judgement reserved on Ravi Prakash Bail Petition రవిప్రకాష్ బెయిల్ పిటీషన్ పై.. రిజర్వులో తీర్పు

Hc reserves judgement on tv 9 ravi prakash bail petition

Ravi Prakash, Shivaji, Telangana High Court, Bail Petirion, data theft, fake shares purchase, national company law tribunal, Forgery Case, Cyberabad Cybercrime Police, Investigation, Evidences, Hyderabad, KCR, Telangana CM, Telangana, politics

The Telangana High Court had reserved the judgement on TV9 former CEO Ravi Prakash Bail petition, after recording both the plaintiff and accused hearings.

రవిప్రకాష్ బెయిల్ పిటీషన్ పై.. రిజర్వులో తీర్పు

Posted: 06/18/2019 02:03 PM IST
Hc reserves judgement on tv 9 ravi prakash bail petition

పోర్జరీ, డాటా చోరి, అధికార దుర్వినియోగం కేసుల్లో అభియోగాలు ఎదుర్కోంటున్న సీనియర్ పాత్రికేయుడు, టీవీ9 మాజీ సీఈఓ రవిప్రకాశ్‌ ముందస్తు బెయిల్ పిటీషన్ పై తెలంగాణ హైకోర్టులో ఇవాళ వాదనలు ముగిసాయి. ఇరు పక్షాల వాదనలు విన్న కోర్టు తీర్పుని రిజర్వ్ లో పెట్టింది. ఇవాళ కోర్టులో రవిప్రకాష్ తరపున వాదనలు వినిపించిన దిల్ జిత్ సింగ్ అహువాల్యా... టీవీ 9 షేర్ల అగ్రిమెంట్ కుట్రపూర్వకంగా జరిగిందన్నారు. షేర్లు కొనుగోలు చేసినప్పుడు మనీ ట్రాన్సక్షన్ అంతా నిబంధనలకు విరుద్ధంగా జరిగిందన్నారు.

కాపీ రైట్స్ ప్రకారం టీవీ 9 లోగో రవిప్రకాష్ కే చెందుతుందని తన వాదనలు బలంగా వినిపించారు. రవిప్రకాష్ 40వేల షేర్లను నటుడు శివాజీకి అమ్మడం వాస్తవమేనని.. ఈ షేర్లకు సంబంధించి అర్థిక వ్యవహారాలు మొత్తం బ్యాంక్ ల ద్వారా జరిగాయన్నారు. లావాదేవీల జరిగినట్టు బ్యాంకుల నుంచి తెచ్చిన స్టేట్ మెంట్లే ఈ విషయాన్ని రూడీ చేస్తాయని అన్నారు. ఇక టీవీ 9 వ్యవహారాలకు సంబంధించి నేషనల్ కంపెనీ లా ట్రిబ్యూనల్ లో కేసు పెండింగ్ లో ఉందన్నారు. రవిప్రకాష్ పై మూడు కేసులు వెంట వెంటనే నమోదు అయ్యాయన్నారు.

అయితే టీవీ 9 షేర్ల కొనుగోలు నిబంధనల ప్రకారమే జరిగిందని ప్రభుత్వం తరపు న్యాయవాది కోర్టుకి తెలియజేశారు. దీనికి సంబంధించి అగ్రిమెంట్ పేపర్లను కోర్టుకి సమర్పించారు. బ్యాంకుల ద్వారానే మనీ ట్రాన్సాక్షన్ జరిగిందన్నారు. దీనికి సంబంధించిన ఆధారాలు కూడా కోర్టుకి సమర్పించారు. టీవీ 9 లోగో వ్యక్తి ప్రాపర్టీగా ఉండదని, కంపెనీ ప్రాపర్టీగా మాత్రమే ఉంటుందన్నారు. నేషనల్ కంపెనీ లా ట్రిబ్యూనల్ లో ఎలాంటి కేసు పెండింగ్ లో లేదన్నారు. రవిప్రకాష్, శివాజీలకు సంబంధించిన పిటిషన్ పై నేషనల్ కంపెనీ అప్పియేట్ లా ట్రిబ్యునల్ స్టే ఇచ్చిందని ప్రభుత్వం తరపు లాయర్ కోర్టుకి తెలియజేశారు. ఇరు పక్షాల వాదనలు విన్న కోర్టు తీర్పుని వాయిదా వేసింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

 • Man dies in queue for subsidy onions in gudiwada

  వృద్దుడి ఉసురు తీసిన ఉల్లి.. గుడివాడలో ఘటన

  Dec 09 | ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదన్నది పెద్దల నానుడి. అలాంటి ఉల్లి ఏకంగా మనుషుల ప్రాణాలను కూడా తీస్తోందని మాత్రం ఎవ్వరూ ఊహించివుండరు. కానీ అదే జరుగుతోంది. ఉల్లి ధరకు రెక్కలు వచ్చి..... Read more

 • Man gets ready to marry another girl after being engaged

  ITEMVIDEOS: కళ్యాణ ఘడికలు.. కటకటాలు లెక్కబెట్టించాయ్..!

  Dec 09 | అధిక కట్నం ఆశకు పోయి.. పెళ్లి పీటలెక్కాల్సిన వరుడు.. కటకటాల్లో ఊచలు లెక్కబెడుతున్నాడు. కళ్యాణ గడియలు వచ్చాయని భావిస్తున్న క్రమంలో ఆ వరుడికి అరదండాలు వేయించాయ్. అందుకు కారణం అధిక కట్నం. అంతేకాదు మోసం.... Read more

 • Hajipur serial rape murders trial in case will end soon says police

  హాజీపూర్ శ్రీనివాస్ రెడ్డికి త్వరలోనే శిక్ష ఖరారు..!

  Dec 07 | దిశ హత్యాచార ఘటనలో నిందితులను ఎన్ కౌంటర్ చేసి హతమార్చిన క్రమంలో.. ముక్కుపచ్చలారని పదకొండేళ్ల చిన్నారితో పాటు ముగ్గురు మైనర్ బాలికలపై అత్యాచారం చేసి అత్యంత దారుణంగా హతమార్చి.. తన భావిలోనే పూడ్చిపెట్టిన కరుడగట్టిన... Read more

 • Justice loses character if it becomes revenge cji sa bobde

  ప్రతీకార న్యాయంతో న్యాయవ్యవస్థకే ప్రమాదం: సీజేఐ

  Dec 07 | దిశ హత్యాచార ఘటనలో నిందితులను ఎన్ కౌంటర్ చేసి హతమార్చిన క్రమంలో.. ఉన్నావ్‌ అత్యాచార బాధితురాలికి కూడా అలాంటి న్యాయాన్నే అందించాలని ఉత్తర్ ప్రదేశ్ లోని ప్రజాసంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఇదిలావుండగా తమ బిడ్డలను..... Read more

 • Want to see accused shot dead or hanged unnao victim s father

  ‘‘వాళ్లలాగే వీళ్లను కాల్చేయండీ’’: ఉన్నావ్ మృతురాలి తండ్రి

  Dec 07 | ఉన్నావ్‌ అత్యాచార బాధితురాలి మరణం పట్ల ఉత్తరప్రదేశ్‌ వ్యాప్తంగా తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి. కేసును నమోదు చేయడంతో పాటు బాధితురాలికి రక్షణ కల్పించడంలోనూ పోలీసులు, ప్రభుత్వం పూర్తిగా విఫలమయ్యారని స్థానికులు, ప్రజాసంఘాలు ఆగ్రహాన్ని వ్యక్తం... Read more

Today on Telugu Wishesh