nagababu unveils special video on Janasena హృదయాలను కదిలిస్తున్న నాగబాబు స్పెషల్ వీడియో..

Mega brother nagababu unveils special video on janasena 5th formation day

pawan kalyan, janasena, Pawan Kalyan Nagababu, janasena 5 years foundation, janasena special video, nagababu special video on janasena, janasena 5th foundation day, Pawan Kalyan Mega Brother Naga babu, andhra pradesh, politics

Mega brother Nagababu unveils special video in favour of his brother power star pawan kalyan's Janasena party. As the Janasena completes its 5th formation day

ITEMVIDEOS: హృదయాలను కదిలిస్తున్న నాగబాబు స్పెషల్ వీడియో..

Posted: 03/13/2019 03:48 PM IST
Mega brother nagababu unveils special video on janasena 5th formation day

జనసేన పార్టీ స్థాపించి ఐదేళ్లు పూర్తి కానున్న నేపథ్యంలో వచ్చిన ఎన్నికలకు తన సోదరుడు, సినీనటుడు, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ కు మెగా బ్రదర్ నాగబాబు కూడా మద్దతు ప్రకటించారు. ఇటీవలి కాలంలో తనదైన శైలిలో జనసేనపై వస్తున్న విమర్శలకు నా ఛానెల్ నా ఇష్టం ద్వారా సటైరికల్ స్కిట్ లు ప్రదర్శించిన ఆయన పార్టీ అవిర్భవించిన ఐదు వసంతాలను పురస్కరించుకున్న నేపథ్యంలో శతాఘ్ని ద్వారా మరో ప్రత్యేక వీడియోను రిలీజ్ చేశారు నాగబాబు.

మెగాబ్రదర్ నాగబాబు ఈ స్పెషల్ వీడియోను తన ఫేస్ బుక్ అకౌంట్ ద్వారా విడుదల చేశారు. ‘ఎవరో రావాలి.. ఏదో చేయాలి అన్నావ్ కదా.. ఒకడు వచ్చాడు’ సంపద, సౌఖ్యాలను వదిలేసి.. సామాన్యుడిగా.. తోటి సామాన్యుడి కోసం.. సమాజం మేలు కోసం.. ఒక్కడిగా మొదలెట్టని జనసేన ప్రయాణం.. ఒక శక్తిగా, తెలుగు రాష్ట్ర ప్రజలకు రక్షగా మారి నేటికి ఐదేళ్లైయ్యింది. అంటూ మాస్ బీట్ తో అదరగొట్టేస్తున్న వీడియోను ప్రస్తుతం నెట్టింట్లో సంచలనంగా మారింది.

నీ కోసం నిలబడటానికి నువ్వే అలోచిస్తుంటే.. అలాంటిది నీ కోసం ఆయన ప్రాణాలకు తెగించి.. శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు.. జనసేన పోరాటయాత్ర అంటూ.. అలుపులేకుండా.. ప్రభుత్వాలు, ప్రతిపక్షాలు పట్టించుకోని ఉద్దానం, ఇసుక మాఫియా.. వైద్యవిద్యార్థుల సమస్య, రైతుల ఇబ్బందులు.. ఒక్కడే.. ఒక్కడే బలంగా వెలుగెత్తి పరిష్కారానికి ఓ పెద్ద దిక్కుఅయ్యాడు. అంటూ ఇన్ స్పైర్ చేసే మేల్ వాయిస్ ఓవర్ వస్తుండగా, జనసేన పోరాటయాత్రలో భాగంగా అక్కడి ప్రజలు వ్యక్తపర్చిన భావాల క్లిప్పింగ్లను కట్ చేసి మద్యమధ్యలో ప్లే చేయడం హృదయాలను కదిలించింది.

ప్రజాస్వామ్యానికి తూట్లు పోడుస్తూ.. ప్రజల ఓట్లను తొలగిస్తూ.. నీచాతినీచమైన రాజకీయాలు చేస్తున్న తెలుగుదేశం, వైసీపీ పార్టీల అరాచకాన్ని తరమికొడదాం..  ఇంత నీచాన్ని, అరచకాన్ని ఎదుర్కోంటూ మనకోసం.. సముద్రమంత సంకల్పంతో నిలబడుతున్నాడు. ఒక నిశబ్ద విప్లవంలాగా, చాపకింద నీరులాగా, ఒక ఉద్యమంలాగా.. ఈ సైనికుడికి సైనికుల వలే.. యోధుడికి సైనికుల వలే అండగా నిలుద్దాం.. ఒక్కటే నినాదం.. మాకోద్దీ వెన్నుపోటు.. మాకోద్దీ బంధిపోటు.. జనసేనకే మన ఓటు.. గాజు గ్లాసు గుర్తుకే మన ఓటు అన్న బ్యాక్ ఎండ్ వాయిస్ లో  మీరూ చూసేయండి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : pawan kalyan  janasena  Nagababu  5th foundation day  special videoandhra pradesh  politics  

Other Articles