Demolition of Praja Vedika ప్రజావేదిక కూల్చివేత...

Demolition of praja vedika

YS Jagan, Praja Vedika, Praja Vedika news, Praja Vedika demolition, Praja Vedika property, Praja Vedika cost, Praja Vedika latest, Praja Vedika latest updates

YS Jagan conducted Collectors Conference in Praja Vedika and he made some shocking comments that this would be the last meeting in the premises.

ప్రజావేదిక కూల్చివేత...

Posted: 06/26/2019 11:35 AM IST
Demolition of praja vedika

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించినట్లే అక్రమ నిర్మాణాల కూల్చివేత ఉండవల్లిలోని ప్రజావేదిక నుంచే మొదలైంది. ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు అధికారంలో ఉండగా ఉండవల్లిలో కృష్ణా నది కరకట్టపై అక్రమంగా నిర్మించిన ప్రజావేదికను కూల్చివేయాలని కలెక్టర్ల సమావేశంలో ముఖ్యమంత్రి నిర్ణయించిన విషయం విదితమే.ఆ నేపథ్యంలో మంగళవారం సదస్సు ముగిసిన వెంటనే సీఆర్‌డీఏ అధికారులు రంగంలోకి దిగారు.ఉండవల్లిలోని ప్రజావేదిక భవనం కూల్చివేతను అధికారులు మంగళవారం సాయంత్రం చేపట్టారు.అర్ధరాత్రి సమయానికి భవనం చుట్టూ నిర్మించిన ప్రహరీ గోడను కొంత మేర కూల్చివేశారు. ప్రధాన భవనం పక్కనే నిర్మించిన ప్యాంట్రీ, చిన్న డైనింగ్‌ హాల్‌, మరుగుదొడ్లను తొలగించారు. ప్రధాన భవనం కూల్చివేత పనులను ప్రారంభించారు. భవన ప్రవేశ ద్వారంవద్ద మెట్లు, ఎలివేషన్‌ను తొలగించారు. మంగళవారం రాత్రి ఒంటి గంట సమయానికి ప్రజావేదిక కూల్చివేత పనులు యుద్ధప్రాతిపదికన జరుగుతున్నాయి. బుధవారం నాటికి భవనం కూల్చివేత పనులు చాలావరకు పూర్తయ్యే అవకాశముంది. అందులో ఉన్న ఫర్నిచర్, కంప్యూటర్లు, ఏసీలు, మైక్‌ సిస్టమ్స్, ఎలక్ట్రానిక్‌ సామగ్రి, పూల మొక్కలు కుండీలు సహా అన్నింటి వివరాలు నమోదు చేసుకుని ఆ తర్వాత కూల్చివేత పనులు మొదలు పెట్టారు. పూల కుండీలన్నింటినీ రాయపూడి సమీపంలోని సీఆర్‌డీఏ నర్సరీకి, మిగిలిన వస్తువులన్నింటినీ సచివాలయానికి తరలించారు.

విదేశీ పర్యటన నుంచి తిరిగి వచ్చిన తెదేపా అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు మంగళవారం రాత్రి మంగళవారం రాత్రి 11.30 గంటలకు విజయవాడ చేరుకున్నారు. గన్నవరం విమానాశ్రయానికి చేరకున్న చంద్రబాబుకు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్న తెదేపా నాయకులు, కార్యకర్తలు స్వాగతం పలికారు. చంద్రబాబుతో పాటు కార్యకర్తలు, నేతలు కూడా ఉండవల్లికి వెళ్లడానికి ప్రయత్నించడంతో పోలీసులు కృష్ణా కరకట్ట వద్ద వారిని అడ్డుకున్నారు. కరకట్టపైన  చంద్రబాబు కాన్వాయ్‌కు మాత్రమే అనుమతి ఇచ్చారు. దీంతో అక్కడ కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

 

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : YS Jagan  Praja Vedika  

Other Articles