Answer sheets can’t be obtained through RTI act ఆర్టీఐ కింద జవాబుపత్రాలు ఇవ్వలేం: తెలంగాణ ఇంటర్ బోర్డు..

Can t give answersheets under rti act says telangana interboard

Intermiediate students suicide, inter students parents agitation, intermiediate board officials RTI ACT, Ashok on Inter marks goof -up, ashok on Intermiediate answer sheets, Globarina, interboard failure, Intermiediate students, students suicides, CM KCR, Inter marks goof -up, Intermiediate results, ashok kumar, inter board secretary, RTI Act, social media, answer sheets, Telangana Inter Board, Telangana, politics

The Telangana State Board of Intermediate Education has said it will not be possible for students and parents to get copies of answer sheets through an application under the Right To Information (RTI) Act.

ఆర్టీఐ కింద జవాబుపత్రాలు ఇవ్వలేం: తెలంగాణ ఇంటర్ బోర్డు..

Posted: 04/26/2019 11:19 AM IST
Can t give answersheets under rti act says telangana interboard

రైట్ టు ఇన్ఫార్మేషన్ యాక్ట్ పరిధిలోకి తెలంగాణ ఇంటర్‌ బోర్డు వచ్చిన్నా.. ఆ చట్టం కింద విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు జవాబు పత్రాలకు ఇవ్వడం కుదరదని తాజాగా ఇంటర్ బోర్డు అధికారులు తెలిపారు. అయితే ఇంటర్మీడియట్ బోర్డుకు నిర్దేశిత ఫీజు చెల్లించి మాత్రమే సదరు విద్యార్థులు వారి అన్సర్ షీట్ తీసుకునే అవకాశం ఉందని తెలంగాణ ఇంటర్‌ బోర్డు కార్యదర్శి అశోక్‌ స్పష్టం చేశారు. కాగా, తెలంగాణ ఇంటర్ బోర్డు విడుదల చేసిన మార్కుల జాబితాలో అవకతవకలు ఏర్పడి ఇప్పటికే 19 మంది విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడిన నేపథ్యంలో సామాజిక మాధ్యమంలో స్పందించిన పలువురు సమాచార హక్కు చట్టం కింద ఈ పత్రాలను తీసుకోవాలని పోస్టును పెట్టింది.

విద్యార్థులు అందోళన చెందాల్సిన అవసరం లేదని, ఇక రీ వెరిఫికేషన్, రీ వాల్యూయేషన్ కోసం విద్యార్థులు అనవసరంగా డబ్బులు వెచ్చిండం కన్నా.. సమాచార హక్కు చట్టం కింది వారి జవాబు పత్రాలను పొందవచ్చని దీనికి కేవలం అత్యల్ప రుసుము మాత్రమే ఖర్చు అవుతుందని,, వాటిని సరిచూసుకున్న తరువాత అప్పుడు రీ వాల్యుయేషన్ కు వెళ్లవచ్చిని ఫోస్టులు విపరీతంగా వైరల్ అయ్యారు. సామాజిక మాధ్యమాలు, కొన్ని పత్రికల్లో వార్తలు రావడంపై ఇంటర్ బోర్డు కార్యదర్శి అశోక్ దించారు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 2005 అక్టోబరు 13న జారీ చేసిన 454 జీవో ప్రకారం మూల్యాంకనం చేసిన ఇంటర్‌ జవాబు పత్రాలు ఫీజు చెల్లించి తీసుకునే సామగ్రి కిందకు వస్తాయని తెలిపారు. అందువల్ల సంబంధిత విద్యార్థులు మాత్రమే బోర్డు నిర్దేశించిన ఫీజు చెల్లించి జవాబు పత్రాలు పొందే అవకాశం ఉందని, ఇతరులకు లేదన్నారు. అలాగే ఇంటర్‌లో తప్పిన విద్యార్థుల జవాబు పత్రాలను ఉచితంగా రీవాల్యుయేషన్‌ చేస్తామని, అందుకోసం ప్రత్యేకంగా దరఖాస్తు చేసుకోనవసరం లేదని ఇంటర్‌ బోర్డు తెలిపింది. ఇప్పటికే ఫీజు చెల్లించి దరఖాస్తు చేస్తే ఆ ఫీజు వాపసు చేస్తామన్నారు. సప్లిమెంటరీ పరీక్ష ఫీజు మాత్రం ఆయా కళాశాలల్లో చెల్లించాలని స్పష్టం చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ashok kumar  inter board secretary  RTI Act  social media  answer sheets  Telangana Inter Board  

Other Articles