Police Raids on CM Ramesh సీఎం రమేష్, అనుచరుల ఇళ్లలో పోలీసుల పోదాలు..

Police raids on tdp mp cm ramesh s residence in kadapa

police raids on cm ramesh house, cm ramesh on police raids, police raida at cm ramesh followers house, kadapa TDP leader house raided, cm ramesh, rajya sabha member, TDP MP, Police Raids, kadapa, andhra pradesh, politics

The Andhra Pradesh Police conducted raids at Telugu Desam Party lawmaker CM Ramesh's residence at Potladutti in Kadapa district. According to reports, the police also conducted raids at houses of followers of the Rajya Sabha MP Ramesh.

టీడీపీ ఎంపీ సీఎం రమేష్ ఇంట్లో పోలీసుల తనిఖీలు.. ఉద్రిక్తత

Posted: 04/05/2019 01:47 PM IST
Police raids on tdp mp cm ramesh s residence in kadapa

కడప జిల్లా ఎర్రగుంట్ల మండలం పోట్లదుర్తిలో పోలీసులకు టీడీపీ కార్యకర్తలకు మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. టీడీపీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ ఇంట్లో సోదాలు నిర్వహించేందుకు ఇవాళ ఉదయం 6 గంటలకు దాదాపు 30 మంది పోలీసులతో కూడిన బృందం రావడమే ఈ ఉద్రిక్తతలకు కారణమైంది. టీడీపీ నేతలే టార్గెట్ గా చేసుకుని దాడులు నిర్వహిస్తున్నారని టీడీపీ కార్యకర్తలు అరోపిస్తున్నారు.

కర్నూలులో వైసీపీ ఎంపీ నోట్లను ప్రజలపైకి వెదజల్లినా.. ఎన్నికల సంఘం అధికారులు కానీ, ఆదాయపన్ను శాఖ అధికారులు కానీ వాటిపై స్పందించడం లేదని విమర్శించారు. ఇక బ్యాంకులకు వందల కోట్ల రూపాయలను ముంచిన ఘనులు వైసీపీలో వున్నా.. ప్రస్తుత ఎన్నికలలో అభ్యర్థులుగా వారు బరిలో వున్నావారిని కనీసం టచ్ చేసే దమ్ముధైర్యం ఐటీ అదికారులు, ఈసీ అధికారులు వుందా అని వారు నిలదీస్తున్నారు. ప్రజల దృష్టి మళ్లించేందుకు టీడీపీ నేతల ఇళ్లను టార్గెట్ చేశారని టీడీపీ నేతలు అరోపిస్తున్నారు.

అసలు ఏం జరిగిందంటే..

ఇవాళ ఉదయం సీఎం రమేష్ ఇంటికి పోలీసుల బృందం తనిఖీలు చేయాడానికి వచ్చింది. పోలీసులు నేరుగా సీఎం రమేష్ ఇంట్లోకి వస్తుండటాన్ని గమనించి.. ఆయనకు సమాచారం ఇచ్చారు పలువురు కార్యకర్తలు. ఆ సమయంలో సీఎం రమేష్‌తో పాటు ఆయన సోదరుడు సీఎం సురేష్ నాయుడు కూడా ఇంట్లోనే ఉన్నట్టు సమాచారం. దీంతో పోలీసులను అడ్డుకున్న సీఎం రమేష్.. తన ఇంట్లో తనిఖీలు చేయడం ఏంటని ప్రశ్నించారు. తనిఖీలు చేయడానికి సెర్చ్ వారెంట్ ఉందా..? అని వారిని నిలదీశారు.

దీంతో పోలీసులకు, ఆయనకు మధ్య కాసేపు వాగ్వాదం జరిగింది.  అయితే ఉన్నతాధికారుల నుంచి వచ్చిన సమాచారం, ఆదేశాల మేరకే తాము తనిఖీలకు వచ్చామని చెప్పడంతో సీఎం రమేష్ తనిఖీలకు సహకరించినట్టు తెలుస్తోంది. అయితే పోలీసుల తనిఖీల్లో సీఎం రమేష్ ఇంట్లో ఎలాంటి వస్తువులు గానీ, నగదు గానీ లభించలేదని సమాచారం. ప్రస్తుతం పోట్లదుర్తిలోని సీఎం రమేష్ అనుచరుల ఇళ్లల్లో మాత్రం సోదాలు కొనసాగుతున్నట్టు సమాచారం.

పోలీసుల సోదాలపై స్పందించిన సీఎం రమేష్.. ఇది తమను భయభ్రాంతులకు గురిచేసేందుకేనని ఆరోపించారు. కేంద్రం, వైఎస్ జగన్ కలిసి తమపై కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు. టీటీడీ ఛైర్మన్, మైదుకూరు టీడీపీ అభ్యర్థి పుట్టా సుధాకర్‌ యాదవ్‌ ఇంట్లో ఐటీ దాడులు జరిగిన మరుసటి రోజే సీఎం రమేష్ ఇంట్లో పోలీసులు సోదాలకు వెళ్లడం గమనార్హం. ఎన్నికల గడువు దగ్గరపడ్డ నేపథ్యంలో.. నగదు పంపిణీ కోసం భారీ ఎత్తున డబ్బు ఆయన ఇంటికి చేరిందన్న సమాచారంతో పోలీసులు సోదాలకు వెళ్లినట్టు చెబుతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : cm ramesh  suresh naidu  rajya sabha member  TDP MP  Police Raids  kadapa  andhra pradesh  politics  

Other Articles