Pawan Kalyan Visits Venkateswara Swamy Temple శ్రీవారికి పట్టు వస్త్రాలను సమర్పించిన పవన్ కల్యాణ్

Pawan kalyan offers pattu vastras to lord venkateswara

pawan kalyan, janasena, Pawan Kalyan Raintree, Pawan Kalyan Lord Venkateswara swamy, pawan kalyan dasavatara temple, pawan kalyan guntur district, pawan kalyan pattu vastralu, pawan kalyan janasena, andhra pradesh, politics

Jana Sena Party (JSP) President Pawan Kalyan has visited Sri Dasavatara Venkateswara Swamy Temple at Raintree Park near ANU in Guntur district. The actor turned politician has performed special pujas to presiding deity in the temple.

ITEMVIDEOS: శ్రీవారికి పట్టు వస్త్రాలను సమర్పించిన జనసేనాని పవన్ కల్యాణ్

Posted: 04/12/2019 05:18 PM IST
Pawan kalyan offers pattu vastras to lord venkateswara

ఎన్నికల హడావిడి ముగిసీ ముగియగానే అటు అధికారపక్షం, ఇటు విపక్షానికి చెందిన వారు ఓ వైపు గెలుపు ధీమాను వ్యక్తం చేస్తూనే మరోవైపు కార్యకర్తలపై దాడులు, ప్రతిదాడులు, ఈసీ నిర్లక్ష్య వైఖరి, పోలీసులు లేని ఎన్నికల నిర్వహణ, ప్రజాస్వామ్యం అపహాస్యం అంటూ ఎశరికి తొచిన విధంగా వారు తమ తమ వ్యవహారాలలో నిమగ్నమై వుండగా, తృతీయ ప్రత్యామ్నాయంగా వచ్చిన జనసేన మాత్రం వీటికి దూరంగా.. ఫలితాలు వెలువడే వరకు ఓపిగ్గా వుందమన్న నిర్ణయానికి వచ్చినట్లుంది.

గత ఏడాదిన్నర కాలంగా రాష్ట్ర పర్యటనలు, ఆ వెంటనే ఎన్నికల ప్రచారంతో అహర్నిశలు పార్టీ బలోపేతం, అభ్యర్థుల గెలుపు కోసం పర్యటించిన జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఎన్నికలు ముగియగానే కాసింత విశ్రాంతి తీసుకుంటున్నారని భావిస్తే అది పోరబాటే. ఆయన ఇవాళ రాజకీయాలకు దూరంగా, అధ్యాత్మికతకు దగ్గరగా వున్నారు. గుంటూరు జిల్లా కాకానిలో పర్యటించారు. రెయిన్ ట్రీ సమీపంలోని శ్రీవెంకటేశ్వర దశావతార ఆలయాన్ని సందర్శించారు.

ఈ సందర్భంగా ఆయన స్వామివారికి పట్టువస్త్రాలను సమర్పించారు. అనంతరం ఆయన స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం నిత్యాన్నదాన సత్రంలో భక్తులకు ప్రసాదం వడ్డించారు. ఒకరోజు అన్నదానానికి అయ్యే ఖర్చును ఆలయ సిబ్బందికి పవన్ కల్యాణ్ చెల్లించారు. ఈ సందర్భంగా పవన్ తో ఫొటోలు దిగేందుకు, ఆయనతో కరాచలనం చేసేందుకు భక్తులు పోటీపడ్డారు. ఈ కార్యక్రమంలో పవన్ వెంట నాదెండ్ల మనోహర్ కూడా ఉన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles