Guns fail to fire during cremation of former Bihar CM మధ్యవర్తిత్వానికి రెడీ అంటూ మళ్లీ మొదటికొచ్చిన ట్రంప్

Twenty two rifles fail to fire during gun salute to former bihar cm

Mishras ancestral village Supaul district, Jagannath Mishras cremation, Jagannath Mishra cremation, Jagannath Mishra, former Bihar CM Jagannath Mishra, Bihar police at Jagannath Mishras cremation, ancestral village in Supaul district, sushil kumar modi, Jagannath Mishra, Lalu Prasad Yadav, Nitish Kumar, Bihar, Politics

While former Bihar chief minister Jagannath Mishra mortal remains were being cremated with full state honour, 22 rifles carried by police personnel failed to fire a single shot.

ITEMVIDEOS: మాజీ సీఎం జగన్నాథ్ మిశ్రా అంత్యక్రియల్లో అవమానం

Posted: 08/22/2019 03:42 PM IST
Twenty two rifles fail to fire during gun salute to former bihar cm

బీహార్ మాజీ ముఖ్యమంత్రి జగన్నాథ్ మిశ్రా అంత్యక్రియల్లో అవమానం జరిగింది. సుదీర్ఘకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న 82 ఏళ్ల జగన్నాథ మిశ్రా ఈ నెల 19న కన్నుమూసారు. ఆయన స్వగ్రామమైన బీహార్ లోని బలువాలో ప్రభుత్వ లాంఛనాల మధ్య అంత్యక్రియలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అధకార లాంఛనాలతో అంత్యక్రియలకు ఏర్పాట్లు ప్రభుత్వం చేసింది. ఇంతవరకు బాగానే వున్నా ఇక్కడే కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ ముఖ్యమంత్రికి పరాభవం ఎదురైంది.

అయితే, అంత్యక్రియలకు ముందు పోలీసులు ఆయనకు గౌరవంగా గాలిలోకి తుపాకులు పేల్చాల్చి ఉంది. ఇందుకోసం 22 మంది పోలీసులు సన్నద్ధమయ్యారు. కానీ విచిత్రంగా ఏ ఒక్క తుపాకీ నుంచి కూడా గుండు పేలకపోవడంతో అక్కడున్న వారు ఆశ్చర్యపోయారు. పోలీసులు, అధికారులు తుపాకులను పరీక్షించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. దీంతో అంత్యక్రియల్లో కాసేపు గందరగోళం నెలకొంది. ముఖ్యమంత్రి నితీశ్ కుమార్, ఉప ముఖ్యమంత్రి సుశీల్ కుమార్ మోదీ సమక్షంలోనే ఇలా జరగడం గమనార్హం.

అయితే పోలీసులు రిహార్సెల్ చేస్తున్నారని భావించారు అక్కడున్న వారు. కానీ అధి రిహార్సల్ కాదు. తుపాకులే పనిచేయలేదు. కనీసం ఒక్కటంటే ఒక్క తుపాకీ కూడా పేలకపోవడంతో జగన్నాథమిశ్రా మృతికి సంతాపసూచకంగా దక్కాల్సిన గౌరవం లభించనే లేదు. అయితే తుపాకులు పనిచేయకపోవడం అనేది చాలా తీవ్రమైన తప్పిదమని సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. జిల్లా పోలీసు అధికారుల నుంచి వివరణ కోరినట్టు ఆయన పేర్కొన్నారు. కాగా ఈ విషయమై స్పందించిన ఆర్జేడీ ఎమ్మెల్యే పిప్రా యధవంశ్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ ఇది ప్రభుత్వం మాజీ ముఖ్యమంత్రిని దారుణంగా అవమానించడమేనని అన్నారు. ఈ ఘటనపై సమగ్రదర్యాప్తు చేయ్యాలని డిమాండ్ చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles