YSRLP Meeting at Tadepalli CM Camp Office తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో భేటీ

Ysrlp meeting at tadepalli cm camp office

YSRLP,Tadepalli,Jagan,Cabinet,YSR Congress Party,YS Jagan Press Meet

YSRLP Meeting at Tadepalli CM Camp Office

తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో భేటీ

Posted: 06/07/2019 12:51 PM IST
Ysrlp meeting at tadepalli cm camp office

ఆంధ్రప్రదేశ్‌ నూతన మంత్రివర్గం రేపు కొలువుదీరనుంది. ముందుగా మహానేత వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి వైఎస్‌ జగన్‌ నివాళులు అర్పించారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో జరుగుతున్న ఈ భేటీలో 151 మంది వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు, ఏడుగురు ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పార్టీ ఎమ్మెల్యేలకు జగన్‌ ఈ సమావేశంలో దిశానిర్దేశం చేయనున్నారు.  అయితే, జగన్‌ కేబినెట్‌లో ఐదుగురు డిప్యూటీ  సీఎంలు ఉంటారని తెలుస్తోంది. ఉప ముఖ్యమంత్రులుగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, కాపు, మైనార్టీ వర్గాలకు అవకాశం లభించనున్నట్లు తెలుస్తోంది.  25 మందితో పూర్తి స్థాయి మంత్రివర్గాన్ని నియమించనున్న జగన్‌. ఈ నెల 8వ తేదీన 25 మంది మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయిస్తారని తెలుస్తోంది. మరో వైపు మంత్రివర్గంలో ఎవరికి స్థానం దక్కుతుందోనని ఎమ్మెల్యేలు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.

 

 

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Cabinet  Jagan  YSRCP  

Other Articles