SP Balasubrahmanyam's mother passed away ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకు మాతృవియోగం

Sp balasubrahmanyam s mother passed away

Veteran singer SP Balasubrahmanyam, SP Balasubrahmanyam’s mother passed away, SPB's mother Sakunthalamma, SPB's mother Sakunthalamma passed away, nellore thipparaju vari veedhi, london, SPB's mother last rites

Veteran singer SP Balasubrahmanyam’s mother Sakunthalamma passed away during the early hours of today. She is 89-years-old and has been suffering with health related issues from some time.

ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకు మాతృవియోగం

Posted: 02/04/2019 11:21 AM IST
Sp balasubrahmanyam s mother passed away

భారతీయ సినీ ప్రేక్షకులను తన గానామృతంలో ఓలలాడించిన సుప్రసిద్ధ సినీ నేపథ్య గాయకుడు ఎస్‌.పి.బాలసుబ్రహ్మణ్యంకు మాతృవియోగం చెందారు. దీంతో ఆయన ఇంట విషాదం అలుముకుంది. ఆయన మాతృమూర్తి శకుంతలమ్మ ఇవాళ పరమపదించారు. నెల్లూరులోని తిప్పరాజువారి వీధిలో ఉన్న స్వగృహంలో ఆమె ఇవాళ తుదిశ్వాస విడిచారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె ఈరోజు ఉదయం 7 గంటల 10 నిమిషాలకు మరణించారు. ఆమె వయసు 89 సంవత్సరాలు.

బాలసుబ్రహ్మణ్యం మాతృవియోగం చెందిన విషయాన్ని కుటుంబ సభ్యులు తెలిపారు. ప్రస్తుతం బాలసుబ్రహ్మణ్యం లండన్ లో ఉన్నారు. కచేరీ కార్యక్రమాల నిమిత్తం లండన్ కు వెళ్లిన బాలు తల్లి మరణించిందన్న సమాచారం తెలియగానే హుటాహుటిన ఇండియాకు ప్రయాణమయ్యారు. ఈరోజు సాయంత్రం కల్లా ఆయన స్వస్థలానికి చేరుకుంటారని భావిస్తున్నారు. మంగళవారం నెల్లూరులో ఆమె అంత్యక్రియలను నిర్వహించనున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles