Karnataka BJP leader says Rajiv Gandhi was not corrupt రాజీవ్ పై మోదీ వ్యాఖ్యలను ఖండించిన బీజేపి నేత..

Karnataka bjp leader disagrees with pm says rajiv gandhi was not corrupt

Srinivasa Prasad, Indira Gandhi,2019 Lok Sabha Polls,Narendra Modi,2019 Lok Sabha Elections,Rajiv Gandhi,Prime Minister of India,Chamarajanagar,PM Modi,bofors scandal, Srinivasa Prasad, Rajiv Gandhi, PM Modi, Corrupt, narendra modi remarks, karnataka, politics

BJP candidate from the Chamarajanagar constituency in Karnataka V Srinivasa Prasad has taken exception to Prime Minister Narendra Modi’s remarks on the late Congress leader Rajiv Gandhi, saying they were "not relevant or warranted."

రాజీవ్ గాంధీపై మోదీ వ్యాఖ్యలను ఖండించిన బీజేపి నేత..

Posted: 05/09/2019 07:24 PM IST
Karnataka bjp leader disagrees with pm says rajiv gandhi was not corrupt

మాజీ ప్రధాని రాజీవ్‌ గాంధీ అవినీతిలో నెంబర్ వన్ అంటూ ప్రధానమంత్రి నరేంద్రమోదీ చేసిన వ్యాఖ్యలపై ఆయన కాంగ్రెస్‌ సహా అన్ని రాజకీయ పక్షాల నుంచి విమర్శలను ఎదుర్కోంటున్నారు. తమ నిజాయితీ నిరూపించుకోలేని దివంగత నేతలపై కావాలనే ప్రధాని అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని పలువురు నేతలు తీవ్రంగా మండిపడుతున్నారు. ఢిల్లీ యూనివర్సిటీకి చెందిన ఉపాధ్యాయులు ఈ విషయంలో ఇప్పటికే రెండు బృందాలుగా విడిపోయి చెరో ప్రకటన విడుదల చేశారు.

అయితే రాజీవ్ గాంధీని సమర్థించిన ఓ గ్రూపులో మొత్తం 207 మంది ఉపాధ్యాయులు రాజీవ్ తీసుకువచ్చని గణనీయమార్పులను వారు ఊటంకిస్తూ.. చివరకు కార్గిల్ యుద్దం ముగిసిన తరుణంలో దేశసైన్యం రాజీవ్ గాంధీ అమర్ రహే అంటూ నినాదాలు చేశారని, అందుకు కారణం రాజీవ్ గాంధీ హాయంలో తీసుకువచ్చిన బోఫోర్స్ తుపాకులేనని, వాటితోనే యుద్దం చేశారని వారు గుర్తు చేశారు. ఇక వ్యతిరేకించిన గ్రూపులోని 125 మంది మాత్రమే ప్రధాని నరేంద్రమోడీ చేసిన వ్యాఖ్యలను సమర్థించారు.

ఇదిలావుంటూ రాజీవ్ గాంధీ అవినీతిపరుడన్న వ్యాఖ్యలను తాజాగా సొంత పార్టీ నేత కూడా ఖండిస్తున్నారు. రాజీవ్‌గాంధీ గురించి మోదీ మాట్లాడటం అనవసరమని కర్ణాటక బీజేపి నేత, కేంద్ర మాజీ మంత్రి శ్రీనివాస ప్రసాద్‌ అభిప్రాయం వ్యక్తం చేశారు. ‘మాజీ ప్రధాని రాజీవ్‌ గాంధీని ఎల్టీటీఈ ఉగ్రవాదులు కుట్ర పన్ని హత్య చేశారు. అవినీతి ఆరోపణలతో ఆయన చనిపోలేదు. అలా చనిపోయారంటే తానే కాదు ఎవరూ నమ్మరు. ప్రధాని మోదీ అంటే నాకు చాలా గౌరవం. కానీ రాజీవ్ గాంధీకి వ్యతిరేకంగా అలాంటి వ్యాఖ్యలు చేయడం అనవసరమని అన్నారు.

రాజీవ్‌గాంధీ చిన్న వయసులోనే ప్రధానిగా పెద్ద బాధ్యతలు చేపట్టారని ఆయన అన్నారు. అటల్‌ బిహారీ వాజ్‌పేయీ లాంటి పెద్ద పెద్ద నాయకులు కూడా ఆయన గురించి గొప్పగా మాట్లాడారు’ అని శ్రీనివాస ప్రసాద్‌ అన్నారు. అయితే అలాంటి మాజీ ప్రధానిపై.. ప్రధాని నరేంద్రమోడీ వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు సముచితమని ప్రశ్నించిన ఆయన అసలు రాజీవ్ గాంధీపై ఇలాంటి వ్యాఖ్యలు చేయాల్సిన అవసరమేంటని ప్రశ్నించారు. సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా ఉత్తరప్రదేశ్‌ ఎన్నికల ప్రచారసభలో మోదీ.. మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీని ఉద్దేశిస్తూ అనుచిత వ్యాఖ్యలు చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Srinivasa Prasad  Rajiv Gandhi  PM Modi  Corrupt  narendra modi remarks  karnataka  politics  

Other Articles