Act Challan, Traffic Police Challan, Acharya Vihar Chhak, Bhubaneswar, Odisha, Crime news

A drunk autorickshaw driver says he is ready to go behind bars but cannot pay fine imposed by traffic police. He was fined Rs 47,500 by the cops for driving without a valid permit, licence, registration and under various sections of the amended Motor Vehicles Act

జైలుకెళ్లేందుకు నేను రెడీ.. కానీ ఫైన్ కట్టలేనన్న అటోడ్రైవర్

Posted: 09/06/2019 05:45 PM IST
Ready to go behind bars but will not pay challan says fine imposed autorickshaw driver

కొత్త వాహన చట్టం అమలులోకి వచ్చిన తరువాత వాహన దారులు ఎదుర్కోంటున్న ఇబ్బందులు అన్నిఇన్నీ కావు. అసలు జరిమానా అనేది ఎందుకు.? జరిమానాలు తప్పు చేయకుండా వుండటానికే తప్ప.. తప్పుకు పాల్పడిన వ్యక్తి కుటుంబంపై భారం పడి.. వారంతా పస్తులుండేట్లు చేయడానికా.? లేక కుటుంబం యావత్తు అప్పుల ఊబిలోకి కూరుకుపోవడానికా.? అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. దేశంలో నూటికి 30 శాతం మంది రెక్కడితే కానీ డొక్కాడని బతుకులు, ఆటో డ్రైవర్లు, టాక్సీలు, క్యాబ్ లు, ప్రైవేటు వాహనాలు, గేర్, గేర్ రహిత ద్విచక్రవాహనదారులు తమ పోట్టకూటి కోసం తప్పక తమ వాహనాలపై బయటకు వెళ్లాల్సిందే.

అయితే ఈ కొత్త వాహనచట్టం గురించి దేశవ్యాప్తంగా పూర్తి అవగాహన కూడా కల్పించకుండానే దానిని తమ చేతుల్లో అధికారముందని అటు కేంద్రం అమలు చేయగా, ఇటు విధి నిర్వహణలో భాగంగా పోలీసులు వాహనదారులపై జరిమానాలు విధించేస్తున్నారు. రాజకీయ నేతలు, ఉన్నత ప్రభుత్వ ఉద్యోగులు చట్టాలను తమ చుట్టలుగా మార్చేసుకుని ఎంచక్కా తిరిగేస్తున్నారు కానీ.. ఎవరిని.? ఎందుకు నిందించాలో కూడా తెలియని అమాయక ప్రజలు మాత్రం అనేక ఇబ్బందులు పడుతున్నారు.

ఇది మంచిదే అయినా జరిమానాలు చూసి జడుసుకునే స్థాయి తీసుకురావడం.. అటు కనీసం ప్రభుత్వ రవాణా వ్యవస్థను కూడా మెరుగుపర్చకపోవడం.. ఇన్ని అవాంతరాల నడుమ అంత త్వరగా ఎందుకు అమలు చేస్తున్నారో ప్రభుత్వ పెద్దలకే తెలియాలి. కేవలం ప్రజలను కష్టాల్లోకి నెట్టితే.. వారు దేశ, రాష్ట్ర పరిస్థితుల గురించి మాట్లాడరు.? ఎందుకంటే తాము ఎదుర్కోంటున్న సమస్యలే వారికి సాగరమధనం చేసినంతలా అనిపిస్తోందన్నది ప్రభుత్వ యోచనాలా వుంది. కొత్త వాహన చట్టం అమలులోకి తెచ్చిన తరువాత చాలా చలానాలు వసూలు అయ్యాయి. నిన్ననే రాజధాని నగరంలో ఓ వ్యక్తికీ 25 వేలరూపాయల ఫైన్ వేశారు.  

ఇదిలా ఉంటె, తాజాగా ఓ ఆటో డ్రైవర్ కు భారీ చలన వేశారూ. అతనికి కొత్త వాహన చట్టంపై అవగాహన కూడా లేదు. అయితేనేం అనుకున్నారో ఏమో పోలీసులు.. అతనికి జరిమానా విధించారు. ఏకంగా 47వేల రూపాయల మేర ఫైన్ వేసారు. దీంతో ఆ ఆటో డ్రైవర్ షాక్ అయ్యాడు. అటోకు సంబంధించిన పత్రాలేవి తన వద్ద లేకపోవడంతో పాటు మద్యం సేవించి వాహనం నడపడం వల్ల అతనికి ఇంత భారీ ఫైన్ పడింది. అయితే తన దగ్గర అంత డబ్బు లేదని, తనను అరెస్ట్ చేసి జైలుకు తీసుకెళ్లాలని అంటున్నాడు. చలానా కట్టాలి అంటే తన ఆస్తులు అన్ని అమ్మినా సరిపోవని, ఈ కేసును ఎదుర్కోవడం కోసం తాను జైలు గోడల మధ్యకు వెళ్లేందుకైనా రెడీ అన్నాడు. దీంతో పోలీసులు నివ్వెరపోయారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

Today on Telugu Wishesh