Row after 'cops' seen wearing saffron scarves మఫ్టీ పోలీసుల మెడలో కాషాయ కండువాలు

Digvijaya roadshow row after cops seen wearing saffron scarves

Digvijaya Singh, Congress Bhopal candidate, Congress roadshow, Computer Baba, Police, saffron scarves, Pragya Thakur, Bhopal, Madhya Pradesh

Police personnel in civil uniform seen wearing saffron scarves at the roadshow of Computer Baba and Digvijay Singh, a policewoman says "we've been made to wear this". Bhopal DIG, however, later said that No cop wore scarf of any colour

రాజకీయ దుమారం: దిగ్విజయ్ సభలో కాషాయ కండువాలతో పోలీసులు..

Posted: 05/08/2019 05:30 PM IST
Digvijaya roadshow row after cops seen wearing saffron scarves

కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఏఐసిసి ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్ మధ్యప్రదేశ్ లోని భోపాల్ లోక్ సభ నియోజకవర్గం నుంచి ఈ సారి ఎన్నికల బరిలో నిలిచిన విషయం తెలిసిందే. అయితే ఈ మధ్యకాలంలో ఆయన చేస్తున్న ప్రచార కార్యక్రమాలన్ని మంచి పాపులారిటీ సాధిస్తున్నాయి. ఇటీవల ఆయన నిర్వహించిన ఓ సభలో మోడీ హయంలో దేశంలోని ఏ ఒక్కరికైనా రూ.15 లక్షలు బ్యాంకులోకి వచ్చాయా.? అని ప్రశ్నించినందుకు ఓ యువకుడు వచ్చి.. ప్రధాని మోడీ గురించి కాంగ్రెస్ సభలో గోప్పలు చెప్పబోయాడు.

ఇక ఆయన ప్రత్యర్థిగా బీజేపి పార్టీ అభ్యర్థి ప్రజ్ఞా ఠాకూర్ కూడా బరిలో నిలిచారు. అమె తాజాగా యజ్ఞం చేయడంతో దిగ్విజయ్ కూడా అదే బాట పట్టాడు. ఆయన కూడా తాజాగా కంప్యూటర్ బాబాగా గుర్తింపు పోందిన బాబా నామ్ దేవ్ దాస్ త్యాగితో ఒక యజ్ఞం నిర్వహించారు. ఆనంతరం నిర్వహించిన రోడ్ షోలో ఆయన దిగ్విజయ్ సింగ్ కు మద్దతు పలుకుతున్నట్లు ఆయననే ఈ సారి ఎన్నికలలో గెలిపించాలని కూడా ఓటర్లకు పిలుపునిచ్చారు. ఇంతవరకు బాగానే వున్నా ఈ ర్యాలీలో పోలీసులు వ్యవహరించిన తీరు వివాదాస్పదమైంది.

రోడ్ షో సందర్భంగా మఫ్టీలో విధులకు వచ్చిన పోలీసులు కాషాయ కండువాలు ధరించారు. ఈ రోడ్ షోకు ప్రముఖ హిందూ సాధువు కంప్యూటర్ బాబా హాజరయ్యారు. దిగ్విజయ్ ను గెలిపించాలని ఆయన పిలుపునిచ్చారు. రోడ్ షో సందర్భంగా భారత్ మాతాకీ జై అంటూ దిగ్విజయ్ నినాదాలు చేశారు. ఈ రోడ్ షో బందోబస్తుకు వచ్చిన పోలీసులు కాషాయం కండువాలు ధరించడం చర్చనీయాంశంగా మారింది. ఈ సందర్భంగా మహిళా పోలీసులు మాట్లాడుతూ, 'కంప్యూటర్ బాబా నిర్వహించిన ఈ కార్యక్రమం బందోబస్తుకు మేము వచ్చాం. కాషాయం కండువాలు ధరించాలని నిర్వాహకులు కోరడంతో, వాటిని వేసుకున్నాం' అని చెప్పారు. అయితే,  దీనిపై భోపాల్ డీఐజీ మాట్లాడుతూ, పోలీసులెవరూ కాషాయం కండువాలు ధరించలేదని చెప్పడం కొసమెరుపు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Congress roadshow  Digvijaya Singh  Computer Baba  Police  saffron scarves  Bhopal  Madhya Pradesh  

Other Articles