Lalbaugcha Raja first look unveiled in Mumbai ఆకట్టుకుంటున్న చంద్రయాన్ వినాయకుడు.!

First look of lalbaugcha raja revealed with chandrayaan 2 theme

Ganesh chathurthi, Chandrayaan 2, Lord Ganesha, lalbaugcha raja, ganesh chaturthi, mumbai, Maharashtra, nation, Devotional news

The residents of Mumbai finally caught the first glimpse of Lalbaugcha Raja and as expected, it's simply spectacular! With the theme of Chandrayaan 2, the idol of Lord Ganesha this time has been created against the backdrop of outer space with several dummy astronauts surrounding the figure.

ITEMVIDEOS: ఆర్థిక రాజధానిలో ఆకట్టుకుంటున్న చంద్రయాన్ వినాయకుడు.!

Posted: 08/31/2019 11:09 AM IST
First look of lalbaugcha raja revealed with chandrayaan 2 theme

వినాయక చవితి పండగ వచ్చేసింది. మరికొన్ని గంటల వ్యవధిలో యావత్ ప్రపంచలోని హైందవ భక్తులందరూ ఎంతో భక్తిశ్రద్దలతో గణేష్ చతుర్థిని నిర్వహించుకుంటారు. భక్తులు తమ శక్తికొద్ది విఘ్నేశ్వరుడి విగ్రహాలను తీసుకునివచ్చి.. తమ ఇళ్లలో ప్రతీష్టించి పూజలు నిర్వహిస్తారు. భగవంతుడికి ఇష్టమైన జిల్లేడి, మారేడు, తులసి, తదితర 21 ఆకులు, పండ్లు సమర్పిస్తారు. వీటితో పాటు పిండివంటలు చేసి భగవంతుడికి నైవేద్యాన్ని నివేదిస్తారు. ఇళ్లలోని విషయాలను పక్కనబెడితే.. ఇక యువత ముఖ్యంగా ఈ పండుగను వీధుల్లో సంబరంగా నిర్వహిస్తారు.

స్థానికుల నుంచి చందాలను వసూలు చేసి మరీ తమ వీధిలోని వినాయకుడే ఆకర్షణీయంగా వుండేలా మంచి విగ్రహాన్ని ఎంపిక చేసుకోవడంతో పాటు.. మంచి కార్యక్రమాలను నిర్వహణ, రుచికరమైన ప్రసాదాలు పంఫిణీ ఇత్యాదులను నిర్వహించి.. స్థానికుల చేత ఔరా అనిపించుకుంటారు. ఇప్పటికే రకరకాల ఆకారాల్లో వినాయక విగ్రహాలు రెడీ అవుతున్నాయి.  ముఖ్యంగా ముంబై నగరంలో పూజలు అందుకునే గణపయ్యలను వివిధ ఆకారాల్లో తయారు చేస్తుంటారు.  లేటెస్ట్ ట్రెండ్ కు తగ్గట్టుగా వినాయకులను తయారు చేస్తుంటారు.  

ఇదే దేశ ఆర్థిక రాజధాని ముంబైలో అత్యంత రద్దీగా ఉండే దేవాలయాల్లో లాల్ బాగ్చా దేవాలయం ఒకటి.  అక్కడ ప్రతి ఏడాది భారీ వినాయక విగ్రహాన్ని ఏర్పాటు చేస్తారు.  అంతేకాదు.. అక్కడ ఏర్పాటు చేసే వినాయకుడు చాలా కొత్తగా ట్రెండ్ కు తగ్గట్టుగా ఉంటాడు. ఈసారి వినాయక చవితికి చంద్రయాన్ 2 గణపతిని ఏర్పాటు చేశారు.  గణపతి విగ్రహం పైనా ఇద్దరు వ్యోమగాములు .. విగ్రహం తల వెనక భాగంలో చంద్రయాన్ 2 ఉపగ్రహం..విగ్రహానికి వెనుక భాగంలో తెరను ఏర్పాటు చేసి.. చంద్రయాన్ 2 లాంచింగ్ కు సంబంధించిన విషయాలను చూపుతున్నారు. భారత ఖ్యాతిని గ్రహాంతరాలకు వ్యాపింపజేసిన ఇస్రోకు గుర్తుగా ఇలా వినాయకుడిని అక్కడ ప్రదర్శించారు.  

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles