Indian fighter jets hit terror camps across LoC పాకిస్థాన్ పై మరో సర్జికల్ స్ట్రైక్.. 300 మంది ఉగ్రవాదుల హతం..

Surgical strikes 2 0 indian fighter jets hit terror camps across loc

pakistan, loc attack, india attacks pakistan, surgical strike, loc, india pakistan loc, india conducts surgical strike, indian air force attack on pakistan, india attack on pakistan, indian air force, mirage 2000 india air force, india pakistan news, indian air force news, india attack on pakistan today, india pakistan attack, indian air force aerial strike, latest news, india attack on pakistan today, india pakistan latest news, Politics

Indian Air Force Mirage fighter jets struck terrorist camps across the LoC and completely destroyed it at 0330 hours on February 26, new agency ANI reporters quoting IAF sources.

పాకిస్థాన్ పై మరో సర్జికల్ స్ట్రైక్.. 300 మంది ఉగ్రవాదుల హతం..

Posted: 02/26/2019 11:18 AM IST
Surgical strikes 2 0 indian fighter jets hit terror camps across loc

పుల్వామా ఉగ్రదాడికి భారత్ ప్రతీకారం తీర్చుకునే ప్రయత్నం చేసింది. పాక్ ఆక్రమిత కశ్మీర్ లోని జైషే మహమ్మద్ ఉగ్రవాద శిబిరాలపై భారత వాయుసేన దళాలు, యుద్ధ విమానాలతో దూసుకెళ్లి బాంబులేసి వచ్చాయి. సుమారు 1000 కిలోల బాంబులను ఈ విమానాలు జారవిడిచాయి. మంగళవారం అర్ధరాత్రి... సరిగ్గా 2.40 గంటల సమయం. అప్పటికే సిద్ధంగా ఉన్న భారత మిరేజ్ యుద్ధ విమానాల పైలట్లకు టేకాఫ్ తీసుకునేందుకు గ్రీన్ సిగ్నల్ అందింది. వెంటనే 12 విమానాలు పాక్ ఆక్రమిత కాశ్మీర్ వైపు దూసుకెళ్లాయి.

జైషే మహమ్మద్ ఉగ్రవాద స్థావరాలే లక్ష్యంగా వందల కిలోల బరువున్న బాంబులను జారవిడిచాయి. ఈ దాడిలో పీఓకేలో ఉన్న అతిపెద్ద ఉగ్రవాద శిబిరం పూర్తిగా ధ్వంసం అయినట్టు ప్రాధమిక వార్తలను బట్టి తెలుస్తోంది. పుల్వామా దాడికి ప్రతీకారంగా వాయుసేన ఆధ్వర్యంలో ఈ దాడులు జరుగగా, స్వయంగా ప్రధాని నరేంద్ర మోదీ దాడులకు ఆదేశాలు ఇవ్వగా, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ తో పాటు, నేవీ, ఆర్మీ తాజా దాడిని పర్యవేక్షించినట్టు తెలుస్తోంది.  

భారత వాయుసేన దాడులతో పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులపై కోలుకోలేని దెబ్బ పడింది. నిషీధి వేళ అంతా నిద్రిస్తున్న సమయంలో, చడీ చప్పుడు కాకుండా వెళ్లిన భారత యుద్ధ విమానాలు జరిపిన సర్జికల్ స్ట్రయిక్స్ లో సుమారు 300 మందికి పైగా ఉగ్రవాదులు మరణించినట్టు తెలుస్తోంది. పాక్ ఆక్రమిత కాశ్మీర్ లోని ప్రధాన పట్టణాలైన బాలాకోట్, ముజఫరాబాద్ శివార్లలో ఉన్న శిబిరాల్లోని 3 కంట్రోల్ యూనిట్లపై 200కు పైగా బాంబులను జారవిడిచిన వాయుసేన విమానాలు, ఆ ప్రాంతాన్ని తునాతునకలు చేసి వచ్చాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles