మలుపులు తిరుగుతున్న కర్ణాటక రాజకీయానికి సుప్రీంకోర్టు చెక్ పెడుతుందా? తీర్పు ఎలా ఉండబోతోంది? దాదాపు నెల రోజులుగా పరిపాలన అటకెక్కి... వ్యూహాలు, ప్రతివ్యూహాలతో వేడెక్కిన కర్ణాటకలో స్వార్థ రాజకీయాలకు ఇవాళ బ్రేక్ పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. అటు ప్రభుత్వం, ఇటు ప్రతిపక్షం సుప్రీంకోర్టుకు వెళ్లటం... ప్రభుత్వం, రెబల్ ఎమ్మెల్యేలు వాదనలు వినిపించడంతో... సుప్రీంకోర్టు ఏం చెబుతుందన్నది ఆసక్తిగా ఉంది. తమ రాజీనామాలను స్పీకర్ రమేష్ కుమార్ ఆమోదించేలా ఆదేశించాలని కాంగ్రెస్, జేడీఎస్ నుంచీ 15 మంది రెబల్ ఎమ్మెల్యేలు కోరుతున్నారు. స్పీకర్ తమ రాజీనామాల విషయంలో కావాలనే లేటు చేస్తున్నారని రెబెల్స్ అంతా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. రాజీనామాల విషయంలో సర్వోన్నత న్యాయస్థానం నుంచి తీర్పు వెలువడేంత వరకు యధాతథ స్థితిని కొనసాగించాలని స్పీకర్ను సుప్రీంకోర్టు ఆదేశించింది. సంకీర్ణ ప్రభుత్వం బల పరీక్షకు కొన్ని గంటలే సమయం ఉంది. దీంతో ఇవాళ సుప్రీం తీర్పు ఎలా ఉంటుందోననే సర్వత్రా ఆసక్తి నెలకొంది. తీర్పు తమకు అనుకూలంగా రాకపోతే ఏం చేయాలనే అంశంపై రెబెల్స్ తర్జనభర్జన అవుతున్నారు.. ఇటు రాజకీయ పార్టీల్లో, అటు కన్నడ ప్రజల్లో తాజా పరిణామాలు ఉత్కంఠ పెంచుతున్నాయి.
(And get your daily news straight to your inbox)
Dec 07 | దిశ హత్యాచార ఘటనలో నిందితులను ఎన్ కౌంటర్ చేసి హతమార్చిన క్రమంలో.. ముక్కుపచ్చలారని పదకొండేళ్ల చిన్నారితో పాటు ముగ్గురు మైనర్ బాలికలపై అత్యాచారం చేసి అత్యంత దారుణంగా హతమార్చి.. తన భావిలోనే పూడ్చిపెట్టిన కరుడగట్టిన... Read more
Dec 07 | దిశ హత్యాచార ఘటనలో నిందితులను ఎన్ కౌంటర్ చేసి హతమార్చిన క్రమంలో.. ఉన్నావ్ అత్యాచార బాధితురాలికి కూడా అలాంటి న్యాయాన్నే అందించాలని ఉత్తర్ ప్రదేశ్ లోని ప్రజాసంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఇదిలావుండగా తమ బిడ్డలను..... Read more
Dec 07 | ఉన్నావ్ అత్యాచార బాధితురాలి మరణం పట్ల ఉత్తరప్రదేశ్ వ్యాప్తంగా తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి. కేసును నమోదు చేయడంతో పాటు బాధితురాలికి రక్షణ కల్పించడంలోనూ పోలీసులు, ప్రభుత్వం పూర్తిగా విఫలమయ్యారని స్థానికులు, ప్రజాసంఘాలు ఆగ్రహాన్ని వ్యక్తం... Read more
Dec 07 | అతను నిరక్షాసి.. అయితే తనకు ఉద్యోగం కూడా ఎవరూ ఇవ్వడం లేదు.. నలభై ఏళ్లు వస్తున్నా అతనికి పెళ్లి కూడా కాలేదు. అయితేనేం.. తన తల్లిదండ్రులను పోషన బాధ్యత మాత్రం తనదే అని గుర్తెరిగిన... Read more
Dec 07 | అగ్రరాజ్యం అమెరికాలో మరోమారు కాల్పుల మోతలు ధద్దరిల్లాయి. సాధారణంగా పాఠాశాల్లో లేదా విశ్వవిద్యాలయాల్లో లేదా పనిచేసే చోట మాత్రమే కలకలం రేపే కాల్పులు.. ఈ సారి ఏకంగా నావికా దళంలో మార్మోగాయి. దీంతో అధ్యక్షుడు... Read more