Govt wants to give relief for all class says FM అన్ని వర్గలకు లబ్ది చేకూర్చాలన్నదే లక్ష్యం: విత్తమంత్రి

Interim budget a trailer wait for new india after 2019 polls pm

budget 2019, budget 2019 date, budget, economic survey 2019, union budget 2019, piyush goyal, budget 2019 expectations, interim budget 2019, interim budget 2019 High lights, finance minister of india 2019, finance minister of india, budget 2019 time, interim meaning, vote on account, budget 2019 india, 2019 budget date, India budget 2019-20, when is budget 2019, interim budget meaning, union budget, what is interim budget, budget timing, budget news

Piyush Goyal announced that individual tax payers with annual income under Rs 5 lakh, interim finance minister Piyush Goyal said. He claimed that with the current provision for rebates and exemptions, people with salaries up to 6.2 lakhs will be effectively exempted from tax.

ఇది ట్రైయిలర్ మాత్రమే.. ఎన్నికల తరువాత మరిన్నీ పథకాలు

Posted: 02/01/2019 04:55 PM IST
Interim budget a trailer wait for new india after 2019 polls pm

కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్ పై ప్రధాని మోదీ ప్రశంసలు కురిపించారు. అభివృద్ధి పథంలో నడిపించే బడ్జెట్ ఇది అని, దేశాన్ని బలోపేతం చేసేందుకు ఈ బడ్జెట్ ముందడుగు అని అన్నారు. అన్ని వర్గాల్లో సంతృప్తినిచ్చిన, వ్యవసాయ రంగంతో పాటు రైతులను పరిపుష్టం చేసే బడ్జెట్ ఇది అని చెప్పారు. ఆదాయ పన్ను రూ.5 లక్షలకు పెంచాలన్నది ఎన్నో ఏళ్లుగా ఉన్న ప్రజల కోరికని తెలిపారు.

వేతన జీవుల, మధ్యతరగతి ప్రజల కోరికను తమ ప్రభుత్వం నెరవేర్చబోతోందని సంతోషం వ్యక్తం చేశారు. ‘ఆయుష్మాన్ భారత్’ ద్వారా 50 కోట్ల మందికి, ‘స్వచ్ఛభారత్’ ద్వారా 9 కోట్ల మంది ప్రజలకు ప్రయోజనం చేకూరిందని అన్నారు. ఈ బడ్జెట్ 12 కోట్ల మంది రైతులకు నేరుగా ప్రయోజనం చేకూర్చిందని,  మూడు కోట్ల మంది పన్ను చెల్లింపుదారులకు ప్రయోజనం చేకూరుతుందని వివరించారు. ఈ ఇంటరీమ్ బడ్జెట్ కేవలం ట్రైయిలర్ మాత్రమేనని అయితే ఎన్నికల తరువాత మరిన్నీ సంక్షేమ పథకాలు అమలు అవుతాయన్న ప్రధాని చెప్పుకోచ్చారు.

దేశంలోని ప్రతి వర్గానికి మేలు కలగాలన్నదే తమ ఆశయమని కేంద్ర ఆర్థిక శాఖ తాత్కాలిక మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. లోక్ సభలో కేంద్ర బడ్జెట్ ను ప్రవేశపెట్టిన అనంతరం, మీడియాతో ఆయన మాట్లాడుతూ, దేశ సమగ్ర వికాసమే ప్రధాని మోదీ లక్ష్యమని స్పష్టం చేశారు. ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా రైతులకు ఏటా రూ.6 వేల చొప్పున చెల్లించాలన్న నిర్ణయం చారిత్రాత్మకమైందని, ఈ ఆర్థిక సాయం చిన్న రైతులకు గొప్ప ఊరట అని అన్నారు.

రైతుల కోసం తాము తీసుకున్న నిర్ణయం ఇంత వరకూ ఎవరూ తీసుకోలేదని, ఈ పథకం ద్వారా 12.5 కోట్ల మంది రైతులకు మేలు కలుగుతుందని అన్నారు. ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకాన్ని 2018 డిసెంబర్ నుంచే అమలు చేయాలని నిర్ణయించినట్టు స్పష్టం చేశారు. అసంఘటిత రంగ కార్మికులకు పింఛన్ అందించే పథకం కూడా చాలా గొప్పదని, దీని ద్వారా కోట్లాది మందికి ప్రయోజనం కలుగుతుందని పీయూష్ గోయల్ అన్నారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Interim budget  Union budget  piyush goel  PM Modi  income tax  

Other Articles