Andhra CM dubs Pragya's comment as 'depressing' and 'disgusting' ‘‘ఇదేనా గుజరాత్ మోడల్ మార్కు రాజకీయం.?’’ చంద్రబాబు ఆగ్రహం..

Andhra cm dubs sadhvi pragya s comment on godse as depressing and disgusting

Telugu Desam Party, Pragya Singh Thakur, N. Chandrababu Naidu, Andhra Pradesh, Telugu people, Naidu, Government of India, spokesperson, Kamal Haasan, Chief Minister, actor-turned-politician, Prime Minister, Bhopal, Sri Hemant Karkare, Mumbai, Chandrababu, Andhra Pradesh, Politics

Andhra Pradesh Chief Minister N Chandrababu Naidu condemned BJP's Bhopal Lok Sabha candidate Pragya Singh Thakur comments glorifying Mahatma Gandhi's assassin as "depressing" and "disgusting".

‘‘ఇదేనా గుజరాత్ మోడల్ మార్కు రాజకీయం.?’’ చంద్రబాబు ఆగ్రహం..

Posted: 05/17/2019 11:16 AM IST
Andhra cm dubs sadhvi pragya s comment on godse as depressing and disgusting

హిందూ ఉగ్రవాదిగా అభియోగాలను ఎదుర్కోంటూ జైలు శిక్షను అనుభవిస్తూ.. అనారోగ్యం కారణంగా బెయిల్ పోంది సార్వత్రిక ఎన్నికలలో పోటీ చేస్తున్న వివాదాస్పద బీజేపీ నేత సాధ్వీ ప్రజ్ఞా సింగ్ వచ్చి రాగానే తనపై అభియోగాలు చేసిన హేమంత్ ఖర్కారే పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆ తరువాత సరిగ్గా అమె పోటీ చేస్తున్న భోపాల్ నియోజకవర్గంలో ఎన్నికలు జరిగే ముందు ప్రచారం ప్రజల సానుభూతిని కూడగట్టకునేందుకు అమె తనను జైల్లో అధికారులు ఎలాంటి చిత్రహింసలకు గురిచేశారో కూడా ప్రస్తావించారు. ఇక ఎన్నికలు ముగియగానే ఏకంగా గాఢ్సే ఎప్పటికీ అరాధ్యుడేనంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

అమె చేసిన వ్యాఖ్యలను దేశవ్యాప్తంగా అన్ని రాజకీయ పార్టీలు విమర్శించాయి. బీజేపి కూడా అమె వ్యాఖ్యల నుంచి ఎన్నికల వేళ ఎందుకీ తంటా అనుకుందో ఏమో కానీ మొత్తానికి దూరం జరిగింది. అది సాధ్వీ వ్యక్తిగత అభిప్రాయమని చెప్పింది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించారు. జాతిపిత మహాత్మ గాంధీని పొట్టనబెట్టుకున్న గాడ్సేను గొప్ప దేశభక్తుడు అంటూ సాధ్వీ ప్రజ్ఞా ఆకాశానికెత్తడంపై ఆయన ట్వీట్ చేశారు. "మొదట మహారాష్ట్ర పోలీసు అధికారి హేమంత్ కర్కరేను దూషించారు. ఆయన ఇప్పుడు లేరు కూడా. ఇప్పుడు జాతిపిత మహాత్ముడిపై పడ్డారు.

అహింసాదూత, ప్రపంచానికి స్ఫూర్తి ప్రదాత అయిన మహాత్మా గాంధీపైనే విమర్శలు చేస్తున్నారు. ఇదేనా మీరు చెబుతున్న గుజరాత్ మోడల్? ఈ సందేశాన్నే భారతదేశమంతా వ్యాప్తి చేయాలనుకుంటున్నారా?" అంటూ ప్రశ్నించారు. జాతిపితను చంపినవారిని గొప్ప దేశభక్తులుగా బీజేపీ నాయకులు కీర్తించడం చూస్తుంటే ఎంతో బాధ కలుగుతోందని పేర్కొన్నారు. బీజేపీకి చెందిన నేతలే కాదు, ప్రధాని నరేంద్ర మోదీ సైతం ఇలాంటి వారికి మద్దతుగా నిలవడం చూస్తుంటే వారి దేశభక్తి ఏంటో అర్థమవుతోందని వ్యాఖ్యానించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Pragya Singh Thakur  Hemant Karkare  Nathuram Godse  Patriot  Chandrababu  Andhra Pradesh  Politics  

Other Articles