Ballooning NPA controlled under BJP govt మార్చి వరకు ప్రతీ ఇంటికీ విద్యుత్ కాంతులు: పియూష్

Piyush goyal announces 1 5 times hike in msp annual income support

budget 2019, budget 2019 date, budget, economic survey 2019, union budget 2019, piyush goyal, budget 2019 expectations, interim budget 2019, interim budget 2019 High lights, finance minister of india 2019, finance minister of india, budget 2019 time, interim meaning, vote on account, budget 2019 india, 2019 budget date, India budget 2019-20, when is budget 2019, interim budget meaning, union budget, what is interim budget, budget timing, budget news

For welfare of farmers and for doubling their income, historic decision taken to increase MSP by 1.5 times the production cost for all 22 crops," Finance Minister Piyush Goyal said.

మార్చి వరకు ప్రతీ ఇంటికీ విద్యుత్ కాంతులు: పియూష్

Posted: 02/01/2019 11:58 AM IST
Piyush goyal announces 1 5 times hike in msp annual income support

కేంద్రంలోని ప్రధాని నరేంద్ర మోదీ సర్కారు దేశంలోని ప్రతీ ఇంటిలో విద్యుత్ కాంతులను వెదజల్లేందుకు చిత్తశుద్దితో కృషి చేస్తుందని అర్థిక మంత్రి పియూష్ గోయల్ అన్నారు. ఓటాన్ అకౌంట్ బడ్జట్ ను పార్లమెంటులో ప్రవేశపెడుతున్న ఆయన.. మార్చి వరకు దేశంలోని అన్ని ఇల్లకు విద్యుత్ కనెక్షన్లు ఇచ్చామన్నారు. 22 రకాల పంటలకు మద్దతు ధర పెంచామని అన్నారు. ప్రధాన మంత్రి సడక్ యోజనా పథకం కింద దేశంలో వేగంగా రహదారుల నిర్మాణం చేపడుతున్నామన్నారు.

ఇందుకోసం రూ.19 వేల కోట్లు ఖర్చు చేశామని చెప్పారు. ఇప్పటివరకూ రూ.3వేల కోట్ల పేదల ధనం ఆదా అయిందని చెప్పిన గోయల్.. దీంతో గ్రామీణ పట్టణ ప్రాంతల మధ్య అంతరం తొలగిపోయేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. 2014కు ముందు బస్సు సౌకర్యం లేని అన్ని గ్రామాలకు ఆ సౌకర్యం కల్పించాం. గ్రామీణ ప్రాంతాల్లో జీవన ప్రమాణాలను మెరుగు పరిచేందుకు చర్యలు తీసుకుంటున్నాం. గ్రామీణ సడక్ యోజనలో భాగంగా మూడింతల రహదారుల నిర్మాణం పెరిగిందని అన్నారు.

గ్రామీణ భారతంలో జీవన ప్రమాణాలను మెరుగు పరిచేందుకు చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. పట్టణ ప్రాంతాలకు ధీటుగా గ్రామీణ ప్రజలకు కూడా అన్ని మౌలిక వసతులు కల్పించేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు. మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి పథకానికి రూ.60వేల కోట్లు ఖర్చు చేశాం. అంతేకాదు దేశంలోని ప్రజలకు అయుష్మాన్ భారత్ పథకంలో కార్పోరేట్ వైద్యాన్ని అమల్లోకి తీసుకువచ్చామని అన్నారు. దీని ద్వారా దేశంలో 50 కోట్ల మందికి లబ్ది చేకూరనుందని తెలిపారు.

తమ ప్రభుత్వం అవినీతి రహిత ప్రభుత్వమన్నారు. రేరా చట్టం ద్వారా బినామీ లావాదేవీలను నిరోధించగలిగినది తమ ప్రభుత్వమేనన్నారు. మా ప్రభుత్వ పాలన దేశంలో ప్రతి ఒక్కరి ఆత్మ విశ్వాసాన్ని పెంచిందని తెలిపారు. నరేంద్రమోడీ ప్రభుత్వం ప్రతి కార్యక్రమాన్ని నిజాయతీగా అమలు చేస్తోందని తెలిపారు. పరారీలో ఉన్న ఆర్థిక నేరగాళ్లను దేశానికి తిరిగి తీసుకురావడానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు.

దేశంలో అర్థికంగా వెనకుబడిన వర్గాలకు న్యాయం చేసే దిశగా పది శాతం రిజర్వేషన్ అమల్లోకి తీసుకువచ్చింది తామేనన్నారు. ఇక దేశంలో అధికంగా వున్న ప్రజలు ఆరాద్యంగా కొలిచే గోవుల రక్షణకు కూడా కమీషన్ వేస్తున్నామని చెప్పారు పియూష్ గోయల్. గో రక్షణకు రూ.750 కోట్ల రూపాయలను బడ్జెట్ లో కేటాయిస్తున్నట్లు చెప్పారు. రాష్ట్రీయ గోకుల్ యోజన పథకం కింది గో రక్షణ చేపట్టనున్నట్లు చెప్పారు. ఇదే విధంగా మత్స్యశాఖకు కూడా ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. గ్రామీణ భారతంలో 98శాతం మరుగుదొడ్లు నిర్మించిన ఘటన కూడా కేంద్ర ప్రభుత్వానిదేనన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Interim budget  Union budget  piyush goel  PM Modi  indian economy  GDP  

Other Articles