Russia supports India's move on J&K పాక్ కు మరో షాక్.. రష్యా మద్దతు కూడా ఇండియాకే.!

Russia backs india asks both nations to take diplomatic route

russia on kashmir, kashmir, kashmir russia, kashmir updates, updates jammu, kasmir curfew, jammu and kashmir, jammu and kashmir news, kashmir situation, jammu situation, article 370 kashmir

After the United States, United Nations, now Russia has asked India and Pakistan not to allow worsening of the situation in Kashmir even as it backed the Article 370 move carried out "within the framework of Constitution".

పాక్ కు మరో షాక్.. రష్యా మద్దతు కూడా ఇండియాకే.!

Posted: 08/10/2019 02:17 PM IST
Russia backs india asks both nations to take diplomatic route

జమ్ము-కశ్మీర్‌ లో అర్ఠికల్ 370తో పాటు ఆర్టికల్ 35-ఎ ను ఎత్తివేసి.. కేంద్రపాలిత ప్రాంతాలుగా మార్చుతూ.. తక్షణం అమల్లోకి అదేశాలను తీసుకువచ్చిన నేపథ్యంలో కాశ్మీర్ లోని ప్రజల హక్కులను భారత్ కాలరాసిందని విషప్రచారం చేస్తున్నపాకిస్థాన్ కు మరో ఎదురుదెబ్బ తగిలింది. జమ్మూకాశ్మీర్ విషయంలో చైనా మినహా అన్ని దేశాలు భారత్ కే మద్దతు ప్రకటించిన విషయం తెలిసిందే.

అయితే జమ్మూకాశ్మీర్ అంశంలో భారత ప్రభుత్వం చేపడుతున్న చర్యలను తాము నిషితంగా పరిశీలిస్తున్నామని చెప్పిన రష్యా మద్దతుతో పాటు తటస్థ నిర్ణయం తీసుకున్న పలు దేశాల మద్దతును కూడా కూడగట్టుకోవాలని ప్రయత్నాలు ముమ్మరం చేసిన పాకిస్తాన్ కు నిన్న ఐక్యరాజ్య సమితి నుంచి తగిలిన షాక్ నుంచి తేరుకోకముందే.. ఇవాళ తాజాగా మరో ఎదురుదెబ్బ తగిలింది. తప్పకుండా తమకే మద్దుతునిస్తాయని గంపెడాశను పెట్టుకున్న రష్యా ఇచ్చిన షాక్ దాయాధికి భారీగానే తగిలింది.

భారత్-పాక్ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులను క్షుణ్ణంగా పరిశీలిస్తున్న రష్యా.. ఇరు దేశాలు సంయమనం పాటించాలని సూచించింది. సమస్యల పరిష్కారానికి చర్చలు జరపాలని పేర్కొంది. ఉద్రిక్తతలు చల్లార్చే చర్యలను ఇరు దేశాలు తీసుకుంటాయని భావిస్తున్నట్టు రష్యా విదేశాంగ మంత్రిత్వ శాఖ ఆశాభావం వ్యక్తం చేసింది. అంతేకాదు, జమ్ముకశ్మీర్ విషయంలో భారత్ తన రాజ్యాంగానికి లోబడే నిర్ణయం తీసుకుందని నమ్ముతున్నట్టు ప్రకటించి పాక్‌కు షాకిచ్చింది.

జమ్ముకశ్మీర్‌కు ప్రత్యేక అధికారాలు కల్పించే 370 అధికరణను ప్రభుత్వం రద్దు చేసి రాష్ట్రాన్ని కేంద్రపాలిత ప్రాంతాలుగా విడగొట్టిన తర్వాత భారత్-పాక్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కశ్మీర్ విషయంలో భారత్ తీసుకున్న చర్యలను తీవ్రంగా ఖండిస్తున్న పాక్ అంతర్జాతీయ సమాజం మద్దతు కూడగట్టడంలో విఫలమైంది. దీంతో తీవ్ర నిర్ణయాలు తీసుకుంటూ దుందుడుకుగా వ్యవహరిస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Article 370  India  Pakistan  Russia  diplomatic route  foreign affairs  politics  

Other Articles