ys jagan, third youngest politician to become AP CM సీఎం కానున్న మూడవ అతిపిన్న వయస్కుడు వైఎస్ జగన్

Ys jagan the third youngest politician to become andhra cm

YS Jagan Mohan Reddy, YS Jagan, YSRCP, Third Youngest CM, Telugu Desam Party, N. Chandrababu Naidu, Andhra Pradesh, Telugu people, Chief Minister, KCR, Telangana CM, Andhra Pradesh, Politics

YSRCP President YS Jagan Mohan Reddy is the Third youngest leader to become Andhra Pradesh Chief Minister. YS Jagan to take oath on 30th May.

సీఎం కానున్న మూడవ అతిపిన్న వయస్కుడు వైఎస్ జగన్

Posted: 05/24/2019 12:58 PM IST
Ys jagan the third youngest politician to become andhra cm

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ ప్రమాణ స్వీకారం చేయనున్న విషయం తెలిసిందే. శారదా పీఠాధిపతి స్వరూపానంద స్వామి నిర్ధేశించిన ముహూర్తం ప్రకారం ఈ నెల 30వ తేదీన వైఎస్ జగన్, విజయవాడలో ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ క్రమంలో అధికారులు అన్ని ఏర్పాటు పూర్తి చేస్తున్నారు. ప్రజలు పెద్దసంఖ్యలో వస్తారని, ఈ నేపథ్యంలో ఎవరికీ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని ఇప్పటికే పార్టీ వర్గాలు పోలీసులను కోరాయని సమాచారం.

ఈ కార్యక్రమానికి పోరుగురాష్ట్రాల ముఖ్యమంత్రులు, విపక్ష నేతలు కూడా హాజరయ్యే అవకాశముందని సమాచారం. దీంతో వీవీఐపీల కారు పార్కింగ్ లకు, ట్రాఫిక్ జామ్ కలగకుండా చర్యలు తీసుకుంటున్నారు. వైఎస్ జగన్ ప్రమాణస్వీకారానికి తెలంగాణ సీఎం కేసీఆర్ హాజరుకానున్నారని విశ్వసనీయ సమాచారం. విజయవాడలో జరిగే ప్రమాణ స్వీకారానికి హాజరు కావాలని ఇప్పటికే జగన్ నుంచి కేసీఆర్ కు ఆహ్వానం అందినట్టు సమాచారం. దీనికి కేసీఆర్ సైతం సానుకూలంగా స్పందిస్తూ, తాను తప్పకుండా వస్తానని చెప్పినట్టు టీఆర్ఎస్ వర్గాలు వెల్లడించాయి. ఇందుకు కావాల్సిన ఏర్పాట్లు చేయాలని సీఎం కార్యాలయం అధికారులను కేసీఆర్ ఆదేశించినట్టు తెలుస్తోంది.

మూడవ అతిపిన్న వయస్సు ముఖ్యమంత్రి

కాగా, అతిపిన్న వయసులో రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేయనున్న మూడో వ్యక్తిగా రికార్డుల్లోకి ఎక్కనున్నారు. ప్రస్తుతం జగన్ వయసు 46 సంవత్సరాల 6 నెలలు కాగా, ఆంధ్రప్రదేశ్‌ విడిపోకముందు 38 సంవత్సరాల 11 నెలల వయసులో దామోదరం సంజీవయ్య సీఎంగా పనిచేశారు. ఆ తరువాత 45 సంవత్సరాలా 5 నెలల వయసులో చంద్రబాబునాయుడు సీఎం అయ్యారు. వీరిద్దరి తరువాత తక్కువ వయసులో సీఎం కానున్నది జగనే. ఇక దేశవ్యాప్తంగా పరిశీలిస్తే, అసోంకు 1985లో సీఎంగా ప్రమాణ స్వీకారం చేసే నాటికి ప్రఫుల్ల కుమార్‌ మహంత వయసు 33 ఏళ్లు మాత్రమే. ఆ తరువాత 2012లో ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే నాటికి అఖిలేష్ యాదవ్ వయసు 39 సంవత్సరాలే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : YS Jagan  YSRCP  Third Youngest CM  KCR  Telangana CM  Chandrababu  Andhra Pradesh  Politics  

Other Articles