Unknown assailants ransacked Rs 70 lakh in Vanasthalipuram సినీఫక్కీలో లూటీ.. వనస్థలిపురంలో రూ.70లక్షల చోరీ

Unknown assailants ransacked rs 70 lakh in vanasthalipuram

Bank Robbery, Investigation, Vanasthalipuram, Hyderabad, bank robbery in hyderabad, bank robbery in Vanasthalipuram news,Vanasthalipuram bank robbey news, CCTV footage, Axis Bank ATM, vansthalipuram robbery, vansthalipuram theft, panama cross, vansthalipuram, Hyderabad, Telangana, crime

Unknown assailants ransacked Rs 70 lakh under Vanasthalipuram police station limits, divertingd the attention of the staff who are indulged in placing cash in the Axis Bank ATM from the van and stolen the cash and absconded from the spot.

సినీఫక్కీలో లూటీ.. వనస్థలిపురంలో రూ.70లక్షల చోరీ

Posted: 05/07/2019 03:36 PM IST
Unknown assailants ransacked rs 70 lakh in vanasthalipuram

వనస్థలిపురం పనామా కూడలి వద్ద భారీ చోరీ జరిగింది. ఏటీయంలలో డబ్బు నింపే వాహానాల సిబ్బంది, సెక్యూరిటీ దృష్టి మరల్చిన గుర్తు తెలియని దుండగులు రూ.70 లక్షలు ఎత్తుకెళ్లారు. ఈ ఘటన వార్త వెలుగులోకి రావడంతో తీవ్ర కలకలం రేగింది. అచ్చంగా సినీపక్కీలో జరిగిన ఈ చోరికి సంబంధించి అగంతకులు ముందుగా రెక్కీ నిర్వహించారని కూడా సమాచారం. సంచలనంగా మారిన ఈ చోరీ వివరాలు ఇలా వున్నాయి..

మంగళవారం మధ్యాహ్నం యాక్సిస్‌ బ్యాంకు ఏటీఎంలో డబ్బులు పెట్టేందుకు సిబ్బంది నగదు పెట్టెలు తీసుకొచ్చారు. ఆ సమయంలో అక్కడే ఉన్న దుండగులు డబ్బులు కింద పడ్డాయని చెప్పి సెక్యురిటీ గార్డు దృష్టి మరల్చి నగదు పెట్టెను మాయం చేశారు. బ్యాంకు సిబ్బంది ఫిర్యాదు మేరకు పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. సమీపంలోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. నిత్యం రద్దీగా ఉండే పనామా కూడలిలో పట్టపగలే భారీ చోరీ జరగడం కలకలం రేపుతోంది.

దుండగులు అక్కడి నుంచి ఆటోలో వెళ్లిన దృష్యాలు కూడా సిసిటీవీ ఫూటేజీలో నిక్షిప్తమయ్యాయి. భారీ చోరికి పాల్పడిన దొంగలు అటోలో తాపీగా వెళ్లడంతో వీరు రాటుతేలిన దొంగలనే పోలీసులు అనుమానిస్తున్నారు. దీంతో నిందితుల ఆచూకీ కోసం పోలీసులు రెండు బృందాలుగా విడిపోయి గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు. ఈ చోరీకి పాల్పడింది అంతర్‌ రాష్ట్ర దొంగల ముఠాగా పోలీసులు భావిస్తున్నారు. మొత్తం ఐదుగురు వ్యక్తులు ఇందులో భాగస్వామ్యమైనట్టు పోలీసులు అనుమానిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles