Telangana Cop goes from Hero to Zero ఉత్తమ కానిస్టేబుల్ అమ్యామ్యాల భాగోతం..

Telangana cop caught taking bribe day after getting best constable award

Best Constable Awardee caught by ACB, Best Constable Award, Srinivas Goud, Independence say, Sand business, Mudavath Ramesh, Police Department, ACB, Palle Thirupathi Reddy, Telangana, Politics

Telangana Constable Palle Thirupathi Reddy, who was given the 'best constable' award and a citation by the Telangana government on August 15th, has been caught red-handed by the ACB on the next day

ఏసీబి బయటపెట్టిన ఉత్తమ కానిస్టేబుల్ లంచాల భాగోతం

Posted: 08/17/2019 06:42 PM IST
Telangana cop caught taking bribe day after getting best constable award

ఉత్తమ కానిస్టేబుల్ గా అమాత్యుల చేతుల మీదుగా అవార్డు అందుకున్న ఆమ్యామ్యాలకు మాత్రం చేయి చాచడం ఆగలేదు. స్వతహాగా వున్న అలవాటు అంత తొందరగా వదులుకోలేని కానిస్టేబుల్.. కనీసం అవార్డును పొందిన తరుణంలోనైనా కొన్ని రోజుల పాటు మానుకుని వుంటే బాగుండేది. అయితే ఉత్తమ కానిస్టేబుల్ పురస్కారం అందుకున్న నేపథ్యంలో తనకు ఎదురేమిటని భావించాడో  ఏమో.. బాధితుడి నుంచి అమ్యామ్యాలను తీసుకుంటు 24 గంటలు కూడా తిరక్కుండానే ఏసీబీ చేతికి చిక్కాడు.

తెలంగాణలో మహబూబ్ నగర్ లో జరిగిన  ఈ ఘటన ప్రభుత్వం అందించే పురస్కారాలను కూడా చర్చనీయాంశంగా మార్చేసింది. స్థానికంగా సంచలనం సృష్టించిన ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే.. మహబూడ్ నగర్ పట్టణంలోని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో పనిచేస్తున్న తిరుపతి రెడ్డి ఉత్తమ కానిస్టేబుల్ గా ఎంపికయ్యాడు. స్వాతంత్ర్య దినోత్సవం రోజున మంత్రి శ్రీనివాస్‌గౌడ్ చేతుల మీదుగా తిరుపతిరెడ్డి పురస్కారం అందుకున్నాడు.

గురువారం అందుకున్న పురస్కారాన్ని పక్కన పడేసిన కానిస్టేబుల్ శుక్రవారమే లంచాల దందాకు తెరతీశాడు. వెంకటాపూర్ గ్రామానికి చెందిన ముడావత్ రమేశ్ అనే ఇసుక వ్యాపారిని అడ్డుకుని అతడి ఇసుక ట్రాక్టర్‌ను సీజ్ చేశాడు. రూ.17 వేలు ఇస్తేనే ట్రాక్టర్ ను విడిచిపెడతానని తేల్చి చెప్పాడు. దీంతో బాధితుడు ముడావత్ రమేశ్ ఏసీబీ అధికారులను ఆశ్రయించి విషయం చెప్పాడు. నిబంధనలకు అనుగుణంగానే ఇసుకను తరలిస్తున్నప్పటికీ కానిస్టేబుల్ తిరుపతిరెడ్డి తనను అడ్డుకుని లంచం డిమాండ్ చేస్తున్నాడని పిర్యాదు చేశాడు.

తనకు డబ్బులు ఇవ్వకుంటే తప్పుడు కేసులు బనాయిస్తానని హెచ్చరించాడంటూ రమేశ్ ఆవేదన వ్యక్తం చేశాడు. దీంతో ఏసీబీ అధికారులు అతడికి రూ.17 వేలు ఇచ్చి కానిస్టుబుల్‌కు ఇవ్వమని చెప్పారు. వారు చెప్పినట్టే పోలీస్ స్టేషన్ ఆవరణలో కానిస్టేబుల్‌ను కలిసి అడిగిన మొత్తం ఇచ్చాడు. అప్పటికే అక్కడ కాపుకాసిన ఏసీబీ అధికారులు తిరుపతిరెడ్డిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అతడి నుంచి నగదు స్వాధీనం చేసుకుని అరెస్ట్ చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles